సినారె లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సినారె లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, జనవరి 05, 2021

చక్కాని గోపాల కృష్ణుడమ్మా...

శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : సి.నారాయణరెడ్డి 
గానం : జానకి, వసంత, సుమిత్ర 

హోయ్..
చక్కాని గోపాల కృష్ణుడమ్మా..
ముద్దుకృష్ణుడమ్మా 
ముద్దుకృష్ణుడమ్మా 
చిక్కాని నంద కుమారుడమ్మా..
వేణులోలుడమ్మా 
వేణులోలుడమ్మా  
హోయ్..
చక్కాని గోపాల కృష్ణుడమ్మా..
ముద్దుకృష్ణుడమ్మా  
చిక్కాని నంద కుమారుడమ్మా.. 
వేణులోలుడమ్మా  

దేవకి కడుపున పుట్టాడమ్మా..
యశోద యింటను పెరిగాడమ్మా
కాళీయునీ తలపైనెక్కి 
తకధిం ధిమ్మని ఆడెనమ్మా..
తకధిం ధిమ్మని ఆడెనమ్మా 

చక్కాని గోపాల కృష్ణుడమ్మా..
ముద్దుకృష్ణుడమ్మా  
చిక్కాని నంద కుమారుడమ్మా..
వేణులోలుడమ్మా  
చక్కాని గోపాల కృష్ణుడమ్మా..
ముద్దుకృష్ణుడమ్మా  
చిక్కాని నంద కుమారుడమ్మా..
వేణులోలుడమ్మా  

మధురా నగరిలో చల్లలమ్మబోదు 
దారి విడుము..కృష్ణా..కృష్ణా.. ఆఆఆఆ 
మధురా నగరిలో చల్ల లమ్మబోదు 
దారి విడుము..కృష్ణా..కృష్ణా.. ఆఆఆఆ  
నీపై మోహము ఓపగలేనే..
నీపై మోహము ఓపగలేనే..  
నీప తరువుకడ నిలువవే భామా..
నిలువవే ఓ భామా 

మాపటి వేళకు తప్పక వచ్చెద..
మా..ఆ..పటి వేళకు తప్పక వచ్చెద 
పట్టకురా కొంగు గట్టిగాను..కృష్ణా..
పట్టకురా కొంగు గట్టిగాను..కృష్ణా        
సాకులు చూపి చల్లగజారగ..
సాకులు చూపి చల్లగజారగ 
సమ్మతింపనే ఓ భామా..
నే సమ్మతింపనే..ఏ..ఓ భామా 

మాధవుడొక్కడే రాధికలం మేము 
ఒక్కని పొందుకై యిందరమున్నాము
మాధవుడొక్కడే రాధికలం మేము 
ఒక్కని పొందుకై యిందరమున్నాము
దేవుడు ఒక్కడే భక్తులు ఎందరో..
దేవుడు ఒక్కడే భక్తులు ఎందరో..
ఆ భావనలోనే కైవల్యముందిలే
మాధవుడొక్కడే రాధికలం మేము 
ఒక్కని పొందుకై యిందరమున్నాము


 

సోమవారం, జనవరి 04, 2021

జోహారు శిఖిపింఛ మౌళీ...

శ్రీ కృష్ణ విజయం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పటికీ ఈస్ట్ మన్ కలర్ లో చిత్రీకరించిన ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.  
  
        
చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : పి.సుశీల

జోహారు శిఖిపింఛ మౌళీ...
జోహారు శిఖిపింఛ మౌళీ.. ఇదె
జోహారు రసరమ్య గుణశాలి వనమాలి
జోహారు శిఖిపింఛ మౌళీ

కలికి చూపులతోనే చెలులను కరగించి..
కరకు చూపులతోనే అరులను జడిపించి..

కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి
నయగారమొక కంట... జయవీరమొక కంట..
నయగారమొక కంట జయవీరమొక కంట
చిలకరించి చెలువమించి నిలిచిన శ్రీకర నరవర సిరిదొర

జోహారు శిఖిపింఛ మౌళీ

నీ నాదలహరిలో నిదురించు భువనాలు...
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు...
నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావూ..
ఆఆ.ఆ.ఆఆఅ...
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగ యుగాల దివ్యలీల నెరపిన 
అవతారమూర్తి ఘనసారకీర్తి

జోహారు శిఖిపింఛ మౌళీ

చకిత చకిత హరిణేక్షణా వదన చంద్రకాంతులివిగో
చలిత లలిత రమణీ చేలాంచల చామరమ్ములివిగో
ఝలమ్ ఝళిత సురలలనా నూపుర కలరవమ్ములివిగో
మధుకర రవమ్ములివిగో మంగళ రవమ్ములివిగో
దిగంతముల అనంతముగ గుబాళించు
సుందర నందన సుమమ్ములివిగో

జోహారు శిఖిపింఛ మౌళీ 
 


ఆదివారం, డిసెంబర్ 27, 2020

పిల్లనగ్రోవి పిలుపు...

శ్రీకృష్ణ విజయం సినిమాలోని ఒక కమ్మని కన్నయ్య పాటను ఈరోజు తలచుకొందామా. పెండ్యాల గారి స్వరసారధ్యంలో హాయిగా సాగే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం, మీరూ వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1970)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

పిల్లనగ్రోవి పిలుపు... 
మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు.. 
ఒక మాధవునికే తెలుసు..
ఈ మాధవునికే తెలుసు

 
సుందరి అందెల పిలుపు
నా డెందమునందొక మెరుపు
నందకిశోరుని మనసు.. 
రతనాల బొమ్మకు తెలుసు...
ఈ రతనాల బొమ్మకు తెలుసు...

ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ
అహ..అహా...ఆ...అహ..అహా..ఆ...

వెన్న మీగడలు తిన్నావట..
వెన్నెలలో ఆడుకున్నావటా..
వెన్న మీగడలు తిన్నావట...
వెన్నెలలో ఆడుకున్నావటా...
ఎన్నో నేర్చిన వన్నెకాడవట...
ఏమందువో మరి నా మాట
ఏమందువో మరి నా మాట...

వెన్న మీగడలు తిన్నది నిజము...
ఎన్నో నేర్చితినన్నది నిజము
వెన్న మీగడలు తిన్నది నిజము...
ఎన్నో నేర్చితినన్నది నిజము
చిన్నారీ...ఈ.....చిన్నారీ! 
నీ కన్నుల బాసలు.. 
వెన్నుని దోచిన ఆ మాట నిజము..
వెన్నుని దోచిన మాట నిజము!

సుందరి అందెల పిలుపు..
నా డెందము నందొక మెరుపు
ఓ..పిల్లనగ్రోవి పిలుపు...
మెలమెల్లన రేపెను వలపు!
 
అహ..ఆ..ఆహా..ఆ..అహా..ఆ..
అందీ అందని అందగాడవని...
ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని...
ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్ధమేమిటో...
అలవోకగా కనుగొన్నాను..
అలవోకగా కనుగొన్నాను... 
ఆఆ..అహ..ఆ..ఆహా..ఆ..
ఎంత బేలవని అనుకున్నాను...
అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నాను...
అంత గడసరి తరుణివిలే
అష్ట భార్యలతో అలరే రాజును...
చెంగును ముడిచిన చెలువవులే...
చెలువవులే చెంగలువవులే...

పిల్లనగ్రోవి పిలుపు.. 
మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు.. 
ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు
 
ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ
అహ..ఆ...ఆ...అహ..ఆ..అహ...




గురువారం, డిసెంబర్ 24, 2020

ప్రియా ప్రియా మధురం...

శ్రీకృష్ణ సత్య చిత్రంలోని ఓ మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ కృష్ణ సత్య (1971)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, జానకి

ప్రియా ప్రియా మధురం
ప్రియా ప్రియా మధురం
ప్రియా ప్రియా మధురం
పిల్లనగ్రోవి పిల్లవాయువు
పిల్లనగ్రోవి పిల్లవాయువు
భలే భలే మధురం..అంతకు మించీ
ప్రియుని కౌగిలీ..ఎంతో ఎంతో మధురం

 

ఇన్నీ ఉన్నా సరసిజలోచన..
సరసన ఉంటేనె మధురాం
మనసిచ్చిన ఆ..అలివేణి
అధరం..మరీ మరీ మధురం
ప్రియా ప్రియా మధురం

