జంధ్యాల గారి సినిమాలలో హాస్యమే కాదు పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. జయమ్మునిశ్చయమ్మురా సినిమాలో ప్రేమ గురించిన ఈ చక్కని పాట చూడండి మీరూ ఒప్పుకుంటారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
జయమ్ము నిశ్చయమ్మురా (1989)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : ముళ్ళపూడి శాస్త్రి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల
అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
చలిలో రేపును సెగలే
ఎదలో మోగును లయలే
ఇది పెళ్ళికి పిచ్చికి నడుమ విచిత్రం
మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
మనసే మమతకు జోడై
మమతే మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమే మైత్రికి అందం
అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
ఓఓఓ... మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
కోటి నవ్వులా గూటి గువ్వవు
గోట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే ఆరును ఎద మంట
భామిని నో అంటే బాధలు మొదలంటా
సరి అనవా వరమిడవా సరసన నవరస మధురసమీవా
మధుకలశం హిమశకలం
మన చెలిమి మధురాతి మధురం
ఓఓఓఓ..అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
మండుటెండలో మంచుకొండవై
స్నేహసుధలలోన భాగమందుకో
ఒంటరి మనుగడలో ఊరట కలిమేలే
బాధల సుడివడిలో బాసట బలిమేలే
వేడుకలో వేదనలో తోడుగ నిలిచెడి స్నేహమే సంపద
అభిమతమో అభినయమో
ఈ ప్రేమ చతురాతి చతురం
4 comments:
ఈ పాట పాడింది సుశీల గారండి జానకి గారు కాదు
థాంక్స్ శశి గారు, పోస్ట్ లో సరిచేశాను.
బాబూ చిట్టీఈఈ..
హహహ థాంక్స్ శాంతి గారు :-))
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.