శనివారం, నవంబర్ 14, 2020

జోహారు శిఖిపింఛ మౌళీ...

మిత్రులందరకూ దీపావళి శుభాకాంక్షలు అందచేసుకుంటూ సుశీల గారు పాడిన ఓ అద్భుతమైన పాటను ఈ రోజు తలచుకుందాం. సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పటికీ ఈస్ట్ మన్ కలర్ లో చిత్రీకరించిన ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. 
  
        
చిత్రం : శ్రీ కృష్ణ విజయం (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : పి.సుశీల

జోహారు శిఖిపింఛ మౌళీ...
జోహారు శిఖిపింఛ మౌళీ.. ఇదె
జోహారు రసరమ్య గుణశాలి వనమాలి
జోహారు శిఖిపింఛ మౌళీ

కలికి చూపులతోనే చెలులను కరగించి..
కరకు చూపులతోనే అరులను జడిపించి..

కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి
నయగారమొక కంట... జయవీరమొక కంట..
నయగారమొక కంట జయవీరమొక కంట
చిలకరించి చెలువమించి నిలిచిన శ్రీకర నరవర సిరిదొర

జోహారు శిఖిపింఛ మౌళీ

నీ నాదలహరిలో నిదురించు భువనాలు...
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు...
నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావూ..
ఆఆ.ఆ.ఆఆఅ...
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగ యుగాల దివ్యలీల నెరపిన 
అవతారమూర్తి ఘనసారకీర్తి

జోహారు శిఖిపింఛ మౌళీ

చకిత చకిత హరిణేక్షణా వదన చంద్రకాంతులివిగో
చలిత లలిత రమణీ చేలాంచల చామరమ్ములివిగో
ఝలమ్ ఝళిత సురలలనా నూపుర కలరవమ్ములివిగో
మధుకర రవమ్ములివిగో మంగళ రవమ్ములివిగో
దిగంతముల అనంతముగ గుబాళించు
సుందర నందన సుమమ్ములివిగో

జోహారు శిఖిపింఛ మౌళీ 
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.