బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారిని తలుచుకుంటూ ఈ రోజు శ్రీ గౌరీ మహత్యం చిత్రంలోని ఒక చక్కని పాటను విందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీ గౌరీ మహత్యం (1956)
సంగీతం : ఓగిరాల రామచంద్రరావు / టి.వి.రాజు
సాహిత్యం : మల్లాది
గానం : సుశీల, రావు బాలసరస్వతి
శ్రీమించు మా తల్లి శివునీ అర్ధాంగీ
మహిమలూ గల తల్లి మంగళాగౌరీ
శ్రీమించు మా తల్లి శివునీ అర్ధాంగీ
మహిమలూ గల తల్లి మంగళాగౌరీ
మా పసుపు కుంకుమా చల్లగా ఉండ
మా ఐదువతమ్ము చల్లగా ఉండ
కన్నె పేరంటాళ్ళ కళ్యాణ రేఖ
ఇల్లాళ్ళ నొసటాను సౌభాగ్య రేఖ
మా అమ్మ మా తల్లి మంగళా గౌరీ
శ్రీ కరి వర దాయిని సరసిజవదనా
సామజగమనా సదయా మాం పాలయ
శ్రావణ మాసాన మంగళా వారాన
మా యింట వెలసిన మంగళా గౌరీ..
శ్రీమించు మా తల్లి శివునీ అర్ధాంగీ
మహిమలూ గల తల్లి మంగళాగౌరీ
భక్తితో తోరమ్ము ముంజేత గట్టీ
చిత్తశుద్ధిగ నిన్ను సేవించుకొన్న
ఆపదలలో మునిగి అల్లాడువారు
అంబ నీ దయ వల్ల గడచి బ్రతికేరు
ఆలికీ మగనికీ యెడబాటులైన
అంబ నీ కృప వల్ల ఏకమౌతారు
ఏ నోము మానినా నీ నోము మానము
ఏ వ్రతం తప్పినా నీ వ్రతం తప్పము
శ్రీమించు మా తల్లి శివునీ అర్ధాంగీ
మహిమలూ గల తల్లి మంగళాగౌరీ
మంగళ గౌరమ్మ వ్రత కథ వినండి
ఆ దేవి మహిమలు ఆలకించండి
ఆది కాలమునాడు అనగనగ ఒక రాజు
ఆ రాజు పెద భార్య అతి పుణ్యశాలీ
మంగళా గౌరీ నే కోరి కొలువంగ
ఆ అంబ కరుణించి ఇచ్చె కూతురుని
ఆ బాల పేరే మంగళా గౌరీ
ఆ బాల పేరే మంగళా గౌరీ
ఆ తల్లి సుగుణాలే అబ్బె బాలకునూ
అంబా మంగళ గౌరీ
జగదంబా దేవీ శ్రీభవానీ
అంబా మంగళ గౌరీ
జగదంబా దేవీ శ్రీభవానీ
అంబా మంగళ గౌరీ
దరి చేరిన వారిని బ్రోవ
ఇల నీ సరి వేలుపు లేరే
దరి చేరిన వారిని బ్రోవ
ఇల నీ సరి వేలుపు లేరే
ఇది నీ పరివారమే దేవదేవీ
కనుపాపగ పాపను కాపాడవే
అంబా మంగళ గౌరీ
జగదంబా దేవీ శ్రీభవానీ
అంబా మంగళ గౌరీ
భవతాపము తీరే వెరవు
వరయోగులు కోరే తెరవు
భవతాపము తీరే వెరవు
వరయోగులు కోరే తెరవు
నగరాజ కుమారీ నీవె కావా
శరణం భవ మాం పాహి పురాణి
అంబా మంగళ గౌరీ
జగదంబా దేవీ శ్రీభవానీ
అంబా మంగళ గౌరీ
2 comments:
యస్.వరలక్ష్మి గారిది చాలా ధాటీ ఐన కంఠ స్వరమండి..ఆవిడ గొంతులోనూ ఈ పాట అద్భుతంగా ఉండేదేమో కదండీ..
అవును శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.