ఏనాటి నా పూజాఫలమో
ఏజన్మలో పొందిన వరమో
అందరుకోరే శ్యామసుందరుడే
అందరుకోరే శ్యామసుందరుడే
నాపొందు కోరుట మధురం

 
సత్యా కృష్ణుల సరసజీవనం
సత్యా కృష్ణుల సరసజీవనం
నిత్యం నిత్యం మధురం..
ప్రతి నిత్యం అతి మధురం
ప్రతి నిత్యం అతి మధురం
ప్రియా ప్రియా మధురం

సవతులెందరున్నా..ఆ ఆ ఆ
సవతులెందరున్నా కృష్ణయ్యా
సత్యను వలచుట మధురం
భక్తికి రక్తికి లొంగని స్వామిని
కొంగున ముడుచుట మధురం
నా కడకొంగున ముడుచుట మధురం

  
ఈ భామామణి ఏమి పలికినా
ఈ భామామణి ఏమి పలికినా
ఔననుటే మధురం  
ఈ చెలి పలుకుల పర్యవసానం
ఇంకా ఇంకా..మధురం..
ప్రియా ప్రియా మధురం

నను దైవముగా నమ్మిన దానవు 
కడ కొంగున నను ముడువని దానవు 
చల్లని ఓ సతీ జాంబవతీ..ఈఈ..
చల్లని ఓ సతీ జాంబవతీ
నీ సాహచర్యమే మధురం 

ప్రాణ నాథా నీ పాద సేవలో 
పరవశించుట మధురం 
తరియించుటే మధురాతి మధురం


మంగళవారం, డిసెంబర్ 22, 2020

గోపీ మునిజన...

శ్రీ కృష్ణసత్య సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీ కృష్ణసత్య (1971)
సంగీతం : పెండ్యాల  
సాహిత్యం : సినారె 
గానం : జానకి  

గోపీ మునిజన 
హృదయ విహారీ
గోవర్థన గిరిధారి హరే
గోవర్థన గిరిధారి హరే
గోవర్ధన గిరిధారీ..

సర్వ వేదముల సారము నీవే 
సర్వ వేదముల సారము నీవే 
జపతపమ్ముల రూపము నీవే 
పరమ పదమునకు మార్గమునీవే
పరమ పదమునకు మార్గమునీవే
భవబంధముక్తికి మూలమునీవే
 
గోవర్ధన గిరిధారీ
గోవర్ధన గిరిధారీ

ఏనాడు ధర్మము గతి తప్పునో
ఆనాడే నీవవతరింతువు 
ఏనాడు ధర్మము గతి తప్పునో
ఆనాడే నీవవతరింతువు 
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ 
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ 
పరమావధియైన పరమాత్మా

గోవర్థన గిరిధారి హరే 
గోవర్ధన గిరిధారీ
గోవర్ధన గిరిధారీ
గోవర్ధన గిరిధారీ
  


శనివారం, డిసెంబర్ 05, 2020

ఏ పారిజాతమ్ములీయగలనో...

ఏకవీర చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే  వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసినది స్వరాభిషేకంలో బాలు గారు పాడిన వీడియో. అది ఇక్కడ చూడవచ్చు. ఏ పారిజాతమ్ములు బిట్ వీడియో ఇక్కడ చూడవచ్చు. కలువ పూల చెంత చేరి బిట్ వీడియో ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం : ఏకవీర (1969) 
సంగీతం : కె.వి.మహదేవన్ 
సాహిత్యం : సినారె 
గానం : బాలు 

ఏ పారిజాతమ్ములీయగలనో.. సఖీ 
గిరి మల్లికలు తప్ప.. గరికపూవులు తప్ప 
ఏ కానుకలను అందించగలనో.. చెలీ 
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప 

జగతిపై నడయాడు చంచలా వల్లికా 
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా... 
శరదిందు చంద్రికా... 

నీవు లేని తొలి రాతిరి.. 
నిట్టూర్పుల పెను చీకటి 
నీవు లేని విరి పానుపు.. 
నిప్పులు చెరిగే కుంపటి 

విరులెందుకు.. సిరులెందుకు 
మనసు లేక.. మరులెందుకు 
తలపెందుకు.. తనువెందుకు 
నీవు లేక.. నేనెందుకు.. 
నీవు లేక.. నేనెందుకు..

