బుధవారం, నవంబర్ 11, 2020

నరవరా ఓ కురువరా...

నర్తనశాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నర్తనశాల (1963)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : జానకి

నరవరా....ఆ ఆ ఆ
నరవరా ఓ కురువరా.. 
నరవరా ఓ కురువరా
వీరుల నీకు సరి.. లేరనీ
సరసులలో జాణవనీ
విన్నారా.. కన్నారా..
విన్నారా కన్నారా కనులారా

సురపతి నెదిరించి రణాన 
పశుపతి మురిపించి బలాన
సురపతి నెదిరించి రణాన 
పశుపతి మురిపించి బలాన

సాటి లేని వీరుండన్న యశమును గన్నా
సాటి లేని వీరుండన్న యశమును గన్నా

అర్జున ఫల్గుణ పార్థ కిరీటి 
బిరుదు గొన్న విజయా 

నరవరా....ఆ ఆ ఆ 
నరవరా ఓ కురువరా.. 
నరవరా ఓ కురువరా 
వీరుల నీకు సరి.. లేరనీ 
సరసులలో జాణవనీ 
విన్నారా.. కన్నారా.. 
విన్నారా కన్నారా కనులారా 

నిను గనీ తల ఊచే ఉలూచీ 
కొనుమనీ చెయి సాచే సుభద్రా
నిను గనీ తల ఊచే ఉలూచీ 
కొనుమనీ చెయి సాచే సుభద్రా

నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న
నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న

అలరుల విలుతుని 
ములుకుల గురియై 
వలపులమ్ముకొనురా

నరవరా....ఆ ఆ ఆ 
నరవరా ఓ కురువరా.. 
నరవరా ఓ కురువరా 
వీరుల నీకు సరి.. లేరనీ 
సరసులలో జాణవనీ 
విన్నారా.. కన్నారా.. 
విన్నారా కన్నారా కనులారా 



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.