ఆదివారం, జులై 20, 2014

సీతకోక చిలకలమ్మా...

పొత్తిళ్ళలో చిట్టి పుత్తడిబొమ్మ లాంటి పాపాయిని పొదువుకున్న అమ్మ ఆనందం తెలియాలంటే ఆడజన్మ ఎత్తాల్సిందేనట... పాపలను సీతాకోక చిలుకలతోనూ సెలయేటితోనూ పోలూస్తూ అమ్మకి పాపాయి ఎంత అపురూపమో వివరిస్తూ సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటి... మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు లేదా ఇక్కడ వినవచ్చు.



చిత్రం : సొగసు చూడ తరమా (1995)
సంగీతం : రమణి-ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అనురాధా శ్రీరాం

ఆ... ఆ... ఆ... ఆ...

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మా బ్రహ్మా

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా


కుహుకుహూ కూసే కోయిలా ఏదీ పలకవే ఈ చిన్నారిలా
మిలమిలా మెరిసే వెన్నెలా ఏదీ నవ్వవే ఈ బుజ్జాయిలా
అందాల పూదోట కన్నా చిందాడు పసివాడే మిన్నా
బుడత అడుగులే నడిచేటివేళలో పుడమితల్లికెన్ని పులకలో...

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా 

  
గలగలా వీచే గాలిలా సాగే పసితనం తీయని ఒకవరం
ఎదిగిన ఎదలో ఎప్పుడూ నిధిలా దాచుకో ఈ చిరు జ్ఞాపకం
చిరునవ్వుతో చేయి నేస్తం చీమంత అయిపోదా కష్టం
పరుగు ఆపునా పడిపోయి లేచినా అలుపు సొలుపు లేని ఏ అలా...

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా


పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మా బ్రహ్మా

సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా


2 comments:

విజువల్ గా ఈ పాట సిరివెన్నల గారి భావాలకి సరి పోయే దృశ్య రూపమనిపించదు..అందుకే మనసు కెమేరా తో మాత్రమే చూడాలని నా ఒపీనియన్..

అవునండీ గుణశేఖర్ గారు చిత్రీకరణ విషయంలో పెద్దగా శ్రద్దపెట్టలేదనిపిస్తుంది ఈ పాట విషయంలో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.