జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యం అనదగిన సినిమా ఆనందభైరవి. ఆయన హాస్య చిత్రాలతో ఎంతగా మెప్పించగలరో సీరియస్ కథలతోనూ అంతే ఆకట్టుకోగలరు అని నిరూపించిన సినిమా. ఈ సినిమాలోని సంగీత సాహిత్యాలు, నాట్యమూ చాలా బాగుంటాయి. ఈ సినిమాలోని పాటలలో వేటూరి గారి ప్రతిభకు అద్దంపట్టే ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాటకు చక్కని వ్యాఖ్యానం ఇక్కడ చదవవచ్చు, ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఆనందభైరవి (1984)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
చైత్రము కుసుమాంజలి
ఆఆ.ఆఅ.ఆఆ...
చైత్రము కుసుమాంజలి
పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు
నిసగ సగమ గమపసనిస మపగ
పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు
పలికే మరందాల అమృత వర్షిణి
పలికే మరందాల అమృత వర్షిణీ..
పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు
పలికే మరందాల అమృత వర్షిణి
పలికే మరందాల అమృత వర్షిణీ..
చైత్రము కుసుమాంజలి
పమగస నిసగమ
చైత్రము కుసుమాంజలి
వేసవిలో అగ్నిపత్రాలు రాసే
విరహిణి నిట్టూర్పులా కొంత సాగి
గగగ దసనిదమగ సరిగా..
దాద సాస గాగ మాద మదస..
వేసవిలో అగ్నిపత్రాలు రాసే
విరహిణి నిట్టూర్పులా కొంత సాగి
జలద నినాదాల పలుకు మృదంగాల
వార్షుక జలగంగలా తేలిఆడే
నర్తనకీ, కీర్తనకీ, నాట్య కళాభారతికీ
విరహిణి నిట్టూర్పులా కొంత సాగి
జలద నినాదాల పలుకు మృదంగాల
వార్షుక జలగంగలా తేలిఆడే
నర్తనకీ, కీర్తనకీ, నాట్య కళాభారతికీ
చైత్రము కుసుమాంజలి
పమగస నిసగమ
చైత్రము కుసుమాంజలీ..
శయ్యలలో కొత్త వయ్యారమొలికే
శరదృతుకావేరి లా తీగ సాగి
గగగ దసనిదమగ సరిగా..
శరదృతుకావేరి లా తీగ సాగి
గగగ దసనిదమగ సరిగా..
దాద సాస గాగ మాద మదస..
శయ్యలలో కొత్త వయ్యారమొలికే
శరదృతుకావేరి లా తీగ సాగి
శరదృతుకావేరి లా తీగ సాగి
హిమజల పాతాల, సుమశర బాణాల
హిమజల పాతాల, సుమశర బాణాల
మరునికి మర్యాదలే చేసి చేసి చలి ఋతువే,
హిమజల పాతాల, సుమశర బాణాల
మరునికి మర్యాదలే చేసి చేసి చలి ఋతువే,
సరిగమలౌ నాద సుధా మధువనికీ
చైత్రము కుసుమాంజలి
పమగస నిసగమ
చైత్రము కుసుమాంజలి
2 comments:
పీనాసితనం పై పూరించిన నవ్వుల శంఖం 'అహ నా పెళ్ళంట '..
పిల్లల్ని కని అనాధలుగా వదిలేసే తలి తండ్రులపై పేల్చిన సరదా పటాకా 'చంటబ్బాయ్ '..
వరకట్నం పై విల్లు సారించిన నవరస రేఖ 'శ్రీవారికి ప్రేమ లేఖ '..
నవ్వు నాలుగు విధాల చేటు..కాదు, కాదు..నవ్వుల పాలవకుండా బ్రతకడం గ్రేటు అని చెప్పిన జంధ్యాల గారికి హాస్యాభివందనం..
థాంక్స్ శాంతి గారు... ఇంతటి మేలైన హాస్యాన్నందించినందుకు జంధ్యాల గారికి తెలుగు వారంతా ఎప్పటికీ రుణపడిపోయి ఉంటామండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.