ఆదివారం, జులై 27, 2014

శ్రావణ వీణ స్వాగతం...

చిరుజల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈరోజునుండి మొదలవుతున్న శ్రావణమాసానికి ఈ చక్కని పాటతో ఆహ్వానం పలుకుదామా. ఈ పాటలో శ్రీదేవి డాన్స్ చాలా బాగుంటుంది తనని చిత్రీకరించడంలో వర్మ తన అభిమానమంతా చూపించాడనిపిస్తుంటుంది. పాట బీట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. పై వీడియోలో పాటకు ముందు వచ్చే శ్రావణ వీణ బిట్ ఉంటుంది. పూర్తి పాట ఈ క్రింది వీడియో లో చూడచ్చు. చిత్రం : క్షణం క్షణం (1991)
సంగీతం : ఎమ్. ఎమ్. కీరవాణి 
సాహిత్యం :  వెన్నెలకంటి
గానం : నాగుర్ బాబు(మనో), చిత్ర, డా.గ్రబ్    

శ్రావణ వీణ... స్వాగతం...
స్వరాల వెల్లువ వెల్ కమ్
లేత విరిబాల నవ్వమ్మా ఆ...నందంలో..

జుంబాయే హాగుంబహేయ జుంబాయే ఆగుంబహేయ
జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగో హహై
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
జుంబాయే హాగుంబహేయ హైగో హైగో హైగో హహై

చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాయే హాగుంబహేయ జుంబాయే హాగుంబహేయ
వయసాగనిది రేగినది సరసములోన
చలిదాగనిది రేగినది సరసకు రానా
కల తీరదులే తెలవారదులే
ఇది చక్కని చిక్కని చక్కిలిగిలి
చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాయే హాగుంబహే

అందిస్తున్నా వగరే చిరుచిగురే తొడిగే
చిందిస్తున్న సిరులే మగసిరులే అడిగే
రమ్మంటున్నా ఎదలో తుమ్మెదలే పలికే
ఝుమ్మంటున్న కలలో వెన్నెలలే చిలికే
గలగలమని తరగల తరగని కల కదిలిన కథలివిలే
కలకలమని కులుకుల అలసులుగని చిలికిన సుధలివిలే
చెలువనిగని కలువల చెలువులు గని నిలువని మనసిదిలే
అలుపెరుగని అలరుల అలలనుగని
తలపులు తెలిపిన వలపుల గెలుపిదిలే
తలపడకిక తప్పదులే హే..హే..

చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది

ఊకొట్టింది అడవే మన గొడవే వింటూ
జోకొట్టింది ఒడిలో ఉరవడులే కంటూ
ఇమ్మంటుంది ఏదో ఏదేదో మనసు
తెమ్మంటుంది ఎంతో నీకంతా తెలుసు

అరవిరిసిన తలపుల కురిసెను కల కలసిన మనసులలో
పురివిరిసిన వలపుల తెలిపెను కథ పిలుపుల మలుపులలో 

ఎద కొసరగ విసిరెను మధువుల వల అదిరిన పెదవులలో
జత కుదరగ ముసిరెను అలకల అల చిలకల పలుకులు

చిలికిన చినుకులలో తొలకరి చిరుజల్లులలో


చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది
జుంబాయే హాగుంబహే
చెలి చెంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే
జుంబాయే హాగుంబహే ఆ జుంబాయే హాగుంబహే

లేత విరిబాల నవ్వమ్మా...

3 comments:

I give more marks to RGV over KRR in portraying Sridevi beautifully. She was amazing in both kshana kshanam and Govinda govinda with her beauty and expressions. Andama anduma and tella cheeraku takadhimi songs are also worth remembering here.

$

ఝల్లు మనే వర్షం..జిల్లుమనే గాలి..అందులోనూ శ్రీదేవి..నిజంగా వర్షం లో తడిసి పోతున్న ఫీలింగ్..పిక్చరైజేషన్ లో మనమే హైలైట్ అయినా, ఒరిజినల్ మాత్రం ఇదండీ(ముఖ్యంగా స్టార్టింగ్ లో).. https://www.youtube.com/watch?v=EuLf2JeRwNk..

థాంక్స్ సిద్ గారు... క్షణక్షణం ఓకే కానీ గోవిందా గోవిందా లో శ్రీదేవి కేవలం కొన్నిచోట్లే నచ్చుతుందండీ నాకు. మీరు అలా రామూకి మార్కులు వేసేస్తే ఎలాగండీ జగదేకవీరుడు అతిలోకసుందరి లో ఇంద్రజని ఎలా మర్చిపోగలం అసలు.

థాంక్స్ శాంతి గారు... అవునండీ ఈ పాట చిత్రీకరణ చాలా చాలా బాగుంటుంది. ఈపాట కూడా ఇన్ స్పైర్డ్ అన్న విషయం నాకు తెలియదండీ.. థాంక్స్ ఫర్ ద లింక్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.