సువర్ణ సుందరి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సువర్ణ సుందరి (1957)
సంగీతం : ఆదినారాయణరావు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : సుశీల
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
పిలువకురా అలుగకురా...
నలుగురిలో నను ఓ రాజా..
పలుచన సలుపకురా..
పిలువకురా అలుగకురా....
నలుగురిలో నను ఓ రాజా.. ఆ..
పలుచన సలుపకురా..
పిలువకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
మనసున బాళి మరువనులేర...
చలమున మోడి సలుపకు రాజా....
సమయము కాదురా నిను దరిచేర..
సమయము కాదురా నిను దరిచేర...
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా...
పిలువకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
ఏలినవారి కొలువుర సామీ...
మది నీ రూపే మెదలినగాని..
ఓయన లేనురా కదలగలేర..
ఓయన లేనురా కదలగలేర..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా..
కరుణను నన్నీవేళ మన్నించర రాజా....
పిలువకురా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.