కలువపూల చెంత చేరి
కైమోడుపు సేతునూ
నా కలికి మిన్న కన్నులలో
కలకలమని విరియాలనీ

మబ్బులతో ఒక్క మారు
మనవి చేసికొందును 
నా అంగన ఫాలాంగణమున 
ముగురులై కదలాలనీ

చుక్కలతో ఒక్కసారి సూచింతును
నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల 
మల్లియలై మొలవాలనీ 

పూర్ణ సుధాకర బింబమ్మునకు 
వినతి సేతును నా పొలతికి 
ముఖ బింబమై 
కళలు దిద్దుకోవాలనీ

ప్రకృతి ముందు 
చేతులెత్తి ప్రార్ధింతును 
కడసారిగా నా రమణికీ 
బదులుగా ఆకారం 
ధరియించాలనీ.. 


 

శుక్రవారం, నవంబర్ 27, 2020

నలుగురు నవ్వేరురా...

విచిత్ర కుటుంబం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : విచిత్ర కుటుంబం (1969)
సంగీతం : టి.వి.రాజు   
సాహిత్యం : సి.నారాయణరెడ్డి    
గానం : సుశీల

నలుగురు నవ్వేరురా స్వామీ
నలుగురు నవ్వేరురా గోపాల
నడివీధిలో నా కడకొంగు లాగిన
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా.. అవ్వ..
నలుగురు నవ్వేరురా..

చల్లచిలికే వేళ చక్కిలిగిలి చేసి
దండలల్లే వేళ రెండు కళ్ళూ మూసి
చల్లచిలికే వేళ... చల్లచిలికే వేళ..
చల్లచిలికే వేళ చక్కిలిగిలి చేసి
దండలల్లే వేళ రెండు కళ్ళూ మూసి
ఒంటిగ యేమన్నా... ఆఆఅ...ఆఆఅ..
ఒంటిగ యేమన్న ఊరకుంటిని గాని
రచ్చపట్టున నన్ను రవ్వచేయ పాడికాదులే

నలుగురు నవ్వేరురా గోపాలా
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..ఆఆఅ...
నలుగురు నవ్వేరురా...

పొన్నచెట్టున చేరి పొంచినట్టుల కాదు
చీరెలను కాజేసి కేరినట్టుల కాదు
పొన్నచెట్టున చేరి పొంచినట్టుల కాదు
చీరెలను కాజేసి కేరినట్టుల కాదు
కన్నెమనసే వెన్న గమనించరా కన్న
అన్ని తెలిసిన నీవె ఆగడాలు సేయనేల ఔరా

నలుగురు నవ్వేరురా గోపాలా
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..ఆఅ..ఆఅ.
నలుగురు నవ్వేరురా.. అవ్వ
నలుగురు నవ్వేరురా...ఆఆఅ..


శనివారం, నవంబర్ 21, 2020

మదన మోహనుడే...

అక్బర్ సలీం అనార్కలి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం : సి.రామచంద్ర   
సాహిత్యం : సినారె   
గానం : ముస్తఫాఖాన్, సుశీల 

మదన మోహనుడే 
మదిలో ఒదిగి ఉన్నాడే 
కనరాడే..

మదన మోహనుడే 
మదిలో ఒదిగి ఉన్నాడే 
కనరాడే..

పొద్దుట నిలువుటద్దమున 
ఆ ముద్దు మోమే కంటినే
ముద్దియా ఇంత మోహమా..
అన్నట్టుగా వింటినే
అది విని మువ్వలే 
అదిరిపడినవే

మదన మోహనుడే 
మదన మోహనుడే 
మదన మోహనుడే 
మదన మోహనుడే 

నీటిలో కడవ నింపగా
ఆ నీల రూపుడే తోచెనే
ఏటిలో పైట జారగా
నీటి మాటే మరచితినే
ననుగని యమునయే 
నవ్వుకున్నదే 

మదన మోహనుడే 
మదన మోహనుడే 
మదన మోహనుడే 
మదన మోహనుడే 
మదన.. మోహనుడే.. 
 

ఆదివారం, నవంబర్ 15, 2020

భువన మోహిని...

