దేవర్ మగన్ అనే తమిళ చిత్రానికి అనువాద చిత్రమైన క్షత్రియపుత్రుడు తెలుగులో హిట్ కాలేదు కానీ పూర్తి తమిళ వాతావరణం ఇబ్బంది పెట్టనటువంటి వారికి ఈ సినిమా పర్లేదు ఒకసారి చూడచ్చు అనిపిస్తుంది. నాకు శివాజీ గణేషన్, కమల్, రేవతి, నాజర్, గౌతమిల నటన చూడటానికైనా ఒకసారి చూసి తీరవలసిందే అనిపించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాలోని ఈ రెండు పాటలు నాకు చాలా ఇష్టం.
“సన్నజాజి పడక” పాటలో జానకి బాలు ఇద్దరూ కలిసి ఆటలాడుకున్నట్లుగా పాడారు. పాట మొదట్లో జానకి గారు నోటితో వేసే మ్యూజిక్.. ఎందుకే.. అన్న చోట తను రాగంతీసినపద్దతితో ఆకట్టుకుంటే.. బాలుగారు కూడా నేనేం తక్కువతిన్నానా అంటూ అవకాశమొచ్చినపుడల్లా అల్లరి చేసేరు. ఇక “మురిసే పండగపూట” లో మాధవపెద్ది రమేష్ గారి గొంతువైవిధ్యంగా ఆకట్టుకుంటుంది. పాటంతా ఒకే మూడ్ తో సాగే ఈ పాటలో ఘటం తో వేసే దరువు నాకు చాలా ఇష్టం. ఈ రెండు పాటలు మీకోసం. యూట్యూబ్ వీడియో ప్లే అవకపోతే మ్యూజిక్ మజా ప్లగిన్ లో ఆడియో మాత్రం వినవచ్చు.
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : జానకి, బాలు గారు
సన్నజాజి పడకా..
మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే.. ||3||
అడిగితే సిగ్గేసిందీ.. సిగ్గులో మొగ్గేసిందీ..
మొగ్గలా బుగ్గే కందీ పో..యేనే..
||సన్నజాజి||
సన్నజాజి పడకా.. మంచ కాడ పడకా.. చల్ల గాలి పడకా..
మాట వినకుందీ.. ఎందుకే..
మనసులో ప్రేమేఉందీ.. మరువనీ మాటేఉందీ..
మాయనీ ఊసేపొంగి.. పాటై రావే..
||సన్నజాజి||
కొండమల్లి పూవులన్నీ.. గుండెల్లోనీ నవ్వులన్ని..
దండే కట్టి దాచుకున్నా.. నీ కొరకే..
పండు వెన్నెలంటి ఈడు.. యెండల్లొన చిన్నబోతే..
పండించగ చెరుకున్నా.. నీ దరికే..
అండ దండ నీవేననీ.. పండగంత నాదేననీ..
ఉండి ఉండి ఊగింది నా మనసే...
కొండపల్లి బోమ్మా ఇక.. పండు చెండూ దోచెయ్యనా..
దిండే పంచే వేళయినది రావే..
దిండే పంచే వేళయినది.. రా..వే..
||సన్నజాజి||
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : మాదవపెద్ది రమేష్, రాజశ్రీ
ఓ ఓ ఓ...
మురిసే పండగపూటా.. రాజుల కథ ఈ పాటా..
సాహసాల గాధకే పేరు మనదిలే హొయ్..
మొక్కులందు వాడే క్షత్రియ పుత్రుడే హొ..
||మురిసే||
కల్లా కపటమంటూ లేనీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
పల్లె పట్టు ఈ మాగాణీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
కల్లా కపటమంటూ లేనీ పల్లె పట్టు ఈ మాగాణీ..
మల్లె వంటి మనసే వుందీ.. మంచే మనకు తోడై వుంది..
కన్నతల్లి లాంటి ఉన్నఊరి కోసం.. పాటుపడేనంటా రాజు గారి వంశం..
వీరులున్న ఈ ఊరు పౌరుషాల సెలయేరు..
పలికే.. దైవం.. మా రాజు గారు..
||మురిసే||
న్యాయం మనకు నీడైఉందీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
ధర్మం చూపు జాడేఉందీ.. డింగ్ డంగ్ డింగ్ డంగ్ డింగ్ డంగడో
న్యాయం మనకు నీడైఉందీ.. ధర్మం చూపు జాడేఉంది..
దేవుడ్నైన ఎదురించేటీ.. దైర్యం మనది ఎదురేముంది..
చిన్నోళ్ళింటి శుభకార్యాలు.. చేయించేటి ఆచారాలు..
వెన్నెలంటి మనసుల తోటి.. దీవించేటి అభిమానాలు..
కలిసిందీ ఒక జంట.. కలలెన్నో కలవంట
కననీ.. విననీ.. కథ ఏదో వుందంట..
||మురిసే||
2 comments:
వేణు శ్రీకాంత్ గారూ !
మీకు, మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
SRRao గారూ, మీకు మీ కుటుంబానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.