ఆదివారం, జులై 13, 2014

నవ్వులు రువ్వే పువ్వమ్మా...

మహదేవన్ గారి పాటలంటేనే ఒక మధురమైన బాణిలో అలరిస్తాయి ఇక ఆత్రేయ గారి సాహిత్యమ్ తోడైతే చెప్పేదేముంది. ఈ చక్కని పాట  మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : గాజుల కిష్టయ్య (1975)
సంగీతం : కె .వి.మహదేవన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : S.P.బాలు

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళు
నీలా ఉండిపోతే చాలమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా

ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కేంపులలో నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన మొగ్గ సొగసు ఉందమ్మా

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
..ఆ..పువ్వమ్మా

ఈ తోట మొత్తమూ కమ్మినవి నీ దోరవయసు అందాలు
ఈ గాలి మత్తులో ఉన్నవీ నీ కన్నె మనసులో కైపులు
ఈ తోట మొత్తమూ కమ్మినవి నీ దోరవయసు అందాలు
ఈ గాలి మత్తులో ఉన్నవీ నీ కన్నె మనసులో కైపులు
నువ్వు ఒలకబోసే ఓంపుసొంపులకు ఒడిని పడతానుండమ్మా

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
..ఆ..పువ్వమ్మా

ఏ కొమ్మకు పూచావో ఏ కమ్మని తేనెలు తెచ్చావో ..
ఏ పాటకు మురిసేవో ఏ తేటికి విందులు చేసేవో
ఆ పాట గానో,తేటిగానో పది నాళ్ళున్నాచాలమ్మా 

నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా

ఉన్న నాలుగు నాళ్ళు
నీలా ఉండిపోతే చాలమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఆ..పువ్వమ్మా


2 comments:

జరీనా వహాబ్, వహీదా రెహ్మాన్, హేమ మాలిని, రేఖ, శ్రీదేవి..అందరూ దక్షిణాదిన విరిసి ఉత్తరాదిన మెరిసిన వారే..అందానికీ,అభినయానికీ చిరునామా సౌతిండియన్స్ అని ప్రూవ్ ఐనా మనవాళ్ళు పరభాషా కధానాయికల కోసం ప్రాకులాడటమెందుకో..

హ్మ్.. బహుశా వారి తరువాతి తరంలో దక్షిణాది నుండి అమ్మాయిలు సినీ కెరీర్ ని ఎంచుకోవడం తగ్గించారేమోనండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.