భామా విజయం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భామా విజయం (1967)
సంగీతం : టి.వి.రాజు 
సాహిత్యం : సినారె 
గానం : ఘంటసాల 

భువన మోహిని
అవధి లేని యుగయుగాల 
అమృతవాహిని

భువన మోహిని
అవధి లేని యుగయుగాల 
అమృతవాహిని

నీల నీల కుంతలా 
విలోల మృదుల చేలాంచల 
తరళ తరళ భావ గగన
సురభిళ నవ చంచలా 
మధుర మధుర హాసిని
మదన హృదయ వాసిని

భువన మోహిని
అవధి లేని యుగయుగాల 
అమృతవాహిని

మద మరాళ గామిని
మంజుల మధు యామిని
ఝళం ఝళిత మణి నూపుర
లలిత లయ విలాసిని
రాగ తాళ భావ రంజని
తథీం తనన 
తథీం తనన 
తథీం తనన 

భువన మోహిని
అవధి లేని యుగయుగాల
అమృతవాహిని
 

శనివారం, నవంబర్ 14, 2020

జోహారు శిఖిపింఛ మౌళీ...

మిత్రులందరకూ దీపావళి శుభాకాంక్షలు అందచేసుకుంటూ సుశీల గారు పాడిన ఓ అద్భుతమైన పాటను ఈ రోజు తలచుకుందాం. సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పటికీ ఈస్ట్ మన్ కలర్ లో చిత్రీకరించిన ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. 
  
        
చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : పి.సుశీల

జోహారు శిఖిపింఛ మౌళీ...
జోహారు శిఖిపింఛ మౌళీ.. ఇదె
జోహారు రసరమ్య గుణశాలి వనమాలి
జోహారు శిఖిపింఛ మౌళీ

కలికి చూపులతోనే చెలులను కరగించి..
కరకు చూపులతోనే అరులను జడిపించి..

కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి
నయగారమొక కంట... జయవీరమొక కంట..
నయగారమొక కంట జయవీరమొక కంట
చిలకరించి చెలువమించి నిలిచిన శ్రీకర నరవర సిరిదొర

జోహారు శిఖిపింఛ మౌళీ

నీ నాదలహరిలో నిదురించు భువనాలు...
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు...
నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావూ..
ఆఆ.ఆ.ఆఆఅ...
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగ యుగాల దివ్యలీల నెరపిన 
అవతారమూర్తి ఘనసారకీర్తి

జోహారు శిఖిపింఛ మౌళీ

చకిత చకిత హరిణేక్షణా వదన చంద్రకాంతులివిగో
చలిత లలిత రమణీ చేలాంచల చామరమ్ములివిగో
ఝలమ్ ఝళిత సురలలనా నూపుర కలరవమ్ములివిగో
మధుకర రవమ్ములివిగో మంగళ రవమ్ములివిగో
దిగంతముల అనంతముగ గుబాళించు
సుందర నందన సుమమ్ములివిగో

జోహారు శిఖిపింఛ మౌళీ 
 


శుక్రవారం, నవంబర్ 13, 2020

మ్రోగింది కళ్యాణ వీణా...

కురుక్షేత్రం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కురుక్షేత్రం (1977)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఆహహా..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ.. ఆహాహా..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..

ఆ..ఆ.. మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..

పిల్ల గాలితో నేనందించిన
పిలుపులే విన్నావో..ఓ..ఓ..
నీలి మబ్బుపై నే లిఖియించిన
లేఖలందుకున్నావో..
ఆ లేఖలే వివరించగా..
రస రేఖలే ఉదయించగా
ఆ లేఖలే వివరించగా..
రస రేఖలే ఉదయించగా
కల వరించి.. కలవరించి
కల వరించి.. కలవరించి..
పులకిత తనులత నిను చేరుకోగా..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..

మత్త కోకిలలు ముత్తైదువులై
మంగళ గీతాలు పాడగా..ఆ..
మయూరాంగనలు ఆట వెలదులై..
లయ లహరులపై ఆడగా..
నా యోగమే ఫలియించగా..
ఆ దైవమే కరుణించగా..
నా యోగమే ఫలియించగా..
ఆ దైవమే కరుణించగా..
సుమశరుడే పురోహితుడై..
సుమశరుడే పురోహితుడై..
శుభ ముహూర్తమే నిర్ణయించగా..ఆ..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..
నవ మోహన జీవన మధువనిలో..నా..ఆ..

