శుక్రవారం, సెప్టెంబర్ 01, 2017

అయ్యయ్యో చేతిలో...

సెప్టెంబరు నెలలో హాస్య రస ప్రధానమైన పాటలు తలచుకుందాం. ఈ సిరీస్ ను పిల్ల జమిందార్ చిత్రంలోని ఈ పాటతో మొదలు పెడదాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పిల్ల జమీందార్ (2011)
సంగీతం : సెల్వ గణేష్
సాహిత్యం : శ్రీమణి
గానం : సోలార్ సాయి

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే

ఉన్నది కాస్తా ఊడింది
సర్వమంగళం పాడింది
మేటర్ క్వార్టరుకొచ్చింది
పరువును వీధికి తెచ్చింది
పిజ్జా బర్గర్ తినే జీవికి
పచ్చడి టచ్చింగ్ ఇచ్చింది
 
అయ్యయ్యో కార్లు బంగళా పోయెనే
అయ్యయ్యో క్రెడిట్ కార్డులు మాయమే

ఆ జమీందారుకే ఏలిన్నాటి శని షరతులు పెట్టిందే
విధి వీణ్ణుతికారేసిందే చేతికి చీపురు ఇచ్చిందే
ఫోజుకు బూజే దులిపిందే
ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగ మార్చే
గాడిద చాకిరి చేయించే

అయ్యయ్యో రాజభోగం పోయెనే
అయ్యయ్యో రాజన్న జ్వరమే వచ్చెనే

షవరు బాతులు స్విమ్మింగ్‌పూలూ
ఎండమావులాయే అయ్యని ఎండకట్టినాయే
గోయిందా... గోయిందా...
ప్యాలెస్ నుండి పాయిఖానాకు బాబే దిగివచ్చే
దెబ్బకు దేవుడు కనిపించే
అబ్బాయిని అబ్బా అనిపించే
ఏసి బారులో ఓసీ లైఫుకు షేకే వచ్చిందీ
షేఖ్‌కి షాకే ఇచ్చిందీ

అయ్యయ్యో డాబుసరి సిరి దూరమే
అయ్యయ్యో బాబు పని ఇక ఘోరమే

జల్సా లైఫులు సల్సా డాన్సులు
స్వాహా అయ్యాయి
కష్టాల్ కవాతు చేశాయి
గర్వపు కీళ్లే విరిచాయి
కాళ్లకు పుళ్లే అయ్యాయి
నిష్ట దరిద్రపు లాటరి వీణ్ణి లాగి కొట్టింది
కొడితే...
చిప్ప చేతికొచ్చే కూటికి తిప్పలెన్నొ తెచ్చే

అయ్యయ్యో మేళ్లు మిద్దెలు మాయమే
అయ్యయ్యో పేళ్లో బతుకైపాయెనే


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.