హే పిల్లగాడా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : హే పిల్లగాడా (2017)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గానం : సింధూరి
ఓ చంద్రుడా నీలోనా ఆవేశమే తగ్గేనా
అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం
చిరునవ్వుతో ప్రతి గుండెనీ గెలిచేయ్
ఒక్కసారి నీకోపం మీద కోపం చూపి నవ్వరా
అందుకోసం నే ఎన్నిసార్లు చూస్తుంటానో అడగరా
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ ఎదురుగ నిలిచిన మనసుని
నువ్వు గాయం చెయ్యొద్దు
సహనంతో నీకన్నీ సాధ్యం
చిరునవ్వే నీ గెలుపుకి మంత్రం
అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం
మిన్నే విరిగి నీ మీద పడ్డట్టు
ఇంకేదో ఐనట్టు గొడవెందుకు
నువ్వే పలికే ఖర్చేమి లేదంట
తప్పేమి కాదంట నవ్వచ్చుగా
నీ అందం నీ ఆనందం
నీ చేతుల్లో ఉండాలంటే
నువ్వింకా వదిలెయ్యాలి కోపం
సంతోషం నీ దాసోహం అవ్వాలంటే సూత్రం
పెదవులపై చిరునవ్వుంటే ఛాలురా..
ఎంత పెద్ద బాధకైన పలకరింపే మంచి మందు
చిరునవ్వుతో ప్రతిగుండెనీ గెలిచేయ్
ఒక చూపుతో చిరుకాంతినే పంచేయ్
పిల్లగాడా నువ్వు నవ్వావంటే నాలో వీణే మోగురా
నీ నవ్వుకోసం నే ఎన్నిసార్లు చూశ్తున్నానో అడగరా
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు
నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు
సహనంతో నీకన్నీ సాధ్యం
చిరునవ్వే వీడొద్దు నువ్వే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.