మీ పాట - నా మాట


వింటున్న పాటలలో ఎక్కడైనా ఏవైనా పదాలు అర్ధం కావట్లేదా..

కొన్ని లైన్లు చాలా రోజులుగా వెంటాడుతున్నాయి కానీ పాటేమిటో గుర్తురావట్లేదా.. 

ఏదేనీ పాటల పోటీలో పాల్గొనబోతున్నారా మీరు ఎన్నుకున్న పాట పూర్తి సాహిత్యం కావాలా..

మీకు నచ్చిన పాటల సాహిత్యం పూర్తిగా తెలుసు కోవాలని, అది చదువుతూ వింటూ పాడుకోవాలని ఉందా..


అయితే ఈ పేజ్ లో కామెంట్స్ రూపంలో అడగండి. 

ఆ పాట వివరాలను సాహిత్యాన్ని నాకు సాధ్యమైనంత త్వరలో ఈ బ్లాగ్ లో అందించడానికి ప్రయత్నిస్తాను. 

ఇలా ప్రచురించే పాటలన్నీ "మీ పాట" అన్న లేబుల్ లో ప్రచురించబడతాయి. 

ఆపాటల పోస్టులన్నీ ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. 


33 comments:

మంచి ఆలోచన వేణూ గారు..పాట కందే మాట గా..పలుకుల పూదోట గా..ముందుకి సాగి పొండి..అభినందనలు..

ఇక్కడ శ్రోత కోరుతున్న పాట : చందన చర్చిత నీలకళేభర అన్న గీతం :-))
పాత పాట తో పాటుగా రాఘవేంద్రరావు BA గారి ఏదో సినిమాలో కొత్త వెర్షన్ కూడా ఉంటుంది . అది కూడా పోస్ట్ చేస్తారా ? ఈ రెంటిని ఒకేసారి ఎలా వింటావ్ తల్లీ అని జనాలు నావెంట పడి తరిమే ప్రమాదం లేకపోలేదు ! బట్ పుర్రెకో బుద్ది , జిహ్వకో రుచి అని అదో ఆనందం , ఏమి చేస్తాం :-))

వేణుగారు! నేను కోరుతున్న మరో పాట :)

లవ్ జర్నీ సినిమా నుంచి,
'పున్నమి పున్నమి వెన్నెల నా చెలి'

http://www.youtube.com/watch?v=nKxLJlYwH5k

థాంక్స్ శాంతిగారు :-)
శ్రావ్యా, ఫోటాన్ తప్పకుండా మీరు అడిగిన పాటలను త్వరలో ప్రచురిస్తాను :-)

ఈ ప్రివిలేజ్ ఓన్లీ తెలుగు పాటలకేనా ఆర్ హిందీవి కూడా అడగచ్చా వేణుగారు..

హ్మ్.. నా హిందీ భాషా పరిజ్ఞానం తక్కువేనండీ శాంతిగారు సో తెలుగులా పక్కాగా వెరిఫై చేసి ఇవ్వలేకపోవచ్చు. కానీ అడగండి ప్రయత్నిస్తాను :-)

Hi sir naku murari lo alanati ramachandruni pelli pata kavali istara

Thousands and thousands of namaskaralu for this blog

థాంక్స్ సుబ్బారావు గారు.

ససస సారె (తెలుగుపాట)

అజ్ఞాత గారు మీరు అడిగినది ఈ పాటేనా.. https://www.youtube.com/watch?v=kzRf7ra9hXs

NALLA BOOTU ERRA KOTU THODUKONI ... NAA KODAKO NUVU KALACATERU ANUKONTIRO PL GET ME DETAILS OF THIS SONG

ఈ పాట ఒకసారి చెక్ చేయండి రఘురామ్ గారు మీరు అడిగినది దీనిగురించేనా..
https://www.youtube.com/watch?v=PorpwkBdeow

"సత్యం" చిత్రం నుంచి నీ చేతల్లోనా తెగువే ఉంటే విజయం నీ సొంతం సాంగ్ యొక్క లిరిక్స్ పోస్ట్ చేయగలరు సార్..

మంచి పాట గుర్తు చేశారు శ్రీనివాస్ గారు ఈ నెల సిరీస్ అవగానే తప్పకుండా వేస్తాను. అందాక లిరిక్ కావాలంటే ఇక్కడ ఉంది చూడండి. కుచ్ కుచ్ పానా హైతో అన్న లైన్ తో మొదలయే పాట.

కాంచనగంగ లోని పాట, 'వనిత లత కవితా' పాట lyric ఉండండి. కానీ, వేటూరి చెబుతున్న లోతైన భావాలు అర్థం కాలేదు. వివరించగలరు.

తొలి పూజ లందే ఇలవెలుపు - వినాయకుడి పాట

కొండమల్లెకు ముసిరిన తుమ్మెదలా "మొండిమొగుడు పెంకిపెళ్ళాం" సినిమా నుంచి పాట ప్రచురించ గలరు.

