బుధవారం, సెప్టెంబర్ 06, 2017

నా షోలాపూర్ చెప్పులు...

మైకాలే హైతో క్యా హువా అనే ఫేమస్ హిందీ పాట ట్యూన్ లో సాగే సరదా అయిన పాటను ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.


చిత్రం : ముద్దమందారం (1981)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : బబ్బన్ అండ్ పార్టీ
గానం : జిత్ మోహన్ మిత్రా

షోలాపూర్... చెప్పులు పోయాయి...
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి

అరె రమణ మూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళి మళ్ళీ
నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళీ మళ్ళీ
మన రమణ మూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళి మళ్ళీ
నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళీ మళ్ళీ
ఆ సందట్లొ కన్నేసి కనిపెట్టి కాజేసాడెవడో...

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
నా షోలా..షోలా..షోలాపూర్ పెళ్ళిలొ చెప్పులు పోయాయి

ఇది షోలాపూరు లెదరు.. యాజ్ లైట్ యాజ్ ఫెదరు..
సూట్ యట్ ఎనీ వెదరు.. దీన్ని తొడిగి చూడు బ్రదరూ..
ఇది షోలాపూరు లెదరు.. యాజ్ లైట్ యాజ్ ఫెదరు..
సూట్ యట్ ఎనీ వెదరు.. దీన్ని తొడిగి చూడు బ్రదరూ..
అని మురిపించి మరిపించి కొనిపించాడా కొట్టోడూ...

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
నా షోలాపూర్ పెళ్ళిలొ చెప్పులు పోయాయి

జత నంబరేమొ ఆరు.. వెల చూస్తె ఇరవయ్యారు...
తొడిగాను ఒక్క మారు..వెళ్ళాను పాత వూరు
జత నంబరేమొ ఆరు.. వెల చూస్తె ఇరవయ్యారు...
తొడిగాను ఒక్క మారు..వెళ్ళాను పాత వూరు
ఒక సారైన పాలీషు కొట్టందె కొట్టేసాడెవడో..

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
నా షోలాపూర్ పెళ్ళిలొ చెప్పులు పోయాయి
నా షోలాపూర్ పెళ్ళిలొ చెప్పులు పోయాయి
నా షోలాపూర్ చెప్పులూ... పెళ్ళిలొ పోయాయి...
దొరికితే... ఎవరైనా ఇవ్వండీ...హ హ హ
  

4 comments:

ప్రతిసారీ
నా "షోలాపూర్ చెప్పులు" పెళ్ళిలొ పోయాయి
అన్న జిత్ మోహన్ మిత్రా...
పొరపాటున
నా షోలా..షోలా.."షోలాపూర్ పెళ్ళి"లొ చెప్పులు పోయాయి
అని అంటాడు. బహుశా ఎవరూ గమనించలేదేమో...తను పాడేప్పుడు.

this song is written and performed by Babban and Party

థాంక్స్ వేటూరి గారు సరిచేశానండీ..

మీరన్నదే కరెక్ట్ అయుండచ్చండీ కాకపోతే కన్ఫూజన్ కి సరిపోయింది అనిపించి వాళ్ళూ ఉంచేశారేమో భవానీ ప్రసాద్ గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.