బుధవారం, సెప్టెంబర్ 27, 2017

శ్రీ గౌరి వాగీశ్వరీ...

ఈ రోజు సరస్వతీదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించనున్న అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గడసరి అత్త సొగసరి కోడలు (1981)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : భానుమతి

శ్రీ గౌరీ వాగీశ్వరీ
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ శ్రీ గౌరి వాగీశ్వరీ
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ


సిరులిచ్చి రక్షించు శ్రీలక్ష్మి నీవే
నీ చిత్తమే భాగ్యమే దేవ దేవి
సిరులిచ్చి రక్షించు శ్రీలక్ష్మి నీవే
నీ చిత్తమే భాగ్యమే దేవ దేవి
ముంజేతి చిలుక ముద్దాడ పలుకా
దీవించవే మమ్ము మా భారతీ
సకల శుభంకరి విలయ లయంకరి
శంకర చిత్త వశంకరి శంకరి
సౌందర్య లహరి శివానంద లహరీ

శ్రీ గౌరి వాగీశ్వరీ
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ

ముగ్గురమ్మల గన్న మురిపాల వెల్లి
కల్పవల్లి గౌరి కాపాడవే
ముగ్గురమ్మల గన్న మురిపాల వెల్లి
కల్పవల్లి గౌరి కాపాడవే
మా ఇంట కొలువై మము బ్రోవవే
పసుపు నిగ్గుల తల్లి మా పార్వతీ
ఆగమ రూపిణి అరుణ వినోదిని
అభయమిచ్చి కరుణించవె శంకరి
సౌందర్య లహరి శివానంద లహరీ

శ్రీ గౌరి వాగీశ్వరీ
శ్రీకార సాకార శృంగార లహరి
శ్రీ గౌరి వాగీశ్వరీ  

 

2 comments:

సరస్వతీ అమ్మవారు యెప్పడికీ మీ అభిరుచినిలాగే కొనసాగించే శక్తినివ్వాలని ఆకాంక్ష..

థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.