ఆకుల అప్పలరాజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆకుల అప్పలరాజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, ఏప్రిల్ 25, 2016

తనువా హరిచందనమే...

కథానాయకురాలు చిత్రంలోనుండి ఓ మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కథానాయకురాలు (1970)
సంగీతం : ఆకుల అప్పల రాజ్
సాహిత్యం : 
విజయ రత్నం 
గానం : బాలు, సుశీల

తనువా.. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే

తనువా... ఉహు.. హరిచందనమే..
పలుకా.. ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

 
తనువా...ఉహు.. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

తనువా
ఉహు..హరిచందనమే..
 
నీ సోయగాలు కనుసైగ చేసే..
అనురాగ లతలు బంధాలు వేసే
ఉహు.. హ.. ఓహో 
నీ సోయగాలు కనుసైగ చేసే..
అనురాగ లతలు బంధాలు వేసే

హరివిల్లునై ఈ విరి బాణమే
హరివిల్లునై ఈ విరి బాణమే
గురి చూసి హృదయాన విసిరేయనా..
నిను చేరనా.. ఊ.. మురిపించనా..
 
తనువా...ఉహు.. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

నీకోసమే ఈ నవ పారిజాతం..
విరబూసి నీముందు నిలచిందిలే..
ఆ...ఆ...ఆ...
నీకోసమే ఈ నవ పారిజాతం..
విరబూసి నీముందు నిలచిందిలే

మధుపాయినై మరులూరించనా
మధుపాయినై మరులూరించనా
ఉయ్యాల జంపాలలూగించనా..
లాలించనా.. ఆ.. పాలించనా

తనువా... ఉహు.. హరిచందనమే..
పలుకా.. ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.