ఆదివారం, నవంబర్ 22, 2020

ఎటువంటి మోహమో గాని...

మహాకవి క్షేత్రయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం : ఆదినారాయణరావు  
సాహిత్యం : క్షేత్రయ్య  
గానం : రామకృష్ణ  

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే 

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే

మటు మాయ దైవమీ 
మనసు తెలియగ లేక 
మనలనెడబాసనయ్యో 
మటు మాయ దైవమీ 
మనసు తెలియగ లేక 
మనలనెడబాసనయ్యో 
ఓ.. మగువ.. 

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే

కలికి నిన్నెడబాసినది 
మొదలు నీరూపు
కనులకే కట్టి నటులుండునే 
చెలియ నేనొకటి తలచెదనన్న 
నీ చేయు చెలిమి తలపై యుండునే 
ఓ మగువా

సొలసి నేనేయైన వ్రాయ నీయాకార 
శోభనమే కనుపించునే
సొలసి నేనేయైన వ్రాయ నీయాకార 
శోభనమే కనుపించునే

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే
 


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.