గురువారం, డిసెంబర్ 30, 2010

క్షత్రియ పుత్రుడు (1992) - సన్నజాజి & మురిసే

దేవర్ మగన్ అనే తమిళ చిత్రానికి అనువాద చిత్రమైన క్షత్రియపుత్రుడు తెలుగులో హిట్ కాలేదు కానీ  పూర్తి తమిళ వాతావరణం ఇబ్బంది పెట్టనటువంటి వారికి ఈ సినిమా పర్లేదు ఒకసారి చూడచ్చు అనిపిస్తుంది. నాకు శివాజీ గణేషన్, కమల్, రేవతి, నాజర్, గౌతమిల నటన చూడటానికైనా ఒకసారి చూసి తీరవలసిందే అనిపించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ రెండు పాటలు నాకు చాలా ఇష్టం.

“సన్నజాజి పడక” పాటలో జానకి బాలు ఇద్దరూ కలిసి ఆటలాడుకున్నట్లుగా పాడారు. పాట మొదట్లో జానకి గారు నోటితో వేసే మ్యూజిక్.. ఎందుకే.. అన్న చోట తను రాగంతీసినపద్దతితో ఆకట్టుకుంటే.. బాలుగారు కూడా నేనేం తక్కువతిన్నానా అంటూ అవకాశమొచ్చినపుడల్లా అల్లరి చేసేరు. ఇక “మురిసే పండగపూట” లో మాధవపెద్ది రమేష్ గారి గొంతువైవిధ్యంగా ఆకట్టుకుంటుంది. పాటంతా ఒకే మూడ్ తో సాగే ఈ పాటలో ఘటం తో వేసే దరువు  నాకు చాలా ఇష్టం. ఈ రెండు పాటలు మీకోసం. యూట్యూబ్ వీడియో ప్లే అవకపోతే మ్యూజిక్ మజా ప్లగిన్ లో ఆడియో మాత్రం వినవచ్చు.

<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Kshatriya+Putrudu.html?e">Listen to Kshatriya Putrudu Audio Songs at MusicMazaa.com</a></p>


చిత్రం : క్షత్రియపుత్రుడు
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : జానకి, బాలు గారు

సన్నజాజి పడకా..
మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే.. ||3||
అడిగితే సిగ్గేసిందీ.. సిగ్గులో మొగ్గేసిందీ..
మొగ్గలా బుగ్గే కందీ పో..యేనే..

||సన్నజాజి||

సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే..
మనసులో ప్రేమేఉందీ.. మరువనీ మాటేఉందీ..
మాయనీ ఊసేపొంగి.. పాటై రావే..

||సన్నజాజి||

కొండమల్లి పూవులన్నీ.. గుండెల్లోనీ నవ్వులన్ని..
దండే కట్టి దాచుకున్నా.. నీ కొరకే..
పండు వెన్నెలంటి ఈడు.. యెండల్లొన చిన్నబోతే..
పండించగ చెరుకున్నా.. నీ దరికే..
అండ దండ నీవేననీ.. పండగంత నాదేననీ..
ఉండి ఉండి ఊగింది నా మనసే...
కొండపల్లి బోమ్మా ఇక.. పండు చెండూ దోచెయ్యనా..
దిండే పంచే వేళయినది రావే..
దిండే పంచే వేళయినది.. రా..వే..

||సన్నజాజి||
 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : క్షత్రియపుత్రుడు
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : మాదవపెద్ది రమేష్, రాజశ్రీ

ఓ ఓ ఓ...
మురిసే పండగపూటా.. రాజుల కథ ఈ పాటా..
సాహసాల గాధకే పేరు మనదిలే హొయ్..
మొక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే హొ..

||మురిసే||

కల్లా కపటమంటూ లేనీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
పల్లె పట్టు ఈ మాగాణీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
కల్లా కపటమంటూ లేనీ పల్లె పట్టు ఈ మాగాణీ..
మల్లె వంటి మనసే వుందీ.. మంచే మనకు తోడై వుంది..
కన్నతల్లి లాంటి ఉన్నఊరి కోసం.. పాటుపడేనంటా రాజు గారి వంశం..
వీరులున్న ఈ ఊరు పౌరుషాల సెలయేరు..
పలికే.. దైవం.. మా రాజు గారు..

||మురిసే||

న్యాయం మనకు నీడైఉందీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
ధర్మం చూపు జాడేఉందీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
న్యాయం మనకు నీడైఉందీ.. ధర్మం చూపు జాడేఉంది..
దేవుడ్నైన ఎదురించేటీ.. దైర్యం మనది ఎదురేముంది..
చిన్నోళ్ళింటి శుభకార్యాలు.. చేయించేటి ఆచారాలు..
వెన్నెలంటి మనసుల తోటి.. దీవించేటి అభిమానాలు..
కలిసిందీ ఒక జంట.. కలలెన్నో కలవంట
కననీ.. విననీ.. కథ ఏదో వుందంట..

