బుధవారం, జులై 23, 2014

మల్లె తీగవంటిదీ...

దర్శకురాలిగా విజయనిర్మల గారి మొదటి చిత్రమైన మీనా సినిమాలోని ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. మొదటి చరణంలో మల్లెపందిరిలా మగువ కూడా ఆసరా కోసం ఎలా చూస్తుందో వివరిస్తూ రెండో చరణంలో కుటుంబంలో ఆమె పోషించే ముఖ్యమైన పాత్రలను కూడా వివరించే ఈ చక్కటి పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : మీనా (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : దాశరథి
గానం : పి.సుశీల

మల్లె తీగవంటిదీ మగువ జీవితం
మల్లె తీగవంటిదీ మగువ జీవితం
చల్లనిపందిరి వుంటే
అల్లుకొపోయేనూ అల్లుకొ పోయేనూ 
మల్లె తీగవంటిదీ మగువ జీవితం

తల్లి తండ్రుల ముద్దూమురిపెం
చిన్నతనం లో కావాలీ
తల్లి తండ్రుల ముద్దూమురిపెం
చిన్నతనం లో కావాలీ
ఇల్లాలికి పతి అనురాగం
ఎల్లకాలమూ నిలవాలి
ఇల్లాలికి పతి అనురాగం
ఎల్లకాలమూ నిలవాలి
తల్లికి పిల్లల ఆదరణ
పండు వయసులో కావాలీ
ఆడవారికీ అన్నివేళలా
తోడూనీడ వుండాలీ
తోడూనీడ వుండాలీ 

మల్లె తీగవంటిదీ మగువ జీవితం
చల్లనిపందిరి వుంటే
అల్లుకుపోయేనూ అల్లుకుపోయేనూ 
మల్లె తీగవంటిదీ మగువ జీవితం

నుదుట కుంకుమ కళ కళ లాడే
సుదతే ఇంటికి శోభా
నుదుట కుంకుమ కళ కళ లాడే
సుదతే ఇంటికి శోభా
పిల్లల పాపలప్రేమగ పెంచే
తల్లే ఆరని జ్యోతీ
పిల్లల పాపలప్రేమగ పెంచే
తల్లే ఆరని జ్యోతీ
అనురాగం తో మనసును దోచే
వనితే మమతల పంటా
జన్మను ఇచ్చి జాతిని నిలిపే
జననియె జగతికి ఆధారం
జననియె జగతికి ఆధారం 

మల్లె తీగవంటిదీ మగువ జీవితం
చల్లనిపందిరి వుంటే
అల్లుకుపోయేనూ అల్లుకుపోయేనూ 
మల్లె తీగవంటిదీ మగువ జీవితం

2 comments:

నాకు తెలిసి యద్దనపూడిగారి నవలని యే మాత్రం డీవియేట్ చేయకుండా తీసిన ఏకైక సినిమా..హేట్సాఫ్ టు విజయ నిర్మల గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.