ఆదివారం, నవంబర్ 08, 2020

రాజశేఖరా నీపై...

అనార్కలి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అనార్కలి (1955)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : జిక్కి, ఘంటసాల  
 
మదన మనోహర సుందర నారి
మధుర ధరస్మిత నయన చకోరి
మందగమన జిత రాజమరాళి
నాట్యమయూరి... 
అనార్కలి... అనార్కలి... అనార్కలి...
వహ్వా 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
రాజశేఖరా నీపై... మోజు తీరలేదురా
రాజసాన ఏలరా
రాజశేఖరా నీపై... మోజు తీరలేదురా
రాజసాన ఏలరా...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 
ఆ.. ఆ.. ఆ.. ఆ..రాజశేఖరా 
ఆ.. ఆ.. ఆ...ఆ.. ఆ.. ఆఆ.. ఆ.. ఆ
రాజశేఖరా... నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా...
రాజశేఖరా.... 

మనసు నిలువ నీదురా
మమత మాసిపోదురా
మనసు నిలువ నీదురా 
మమత మాసిపోదురా
మధురమైన బాధరా 
మరపురాదు... ఆ...  ఆ.. 

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా
రాజసాన ఏలరా...
రాజశేఖరా...

కానిదాన కాదురా... కనులనైన కానరా
కానిదాన కాదురా... కనులనైన కానరా
జాగుసేయనేలరా... వేగ రావదేలరా
జాగుసేయనేలరా... వేగ రావదేలరా
వేగ రారా... వేగ రారా... వేగ రారా.. 
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.