||మురిసే||    

ఆదివారం, డిసెంబర్ 26, 2010

సిరిమల్లె నీవే - పంతులమ్మ(1977)

కొన్ని పాటలకు పాతబడడమంటే ఏమిటో తెలియదేమో అనిపిస్తుంది. పంతులమ్మ సినిమాలో రాజన్ నాగెంద్రగారు స్వరపరిచిన ఈ పాట వినండి. ఎన్ని సార్లు విన్నా ఆ తాజాదనం ఎక్కడికీ పోదు.. ఎప్పటికప్పుడు మనల్ని పలకరిస్తూనే ఉంటుంది, ఊహల్లో విహరింప జేస్తుంది... వేటురి గారు సాహిత్యమందించిన ఈ పాట బాలుగారి స్వరంలో అందంగా రూపుదిద్దుకుంది. తొలిపూత నవ్వె అన్న దగ్గర వినీ వినిపించకుండా తను సన్నగా నవ్విన నవ్వు భలే ఉంటుంది... సంధ్యా సమయం లో మంద్రమైన స్వరంలో ఈ పాట వింటూ అలా ఊహల్లో జారుకోవడం నాకు చాలా ఇష్టమైన పనుల్లో ఒకటి. ఈ పాట వీడియో మీ కోసం... యూట్యూబ్ చూడలేని వారు చిమట లో ఇక్కడ పాట మాత్రం వినవచ్చు.


చిత్రం : పంతులమ్మ(1977)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

ఎలదేటి పాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే.. వనదేవతల్లే
పున్నాగపూలే.. సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
 
అనురాగమల్లే.. సుమగీతమల్లే
నన్నల్లుకోవే.. నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే

||సిరిమల్లె నీవే ||

బుధవారం, డిసెంబర్ 22, 2010

చుట్టూపక్కల చూడరా - రుద్రవీణ

కొన్ని సినిమాలు వాటిలో కొన్ని పాటలు మనసుల్లో చెరగని ముద్ర వేసి గుండెలోతుల్లో నాటుకు పోతాయి. అలాంటి ఒక పాటే రుద్రవీణ సినిమాలోని ఈ “చుట్టూపక్కల చూడరా చిన్నవాడా” అన్నపాట. ఈ పాట ముందు వచ్చే  సన్నివేశం సైతం చాలా ఆకట్టుకుంటుంది. “దేవుడు నీకిచ్చిన రెండుచేతుల్లో ఒకటి నీకోసమూ రెండోది పక్కవాడి చేయూత కోసం.” అంటూ ఆ ముసలి వ్యక్తి చెప్పిన మాటలు అతని హావభావాల సహితంగా నాకు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. సీతారామ శాస్త్రిగారు రాసిన ఈ పాట సమస్తం యువతను సూటిగా ప్రశ్నిస్తున్నట్లుగా.. కర్తవ్యబోధ చేస్తున్నట్లుగా ఉంటుంది.


చిత్రం: రుద్రవీణ
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా ||2||
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్థం
బ్రతుకును కానీయకు వ్యర్థం ||2||

||చుట్టూపక్కల||

స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా…చదువూ సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా…సాంప్రదాయం అంటే
కరుణను మరిపించేదా…చదువూ సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా…సాంప్రదాయం అంటే 

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది
రుణం తీర్చు తరుణం వస్తే…తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా…యేరు దాటగానే
రుణం తీర్చు తరుణం వస్తే…తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా…యేరు దాటగానే

||చుట్టూపక్కల||

సోమవారం, డిసెంబర్ 13, 2010

బెజ బెజ బెజవాడ - బెజవాడరౌడీలు పాట

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా “బెజవాడరౌడీలు” సినిమా కోసం రికార్డ్ చేసిన పాట తన ట్విట్టర్ నుండి సేకరించినది... మీకోసం సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను వింటూ చదువుకోండి. ఆ గోలలో అక్కడక్కడ పదాలు అర్ధంకాలేదు అవి బ్లాంక్స్ ఇచ్చాను మీకేమైనా అర్ధమైతే కామెంట్ ద్వారా చెప్పండి.

http://www.mediafire.com/?lsbhce2qarhtpef
 
 

 
చిత్రం: బెజవాడరౌడీలు
రచన : సిరాశ్రీ
సంగీతం : అమర్ మోహ్లి
గానం : జొ జొ

బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ బెజ
బెజ బెజ బెజ బెజ బెజవాడా..గజ గజ గజ గజ గజలాడా..
కమ్మనైన నవ్వునవ్వి కత్తిపెడితే కాపుకాసి గొంతుకోసి కాలరాయరా..
దద్దరిల్లి గుండెలన్నీ అదరంగా... ముందరున్న వాడిదమ్ము చెదరంగా..
సంఘనీతి పాపభీతి వలదేవీ .. కత్తికన్న గొప్పవేమి కాదేవీ..
కోరుకుంటే కొమ్ముకాసి కాకపోతే కాలరాసి
పొంచిఉన్న పంజాచూసి గేలమేసి వేటువేసి
కుత్తుకలో కత్తిదూసి అగ్గిరాసి బుగ్గిచేసి 
కలుపులన్ని పెరికేసి కుళ్ళునంత కడిగేసి

||బెజ బెజ బెజవాడ||

నీదమ్మునే నమ్ము పొగలాగ నువ్ కమ్మూ
పగబట్టిలేకుమ్ము గెలుపు నీదే లేరా
నువ్వేలె ఈరోజు నువ్వేలే రారాజు
నువ్ ఏలే ఆరోజు ముందరుందిలేరా