మ్రోగింది కళ్యాణ వీణా..ఆ..ఆ..
మ్రోగింది కళ్యాణ వీణా..
   

మంగళవారం, నవంబర్ 10, 2020

చిరునవ్వుల తొలకరిలో...

చాణక్య చంద్రగుప్త సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఎనభైలలో నాకు రేడియో పరిచయం చేసిన అద్భుతమైన పాటలలో ఇదీ ఒకటి, అప్పట్లో తెగ వినే వాడిని. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చాణక్య చంద్రగుప్త (1977)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సినారె
గానం : బాలు,
సుశీల

హ..హ..హ..హ..హ

చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో
చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో

పలికెనులే.. హృదయాలే..
పలికెనులే.. హృదయాలే..
తొలివలుపుల కలయికలో


చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో

వసంతాలు దోసిట దూసి..
విసిరేను నీ ముంగిలిలో
తారలనే దివ్వెలు చేసి..
వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాడిగా...ఆ..ఆ
నీవే నా జీవనాడిగా..
ఎగిసేను గగనాల అంచులలో.. 
ఓ..ఓ.. విరియునులే ఆ గగనాలే..
నీ వెన్నెల కౌగిలిలో.. ఓ..ఓ..ఓ

చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో..ఓ


ఉరికే సెలయేరులన్నీ...
వొదిగిపోవు నీ నడకలలో
ఉరిమే మేఘా..ఆ.ఆ లన్నీ..
ఉలికి పడును నీ పలుకులలో
నీవే నా పుణ్యమూర్తిగా..ఆ..ఆ
నీవే నా పుణ్యమూర్తిగా..ఆ..
ధ్యానించు నా మధుర భావనలో..

ఓ..ఓ.. మెరియునులే ఆ భావనలే..
ఇరు మేనుల అల్లికలో..ఓ..ఓ
 
చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో..ఓ

ఆ..ఆ.. పలికెనులే.. హృదయాలే..
తొలివలుపుల కలయికలో.. ఓ..ఓ..ఓ..


చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో..
చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో..ఓ



సోమవారం, నవంబర్ 09, 2020

సరిసరీ వగలు తెలిసెర...

భక్తతుకారం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : భక్త తుకారాం (1973)
సంగీతం : పి.ఆదినారాయణరావు 
సాహిత్యం : డా. సి.నారాయణరెడ్డి
గానం : పి.సుశీల

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ.. 
 
చెంతకు రమ్మన చేరనంటినా... ఆ...
చెక్కిలినొక్కిన కూడదంటినా... ఆ...
చెంతకు రమ్మన చేరనంటినా... ఆ...
చెక్కిలినొక్కిన కూడదంటినా... ఆ...
తొలిఝామైన కానిదే
తొలిఝామైన కానిదే
తొందర ఎందుకు ఎందుకంటిరా..ఆ..

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ.. 
 
ఆ... మంచిగంధం పూయకముందే
మల్లెమొగ్గలు చల్లకముందే 
ఆ... మంచిగంధం పూయకముందే
మల్లెమొగ్గలు చల్లకముందే 
కులుకుటందెలు మోగకముందే
కొత్త జావళి పాడకముందే
గరిస నిపమప ససని ససనిసని
నినిప నినిపనిప
మగప మనిపసని పపాని
పమగమ గపామగ సనిస
ఆ... ఆ... ఆ...
కొత్త జావళి పాడకముందే
కంటి గిలుపుల జంట తలపుల
కొంటి చేతల కవ్వింతలింకేల చాలించవేరా

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ.. 
 
ఆ... పండువెన్నెల
పానుపు చేసి
పైట కొంగున వీవన వీచీ
వేడిముద్దులు కానుక చేసి
విడని కౌగిట బందీచేసి
ఎన్నడెరుగని
వన్నెతరుగని
కన్నెవలపులు అందించి
అందాలు చిందింతులేరా 

సరిసరీ వగలు తెలిసెర గడసరీ
చిగురు సొగసులు నీవే లేరా... ఆ...
సరిసరీ.. 


