ఆదివారం, అక్టోబర్ 01, 2017

రావణా జై జై జై...

శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే 'రావణ్ మహరాజ్' గా తారక్ ఇటీవల నటించి మెప్పించిన "జైలవకుశ" చిత్రంలోని పవర్ ఫుల్ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరిక్స్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియో ఇక్కడ.


చిత్రం : జై లవకుశ (2017)
సంగీతం : దేవిశ్రీప్రసాద్‌
సాహిత్యం : చంద్రబోస్‌
గానం : దివ్యకుమార్‌

అసుర రావణాసురా
అసుర అసుర రావణాసురా

విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక
వేల వేల కోట్ల అగ్నిపర్వతాల కలయిక
శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక
ఓ... ఏకవీర శూర క్రూర కుమార
నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వరా
హోఓ... రక్తధార చోర ఘోర అఘోర
కర్కశంగ రేగుతున్న కాలకింకరా

రావణా జై జై జై శత్రుశాసనా జై జై జై
రావణా జై జై జై సింహాసనా జై జై జై

అసుర అసుర అసుర అసుర రావణాసుర
అసుర అసుర అసుర అసుర రావణాసుర

చిత్ర చిత్ర హింసకా మృత్యు మృత్యు ఘంటికా
ముజ్జగాల ఏకకాల పలు రకాల ధ్వంసకా
ఖడ్గభూమి కార్మికా కదనరంగ కర్షకా
గ్రామ నగర పట్టణాల సకల జనాకర్షకా
ఓ... అంధకార తార ధీర సుధీర
అందమైన రూపమున్న అతి భయంకరా
హో... దుర్వికార వైర స్వైర విహార
పాపలాగ నవ్వుతున్న ప్రళయభీకరా

రావణా జై జై జై శత్రుశాసనా జై జై జై
రావణా జై జై జై సింహాసనా జై జై జై

నవరసాల పోషక నామరూప నాశక
వికృతాల విద్యలెన్నొ చదివిన వినాశక
చరమగీత గాయక నరకలోక నర్తక
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక
ఓ... అహంకార హార భార కిశోర
నరాలు నాగుపాములైన నిర్భయేశ్వరా
హోఓ... తిరస్కార తీర నేర కుటీర
కణము కణము రణములైన కపాలేశ్వరా

రావణా జై జై జై శత్రుశాసనా జై జై జై
రావణా జై జై జై సింహాసనా జై జై జై 
 

1 comments:

song sooper, kinda Animation (Ravana Dance) keka... baavundi andi.. :)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.