సురేంద్ర కృష్ణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సురేంద్ర కృష్ణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, ఫిబ్రవరి 12, 2021

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా...

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం లోని ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (2021)
సంగీతం : గోపీ సుందర్ 
సాహిత్యం : సురేంద్ర కృష్ణ  
గానం : సిధ్ శ్రీరామ్  

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 
త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..
నా మాట అలుసా నేనెవ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 
న‌న్నేడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 
త‌న‌వైపు వెళాతావే మ‌న‌సా..

ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే
అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ
త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట.. హే...
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా..
తానే నీ మాట వింటుందా ఆశా

నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 
నన్నాడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 
త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..

తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్కడుంద‌ంటు ప్రతి చోట వెతికా
త‌న‌తో ఉండే... హే....
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం 
మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా

నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు 
న‌న్నేడిపిస్తావే మ‌న‌సా..

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా 
త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా..
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా 
త‌న‌వైపు వెళతావే మ‌న‌సా..



సోమవారం, డిసెంబర్ 03, 2018

సుఖీభవ అన్నారు...

నేనే రాజు నేనే మంత్రి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నేనే రాజు నేనే మంత్రి (2017)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గానం : రోహిత్, శ్రేయఘోషల్  

సుఖీభవ అన్నారు దేవతలంతా
సుమంగళై  ఉండాలి ఈ జన్మంతా..

ఊపిరంతా నువ్వే నువ్వే
ఉహలోనా నువ్వే నువ్వే
ఉన్నదంతా నువ్వే బంధమా..
ఓ కంటిలోనా నువ్వే నువ్వే
కడుపులోనా నీ ప్రతిరూపే
జన్మకర్దం నువ్వే ప్రాణమా..

కలలోనా కథలోనా నువ్వే...
నీ జతలో నూరేళ్ళు ఉంటానే...

నువ్వే.. నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే.. నువ్వే నువ్వే.
నీతోనే జీవితం..
నువ్వే.. నువ్వే నువ్వే
నేనే.. నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నీకే నే అంకితం


సుఖీభవ అన్నారు దేవతలంతా
సుమంగళై  ఉండాలి ఈ జన్మంతా..

నీ పేరే సుప్రభాతం
అడుగున అడుగే ప్రదక్షిణం
నీ మాటే వేదమంత్రం
మనసుకి మనసే సమర్పణం
నీకేగా.. 
నా తలపు నా గేలుపు నీ కోసం..
నా ప్రాణం నా దేహం నీదే..

నువ్వే... నువ్వే నువ్వే
నేనే..నువ్వే నువ్వే
నువ్వే.. నువ్వే నువ్వే
నీతోనే జీవితం..


తనువంతా పులకరింత
రోజు నువు దరి చేరితే..
వయసంతా వలపు సంత
నీ ఊపిరి వెచ్చగ తాకితే..
నీ మాయే..

కన్నులతో వెన్నెలనే
కురిపించే..
ఓ మణినే కౌగిలిలో
దాచాలే..

నువ్వే..నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే..
నువ్వే... నువ్వే నువ్వే.
నీతోనే జీవితం...
నువ్వే.. నువ్వే నువ్వే
నేనే.. నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నీకే నే అంకితం 


ఆదివారం, అక్టోబర్ 15, 2017

ఓ చంద్రుడా నీలోనా...

హే పిల్లగాడా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హే పిల్లగాడా (2017)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గానం : సింధూరి

ఓ చంద్రుడా నీలోనా ఆవేశమే తగ్గేనా
అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం
చిరునవ్వుతో ప్రతి గుండెనీ గెలిచేయ్
ఒక్కసారి నీకోపం మీద కోపం చూపి నవ్వరా
అందుకోసం నే ఎన్నిసార్లు చూస్తుంటానో అడగరా
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ ఎదురుగ నిలిచిన మనసుని
నువ్వు గాయం చెయ్యొద్దు
సహనంతో నీకన్నీ సాధ్యం
చిరునవ్వే నీ గెలుపుకి మంత్రం
అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం

