మంగళవారం, నవంబర్ 10, 2020

చిరునవ్వుల తొలకరిలో...

చాణక్య చంద్రగుప్త సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఎనభైలలో నాకు రేడియో పరిచయం చేసిన అద్భుతమైన పాటలలో ఇదీ ఒకటి, అప్పట్లో తెగ వినే వాడిని. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చాణక్య చంద్రగుప్త (1977)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : సినారె
గానం : బాలు,
సుశీల

హ..హ..హ..హ..హ

చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో
చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో

పలికెనులే.. హృదయాలే..
పలికెనులే.. హృదయాలే..
తొలివలుపుల కలయికలో


చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో

వసంతాలు దోసిట దూసి..
విసిరేను నీ ముంగిలిలో
తారలనే దివ్వెలు చేసి..
వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాడిగా...ఆ..ఆ
నీవే నా జీవనాడిగా..
ఎగిసేను గగనాల అంచులలో.. 
ఓ..ఓ.. విరియునులే ఆ గగనాలే..
నీ వెన్నెల కౌగిలిలో.. ఓ..ఓ..ఓ

చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో..ఓ


ఉరికే సెలయేరులన్నీ...
వొదిగిపోవు నీ నడకలలో
ఉరిమే మేఘా..ఆ.ఆ లన్నీ..
ఉలికి పడును నీ పలుకులలో
నీవే నా పుణ్యమూర్తిగా..ఆ..ఆ
నీవే నా పుణ్యమూర్తిగా..ఆ..
ధ్యానించు నా మధుర భావనలో..

ఓ..ఓ.. మెరియునులే ఆ భావనలే..
ఇరు మేనుల అల్లికలో..ఓ..ఓ
 
చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో..ఓ

ఆ..ఆ.. పలికెనులే.. హృదయాలే..
తొలివలుపుల కలయికలో.. ఓ..ఓ..ఓ..


చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో..
చిరునవ్వుల తొలకరిలో..
సిరిమల్లెల చినుకులలో..ఓ0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.