 

శనివారం, నవంబర్ 07, 2020

పిలిచే నా మదిలో...

ఆడబ్రతుకు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఆడబ్రతుకు (1965)
సంగీతం : విశ్వనాథన్ రామమూర్తి
సాహిత్యం : సినారె 
గానం : సుశీల  

పిలిచే నా మదిలో 
వలపే నీదే సుమా
పిలిచే నా మదిలో 
వలపే నీదే సుమా
రారాజు ఎవరైనా 
నా రాజు నీవే సుమా 

పిలిచే నా మదిలో 
వలపే నీదే సుమా
రారాజు ఎవరైనా 
నా రాజు నీవే సుమా 

పిలిచే నా మదిలో 
వలపే నీదే సుమా  

ప్రేమయే దైవమని 
భావించుకున్నాము
లోకమేమనుకున్నా 
ఏకమైవున్నాము
చావైన బ్రతుకైనా 
జంటగా ఉందాము

పిలిచే నా మదిలో 
వలపే నీదే సుమా  

చుక్కలే తెగిపోనీ 
సూర్యుడే దిగిరానీ
చుక్కలే తెగిపోనీ 
సూర్యుడే దిగిరానీ

ఈ ప్రేమ మారదులే 
ఈ జ్యోతి ఆరదులే
ఈ ప్రేమ మారదులే 
ఈ జ్యోతి ఆరదులే
ఎన్ని జన్మలకైనా 
ఈ బంధముండునులే

పిలిచే నా మదిలో 
వలపే నీదే సుమా
రారాజు ఎవరైనా 
నా రాజు నీవే సుమా
పిలిచే నా మదిలో 
వలపే నీదే సుమా
 


శుక్రవారం, నవంబర్ 06, 2020

అభినందన మందారమాల...

తాండ్రపాపారాయుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : తాండ్ర పాపారాయుడు (1986)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : ఏసుదాస్, సుశీల

అభినందన మందార మాల..
అభినందన మందార మాల..
అభినందన మందార మాల.. 
అధినాయక స్వాగత వేళ..ఆ..
అభినందన మందార మాల..

స్త్రీజాతికీ.. ఏనాటికీ.. స్మరణీయ 
మహనీయ వీరాగ్రణికి..
అభినందన మందారమాల.. 
అధినాయక స్వాగత వేళ..ఆ..

వేయి వేణువులు నిన్నే పిలువగ.. 
నీ పిలుపు నావైపు పయనించెనా
వేయి వేణువులు నిన్నే పిలువగ.. 
నీ పిలుపు నావైపు పయనించెనా

వెన్నెల కన్నెలు నిన్నే చూడగ..
వెన్నెల కన్నెలు నిన్నే చూడగ.. 
నీ చూపు నారూపు వరియించెనా
నీ చూపు నారూపు వరియించెనా..

నా గుండె పై నీవుండగా.. 
దివి తానే భువిపైనే దిగివచ్చెనా
అభినందన మందారమాల.. 
అలివేణి స్వాగత వేళ..ఆ..
అభినందన మందారమాల..

సౌందర్యమూ సౌశీల్యమూ.. 
నిలువెల్ల నెలకొన్న కలభాషిణికి
అభినందన మందారమాల..

వెండి కొండపై వెలసిన దేవర.. 
నెలవంక మెరిసింది నీ కరుణలో
వెండి కొండపై వెలసిన దేవర.. 
నెలవంక మెరిసింది నీ కరుణలో
 
సగము మేనిలో ఒదిగిన దేవత..
సగము మేనిలో ఒదిగిన దేవత.. 
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
నునుసిగ్గు తొణికింది నీ తనువులో..
ప్రియ భావమే లయ రూపమై.. 
అలలెత్తి ఆడింది అణువణువులో

అభినందన మందారమాల.. 
ఉభయాత్మల సంగమవేళ..ఆ..
అభినందన మందారమాల..
 

మంగళవారం, నవంబర్ 03, 2020

సరిలేరు నీకెవ్వరూ...