మిన్నే విరిగి నీ మీద పడ్డట్టు
ఇంకేదో ఐనట్టు గొడవెందుకు
నువ్వే పలికే ఖర్చేమి లేదంట
తప్పేమి కాదంట నవ్వచ్చుగా
నీ అందం నీ ఆనందం
నీ చేతుల్లో ఉండాలంటే
నువ్వింకా వదిలెయ్యాలి కోపం
సంతోషం నీ దాసోహం అవ్వాలంటే సూత్రం
పెదవులపై చిరునవ్వుంటే ఛాలురా..
ఎంత పెద్ద బాధకైన పలకరింపే మంచి మందు
చిరునవ్వుతో ప్రతిగుండెనీ గెలిచేయ్
ఒక చూపుతో చిరుకాంతినే పంచేయ్

పిల్లగాడా నువ్వు నవ్వావంటే నాలో వీణే మోగురా
నీ నవ్వుకోసం నే ఎన్నిసార్లు చూశ్తున్నానో అడగరా
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు
సహనంతో నీకన్నీ సాధ్యం
చిరునవ్వే వీడొద్దు నువ్వే 

 

శుక్రవారం, అక్టోబర్ 13, 2017

రాధమ్మా రాధమ్మా రావే...

నేనే రాజు నేనేమంత్రి చిత్రంలో ఒకే ట్యూన్ లో ఉన్న ఈ చక్కని పాటలను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. జోగేంద్ర పాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నేనేరాజు నేనే మంత్రి (2017)
సంగీతం : అనూప్ రూబెన్స్
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గానం : మాస్టర్ రిషన్ రూబెన్స్, దివ్య

జోగేంద్ర జోగేంద్ర జోగేంద్రా..
జోగేంద్ర జోగేంద్రా.. జోగేంద్ర జోగేంద్రా..
జోగేంద్ర జోగేంద్రా చల్లంగుండాలి
రాజల్లె మ్మల్ని చల్లంగ చూడాలి
జోగన్నా జోగన్నా ఇంకా ఎదగాలి
నీ పేరు దేశం మొత్తం మోగిపోవాలి

జోగేంద్రా జోగేంద్రా చల్లంగుండాలి
నీ పేరు దేశం మొత్తం మోగిపోవాలి

గానం : విజయ్ ఏసుదాస్, రమ్య

జోగేంద్ర జోగేంద్రా
జోగేంద్ర జోగేంద్రా
ఓ..జోగేంద్ర జోగేంద్ర జై బోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర
 
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మా
నా గేలుపు నా ఆనందం నీదే లేనమ్మా
రాధమ్మ రాధమ్మ మాటే వినవమ్మా
నిమిషం నువు కనపడకుంటే
మతి పోతుందమ్మా
వరాల వాన స్వరాల వీణ
నిజాన్ని చేబుతున్నా
అరే సందేహం ఉంటే నా కళ్లలోకే
సరాసరి చూడమంటున్న న.. న..
ధినకధిన్ న..న.. ధినకధిన్..నన.న
ధినకధిన్ న..న..ధినకధిన్..ననన.
రాధమ్మా రాధమ్మా.. 
ఓఓఓ రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మా
నా గేలుపు నా ఆనందం నీదే లేనమ్మా

నీ కళ్లలోకే చూస్తుంటే చాలు
కాలాన్నే మరిచి ఉండిపోనా
కౌగిళ్ల గుడిలో చోటిస్తే చాలు
దీపాల వెలుగై నిండిపోనా
నేను గేలిచేదే నీకోసం
కోరుకోవే నా ప్రాణమైనా
వెండి వెన్నెల్లో ఆశతీరా
నీతోనే ఊయ్యాలూగాలీ ఓ.ఓ.ఓ..

జోగేంద్ర జోగేంద్ర ఓ.. జోగేంద్ర జోగేంద్ర
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మా
నా గేలుపు నా ఆనందం నీదే లేనమ్మా

హో..నీ చూపే శాంతం పలికే సంగీతం
నాకేగా సొంతం ఆసాంతం
నీ నవ్వే అందం నీ మాటే వేదం
పుణ్యాల ఫలితం నీ భందం
నువ్వు వెళ్ళేటి దారంతా
పూల వనమల్లే మారిపోదా
ఊరు ఊరంతా దిష్టి పేడితే
ఓ ముద్దుతోనే తీయనా.. ఓ.ఓ.ఓ..

జోగేంద్ర జోగేంద్ర ఓ జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర జై బోలో జోగేంద్ర
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్రా

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.