మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. ఈ రోజు రాజరాజేశ్వరీ దేవి అవతారంలో దర్శనమీయనున్న అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మధుర మీనాక్షి (1989)
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథం
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలమురళీ కృష్ణ
ఓం నమశ్శివాయ..
ఓం నమశ్శివాయ..
ఓం నమశ్శివాయ..
సాంబశివు పదములే కదిలే
దివి కదిలె రవి కదిలె
పవనుండు తా కదిలె
నా తల్లి ఉమ కదిలె
భువనాలు నర్తించెనే
గిరి దుహిత పరవశగ కదలా
పరశివు విజృంభణము ప్రభలా
ముల్లోకములకెల్ల శుభములే విలసిల్ల
కనుగొంటి శివతాండవం
కనుగొంటి శివతాండవం
ఓం నమశ్శివాయ.. ఓం
ఓం నమశ్శివాయ.. ఓం
ఓం నమశ్శివాయ.. ఓం
ఓం నమశ్శివాయ.. ఓం
శంభు మహోజ్వల నాట్యానా
జగదంబ మనోహర లాస్యానా
శంభు మహోజ్వల నాట్యానా
జగదంబ మనోహర లాస్యానా
అధ్బుతమైనది ఈ నటన
ఇది అభినయ తాండవ అవతరణ
అభినయ తాండవ అవతరణ
అధ్బుతమైనది ఈ నటన
ఇది అభినయ తాండవ అవతరణ
భక్తుల బ్రోచే హిమగిరి నందిని
శక్తి స్వరూపిణి త్రిభువన పావని
పార్వతి మాతా పద విన్యాసం కనుగొంటిని
సంభ్రమ ఢమరుక శబ్ద తరంగం
ప్రళయ భయంకర మృత్యు మృదంగం
రుద్ర మహోధృత పద ఘట్టనము
కనుగొంటి ఓం శివహోం..
శివహోం.. శివహోం
పుణ్యాల పంట ఈ జంట
ముల్లోకముల గాచునంట
ఈ నాట్య విన్యాస హేల
సృష్టికే ఆనంద డోల
కనుగొంటి శివతాండవం
కనుగొంటి శివతాండవం
హర హర మహాదేవ
హర హర మహాదేవ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.