సోమవారం, నవంబర్ 02, 2020

పాటల పల్లకివై...

నువ్వు వస్తావని సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నువ్వువస్తావని (2000)
సంగీతం : ఎస్.ఏ.రాజ్ కుమార్ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వు చేరుకోనిదే గుండెకు సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపురేఖలేవో ఎవరినడగాలి... 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి

నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తన రూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రుపం చూపాలి
రెప్పల వెనుక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి

పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గూటిని చూపుమా
ఏ నిమిషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వు చేరుకోనిదే 
గుండెకు సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపురేఖలేవో ఎవరినడగాలి 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి 0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.