కంచుకోట చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 
 

చిత్రం : కంచుకోట (1967)
సంగీతం : కె.వి.మహాదేవన్  
సాహిత్యం : సినారె 
గానం : సుశీల, జానకి 

సరిలేరు నీకెవ్వరూ 
నరపాల సుధాకర 
సరిలేరు నీకెవ్వరూ
సరిలేరు నీకెవ్వరూ 
నరపాల సుధాకర 
సరిలేరు నీకెవ్వరూ
సురవైభవానా భాసుర కీర్తిలోనా
సురవైభవాన భాసుర కీర్తిలోనా
సరిలేరు నీకెవ్వరూ నరపాల
సుధాకర సరిలేరు నీకెవ్వరూ

సరిలేరు నీకెవ్వరూ 
రతిరాజ సుందరా 
సరిలేరు నీకెవ్వరూ
సరిలేరు నీకెవ్వరూ 
రతిరాజ సుందరా 
సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సరిలేరు నీకెవ్వరూ 
రతిరాజ సుందరా 
సరిలేరు నీకెవ్వరూ

ప్రజలను నీకంటి పాపలుగా కాచి
ఆ...
ప్రజలను నీకంటి పాపలుగా కాచి
పరరాజులదరంగ కరవాలమును దూసి
ప్రజలను నీకంటి పాపలుగా కాచి
పరరాజులదరంగ కరవాలమును దూసి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
శాంతిని వెలయించి మంచిని వెలిగించి
జగతిని లాలించి పాలించినావూ...

సరిలేరు నీకెవ్వరూ నరపాల
సుధాకర సరిలేరు నీకెవ్వరూ

మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి
మధువే పొంగులువార మనసార తూగాడి
ఆ... ఆ... ఆ...
మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి
మధువే పొంగులువార మనసార తూగాడి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి
నవ్వులు చిలికించి మువ్వలు పలికించి
యవ్వనవీణనూ కవ్వించినావూ...

సరిలేరు నీకెవ్వరూ 
రతిరాజ సుందరా 
సరిలేరు నీకెవ్వరూ

రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్
నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్

అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్
అసమప్రభావ జోహార్
రసికావతంస జోహార్

జోహార్ జోహార్ జోహార్ జోహార్
జోహార్ జోహార్ జోహార్ జోహార్

ఆ... ఆ...
ఆ...
ఆ...

సరిలేరు నీకెవ్వరూ 
నరపాల సుధాకర 
సరిలేరు నీకెవ్వరూ
సిరిలోన గానీ మగసిరిలోన గానీ
సరిలేరు నీకెవ్వరూ...

సరిలేరు నీకెవ్వరూ 
నరపాల సుధాకర 
సరిలేరు నీకెవ్వరూ



ఆదివారం, నవంబర్ 01, 2020

కలనైనా క్షణమైనా...

బాపు గారి రాథాకళ్యాణం సినిమాలోని ఈ అద్భుతమైన పాటను స్వరాభిషేకం వేదిక పై మాళవికతో కలిసి ఎంత చక్కగా అలపించారో బాలు గారు. అలాగే ఈ పాట తర్వాత బాపు గారిగురించి ఆయన సినిమాలకు పాడిన పాటల గురించి ఆయన సినిమాలకు తను చేసిన సంగీతం గురించి ఇంకా కె.వి.మహదేవన్ గారి గురించి ఎంత బాగా మాట్లాడారో ఎంబెడెడ్ వీడియోలో పాట తర్వాత వినండి. 
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాధాకళ్యాణం (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల


ఊహూహూ..ఆఆఆఅ..లలలలలాఅ..ఆఅఅ 

ఊఊహుహూ...ఆఆఆఆఆఆ
కలనైనా క్షణమైనా మాయనిదే
మన ప్రేమా.. మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా.. మన ప్రేమా
 
కలనైనా క్షణమైనా...ఆఆఅ.ఆఆఅ.. 

 నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ

ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా

కలనైనా క్షణమైనా..ఆఆఅ..ఆఆఆ..

నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
కౌగిలిలో.. ఊహూ.. కౌగిలిలా.. ఊఊ... 
కరిగేదే.. మన ప్రేమా

కలనైనా క్షణమైనా మాయనిదే
మన ప్రేమా మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా మన ప్రేమా
 
 
కలనైనా క్షణమైనా...ఆఆఅ.ఆఆఅ.. 
 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.