అదురువద్దురా.. బెదురువద్దురా..
కుదురువద్దురా.. నిదురవద్దురా..
శ్వాసనిండుగా ఆశనింపరా..
పట్టుపట్టరా గద్దెనెక్కరా..
పదవె ముద్దురా.. పైడిముద్దరా
బంధువొద్దురా బంధమొద్దురా
యుద్దమప్పుడే కృష్ణుడెప్పుడో గీతపాడెరా నిజము చెప్పెరా
ఇంద్రకీలమే.. ఇక నీకు తోడురా..
అడుగై పిడుగై పడగై కాటేయ్ రా... 

||బెజ బెజ||

ఆదివారం, డిసెంబర్ 12, 2010

చిటపట చినుకులు - ఐతే

వారంలో ఒక్కసారైనా తప్పనిసరిగా నేను వినే పాటలలో సిరివెన్నెల గారు రాసిన ఈపాట ఖచ్చితంగా ఉంటుంది. సినిమా విడుదలైన తర్వాత మాత్రమే పరిచయమైన ఈ పాట విన్నవెంటనే నన్ను ఆకట్టుకుంది. ఆశవహ దృక్పధం గురించి కనే కలల గురించి వర్ణిస్తూ సాగే శాస్త్రిగారి సాహిత్యం సినిమా ఫీల్ కు తగినట్లుగా ఆంగ్లపదాలతోకూడా అందంగా ఆటలాడుకున్నట్లుగా సాగుతుంది, కీరవాణి వైవిధ్యమైన కంఠస్వరం ఈపాటకు చక్కగా నప్పింది. పాట చిత్రీకరణ కూడా వైవిధ్యంగా చాలా బాగుంటుంది. 

అప్పట్లో ఈ లోబడ్జెట్ సినిమా బెంగుళూరులో చాలారోజులవరకూ రిలీజ్ అవ్వలేదు, ఏదోపనిమీద హైదరాబాద్ వెళ్ళినపుడు అక్కడ చూశాను. ఆ తర్వాత పాటకూడా చాలారోజులు దొరకలేదు ఇప్పటంత విరివిగా అంతర్జాల వాడకం కూడా లేకపోవడంతో అక్కడా చుక్కెదురే. కొంతకాలానికి ఈ సినిమాలోని ఈపాట ఇంకొన్ని మ్యూజిక్ బిట్స్, అమృతం సీరియల్ టైటిల్ సాంగ్, లిటిల్ సోల్జర్స్ పాటలు అన్నీ కలిపి ఒక సిడి గా రిలీజ్ చేశారు. అదే సమయానికి నా నేస్తం హైదరాబాద్ నుండి బెంగుళూరు వస్తుంటే తనతో తెప్పించుకున్నా ఈ సిడి. ఈ పాటవిన్న ప్రతిసారీ ఈ ఙ్ఞాపకాలు కూడా ఒక రీల్ లా మనసులో తిరుగుతుంటాయ్.


చిత్రం : ఐతే (2004)
సంగీతం : కళ్యాణిమాలిక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి 
గానం : కీరవాణి

చిటపట చినుకులు అర చేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతొ తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదె umbrella ఎపుడూ ఓ వానా నువ్వొస్తానంటే

నిధులకు తలుపులు తెరవగా మనకొక ఆలీ బాబా ఉంటే
అడిగిన తరుణమె పరుగులు తీసే అల్లావుద్దీన్ జీనీ ఉంటే
చూపదా మరి ఆ మాయా దీపం మన fate ఏ flight అయ్యే runway
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...

నడిరాత్రే వస్తావెం స్వప్నమా?
పగలంతా ఎం చేస్తావ్ మిత్రమా.....?
ఊరికినే ఊరిస్తే న్యాయామా ?
సరదాగా నిజమైతే నష్టమా?
మోనాలిసా మొహం మీదే నిలుస్తావా? ఓ చిరునవ్వా.. ఇలా రావా?
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...

వేకువనే మురిపించె ఆశలు
వెనువెంటనే అంతా నిట్టూర్పులూ
లోకం లో లేవా ఏ రంగులు ?
నలుపొకటే చూపాల కన్నులూ?
ఇలాగేనా ప్రతీ రోజు ? ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా?
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చిటపట చినుకులు అర చేతులలో ముత్యాలైతే ఐతే ఐతే
తరగని సిరులతొ తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.