తల్లిదండ్రులు చిత్రం లోని "కృష్ణా నవ నందకిశోరా" అన్న పాటను ప్రచురించ గలరు.

"చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు." అన్న సర్పయాగం సినిమాలోని పాట కావాలి. "దొరలనీకు కనుల నీరు దొరలదీ లోకం" అన్న పాట మీనుంచి మిస్ అయిందని అనుకోను.

7వ దశకం చివరలోనో లేదా ఎనిమిదవ దశకం మొదలులోనో "ఎవరో ఎవరెవరో...." అనే పాట గుంటూరులో ఎక్కువగా మైకులో వినేవాడిని. చిత్రం పేరు గుర్తులేదు గానీ తప్పనిసరిగా బాలు, రామకృష్ణ గార్ల గాత్రమయితే కాదు. ఎవరిదో క్రొత్త కంఠం. తర్వాత ఇంటర్నెట్ లో ఎంత వెదికినా దాని ఆనుపానులు తెలుసుకోలేక పోయాను. మీకు గానీ తెలిస్తే కొంచెం పాటనీ, సాహిత్యాన్నీ పంచుకోండి.

ఇది ఒకసారి చెక్ చేయండి భవానీ ప్రసాద్ గారు.. నైంటీస్ లో వచ్చిన ఉల్లాసం అనే సినిమాలోది.. ఇది కాదు కదా మీరు చెప్పేది... https://www.youtube.com/watch?v=9LOkhpKZl2Q

కాదండీ...ప్రేమగీతం గానీ విరహగీతం గానీ అసలే కాదు. మన సమాజంలో ఉన్న రుగ్మతల గురించీ పెద్ద గద్దల అమానుషం గురించిన పాట.

ఓకే అండీ ఇప్పటికిప్పుడైతే ఏం గుర్తురావడంలేదు వెతుకుతాను ఏవైనా తెలిస్తే చెప్తాను..

వేణూ గారూ "పగలే వెన్నెలాయె జగమే మనదాయె" అన్న పాట "పరువు-ప్రతిష్ట" సినిమాలోది పంచుకోగలరేమో చూడండి.

తప్పకుండా భవానీ ప్రసాద్ గారు.. మీరు ఇదివరకడిగినవి మూడు పాటలు పందొమ్మిది నుండి స్కెడ్యూల్ చేశాను. ఇవి వచ్చేనెల మొదటి వారం పబ్లిష్ చేస్తాను..

"ఎద నింగీ మేఘమే తానూ" ... అన్న పాట "ప్రియా...ప్రియతమా" అన్న సినిమాలోది చాలా మంచి మెలోడీ. విద్యాసాగర్ గారి ఆర్కెస్ట్రా ఉన్నతంగా ఉంటుంది. వీలయితే పంచుకోండి.

"ఒకే ఒక ఆశ... అదే నా శ్వాస" వాసురావు సంగీత దర్శకత్వంలో వచ్చిన సూరిగాడు అన్న సినిమా లోని పాట పంచుకోగలరు.

"ఆకాశాన ఇల్లుకట్టి పగలేజాబిల్లని దీపమెట్టి చుక్కలచీర చక్కగచుట్టి" అని 'హెచ్చరిక' సినిమాలోని పాట పంపించండి దయచేసి.

"ప్రణయం ప్రణయం ప్రణయం" అని మొదలై "నీ చూపులే సుప్రభాతం... నీ మాటలే వేదమంత్రం" అన్న పదాలతో గమ్మత్తుగా సాగుతుంది. సినిమా పేరు గుర్తులేదు గానీ అప్పుడెప్పుడో తెలుగులో వచ్చిన ఒక జనరంజకమయిన ఇంగిలీషు కాపీ ట్యూన్..అది ఈ మధ్య కూడా ఏదో యాడ్ లో విన్నాను. సినిమా పేరుగానీ కళాకారులు గానీ గుర్తులేరు. వీలయితే పంచుకోండి.

మీరు చెప్పిన పాట ఇదేనా భవానీ ప్రసాద్ గారు.. ఇదో ప్రేమ లోకం చిత్రంలో వందేమాతరం శ్రీనివాస్ గారు స్వరపరచినదట..

https://www.youtube.com/watch?v=U3ijcEOdXzM

W.A. Mozart Symphony 40 ఈ ట్యూన్ ని, సలీల్ చౌదరి గారు "Itna Na Mujhse Tu Pyar Badha"-పాటగా మలిచారు ఛాయా సినిమా కోసం. ఇదే ట్యూన్ తెలుగులో కూడా ఒక పాటగా ఉంది కానీ సరిగా గురుతురావడం లేదు. మీకేమన్నా తటస్థిస్తే దయచేసి పంచుకోండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.