సోమవారం, జులై 07, 2014

మల్లెపూల మారాణికి...

ఏఎన్నార్, ఎన్టీఆర్ లాంటి వాళ్లకు పాట పాడేటపుడు బాలు గారు తన స్వరాన్ని కాస్త మార్చి మిమిక్రీ చేస్తూ వాళ్ళకు సూట్ అయ్యేలా పాడేవారు. అలా పూర్తిగా మార్చకుండా కాస్త ఒరిజినాలిటీని కూడా పలికిస్తూ పాడిన ఒక అందమైన పాట అమరజీవి సినిమాలోని ఈ పాట. పుట్టినరోజు పాటలు వెతికే సమయంలో అంత త్వరగా స్ఫురణకు రాని ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటలలో ఒకటి. మీరూ విని ఆనందించండి. వీడియో దొరకలేదు ఇక్కడ ఎంబెడ్ చేసినది ఫోటోలతో చేసిన ప్రజంటేషన్. యూట్యూబ్ పని చేయకపోతే ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం: అమరజీవి (1983)
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: బాలు

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ

లలల్లలా..లల్లల్లలా..లల్లల్లలా..

పొగడ పూలైనా.. పొగడే అందాలే
మెరిసే మలిసంజెవేళలో
మల్లీ మందారం.. పిల్లకి సింగారం
చేసే మధుమాసవేళలో
నా రాగమే నీ ఆరాధనై
చిరంజీవిగా దీవించనా
Happy Birthday to you !

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ

లలల్లలా..లల్లల్లలా..లల్లల్లలా..

రెల్లు చేలల్లో.. రేయీ వేళల్లో 
కురిసే వెన్నెల్ల నవ్వుతో
పుట్టే సూరీడు.. బొట్టై ఏనాడు 
మురిసే ముత్తైదు శోభతో
నీ సౌభాగ్యమే నా సంగీతమై 
ఈ జన్మకీ జీవించనా
Happy Birthday to you!

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ

మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి
గున్నమావి పందిళ్ళలోనా..ఆ..
కన్నెజాజి ముంగిళ్ళలోనా..హా..
కోకిలమ్మ పాటకచేరీ
  

4 comments:

'గున్నమావి పందిళ్ళలోనా..
సన్నజాజి ముంగిళ్ళ లోనా'..ఈ లైన్స్ పాడేటపుడు బాలూ గారి గొంతులోని ఇంటెన్సిటి గుండెల్లో తేనె జలపాతాలు కురిపిస్తుంది..

నిజమండీ కొన్ని పాటలను అలా తేనెలు తాగి మరీ పాడతారేమో బాలుగారు... విన్న ప్రతీసారి అంత మధురమైన అనుభూతిని మనకి అందిస్తాయి.

నిజం నా స్నేహితురాలు చిన్ని కు ప్రతి సంవత్సరం ఈ పాట ను అంకితం చేస్తాను
చిన్న చిన్ని నిజమైన స్నేహితులు

థాంక్స్ ఫర్ ద కామెంట్ శివ గారు...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.