సిరిసిరిమువ్వ సినిమాలోని ఓ అందమైన పాట ఈరోజు మీకోసం. ఇందులో వేటూరి గారి సాహిత్యం నాకు బాగా నచ్చుతుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.
చిత్రం : సిరిసిరిమువ్వ (1976)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
అందరికీ అందనిదీ పూచిన కొమ్మా
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆఆఆ...
పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక
పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
నిదురించే పెదవిలో పదముందీ పాడుకో
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా...
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
అందరికీ అందనిదీ పూచిన కొమ్మా
ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ఆ రాణి పాదాల పారాణి జిలుగులో
నీ రాజభోగాలు పాడనీ తెలుగులో
ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో
ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో
గుడిలోని దేవతని గుండెలో కలుసుకో
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా...
అందానికి అందం ఈ పుత్తడిబొమ్మా
అందరికీ అందనిదీ పూచిన కొమ్మా
వచనం: ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
ముందు జన్మ వుంటే ఆకాలి మువ్వనై పుడతాను
పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ...
2 comments:
అదుకేనేమో స్త్రీ సౌందర్యానికి నిర్వచనం జయప్రదేనని సత్యజిత్ రే వంటి వారు కూడా ఒప్పుకోక తప్పలేదు మరి..
ఓహ్ ఆ విషయం నాకు తెలియదండీ... థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.