శనివారం, సెప్టెంబర్ 02, 2017

పవన్ కళ్యాణ్ ఫన్నీ సాంగ్స్...

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా తనకి శుభాకాంక్షలు తెలుపుతూ.. తన సినిమాల్లోని కొన్ని ఫన్నీ సాంగ్స్ క్లిప్పింగ్స్ చూద్దాం. మొదటి వీడియోలో ఖుషీ అండ్ తమ్ముడు సినిమాల్లోని పాటలు అన్నీ కలిపి ఒకే వీడియోగా కంపైల్ చేసిన షాలిమార్ వారికి ధన్యవాదాలు. ఎంబెడ్ చేసిన ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తమ్ముడు (1999)

నబో నబో.. ఆహా..
నబరి గాజులు.. అబ్బోసి
ఎత్తుగొలుసులు.. ఓహోహో
ముక్కు పుడకలు.. ఓసోసోస్..
నడుము సన్నని నాగరాజు.. అబ్బబ్బబ్బ

ఎవులెరుగని భాగోతం అబో అబో
మేడపరకి టిక్కటి... 

ఓయ్ ఏం టైమింగ్ వయ్..

తాటిచెట్టెక్కనేవు తాటికల్లు దెంపలేవు
ఈతచెట్టెక్కనేవు ఈతకల్లు దెంపలేవు
మల్లీ ఓయ్ మల్లీనీకెందుకురా పెళ్ళి

తాటిచెట్టెక్కనేవు తాటికల్లు దెంపలేవు
ఈతచెట్టెక్కనేవు ఈతకల్లు దెంపలేవు
మల్లీ ఓయ్ మల్లీనీకెందుకురా పెళ్ళి

నబో నబో నబరి గాజులు
ఎత్తుగొలుసులు ముక్కు పుడకలు
నడుము సన్నని నాగరాజు
ఎవులెరుగని భాగోతం అబో అబో
మేడపరకి టిక్కటి

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : ఖుషి (2001)

ఏ రంగోబోతీ రంగోబోతీ ఖోలో ఖోలో

బైబైయ్యే బంగారూ రమణమ్మా
బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మా
ఓయ్... బైబైయ్యే బంగారూ రమణమ్మా
బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మా
నువ్వొచ్చే వారం పది రోజులకి
నిలువుటద్దాల మేడలో రమణమ్మా

అద్దాల మేడల్లో ఉండేటీ పిల్లనురా
అద్దాల మేడల్లో ఉండేటీ పిల్లనురా
పోయి పూరి గుడిసె పాలు జేసినావో
మందలోడా ఓరి మాయలోడా
మావరారా గోపికృష్ణ వాడా
మావరారా గోపికృష్ణ వాడా
అటు బస్సూ ఇటు బస్సూ
మధ్యన బస్సులోన
మనమెళ్దాం రమణమ్మా
అటు రైలూ ఇటు రైలూ
మధ్యన రైలు లోన
మనమెళ్దాం రమణమ్మా

 ~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : తమ్ముడు (1999)

ఏం పిల్లా మాటాడవా... అబ్బబ్బబ్బబ్బబ్బ అబ్బా
ఓయ్ పిల్లాపిల్లా అబ్బా... ఏయ్ పిల్లాపిల్లా ఊహూ..ఊ
ఏం పిల్లా మాటాడవా అరె పిల్లాపిల్లా ఓయ్ పిల్లాపిల్లా
హోయ్ ఏం పిల్లా మాటాడవా
ఓయ్ పిల్లా పిల్లా ఏం పిల్లా మాటాడవా

నీకైదురూపాయ్ లిస్తను పిల్లా
తల్లో పూలు కొనుక్కో పిల్లా 
ఐదు రూపాయ్ లిస్తను పిల్లా
ఎహే.. ఎహే.. హోయ్ 
ఐదు రూపాయ్ లిస్తను పిల్లా
ఏం పిల్లా అబ్బబ్బబ్బబ్బ
ఏం పిల్లా అరెరెరెరె..
ఏం పిల్లా మాటాడవా
ఓ పిల్లా పిల్లా ఏం పిల్లా మాటాడవా

నువ్వు ఊ అంటే హెయ్ హెయ్ హేయ్..
నువ్వు ఊ అంటే హెయ్ హెయ్ హేయ్..
నువ్వు ఊ అంటే నా మనసు నీకే ఇచ్చేస్తాను పిల్లా

ఏం పిల్లా తళాక్ తళాక్ ధూం
ఏం పిల్లా తడక్ తడక్ థూం..
ఏం పిల్లా మాటాడవా... అదీ.. 
ఓ పిల్లా పిల్లా ఏం పిల్లా మాటాడవా

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం : తమ్ముడు (1999)

హేయ్ రాజులకే రాజూ నారాజూ
సుబ్బరాజు వాసనకే సంపెంగ పూవు 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అత్తారింటికి దారేది చిత్రంలో బాగా ఫేమస్ అయిన కాటమరాయుడా కదిరి నరసింహుడా పాట. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అత్తారింటికి దారేది (2013)

హేయ్.. కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..అ
కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..ఆ
కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..
మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..
మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా


సేపకడుపు చేరిబుట్టితీ..
రాకాసి దాన్ని కోపాన తీసికొట్టితీ.. హెహె హోయ్..

బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా


ఓటిమన్ను నీల్లలోన ఎలసి ఏగమే తిరిగి..
ఓటిమన్ను నీల్లలోన.. హ్ హొహొయ్
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ

బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా

సేపకడుపు చేరిబుట్టితీ..
రాకాసి దాన్ని కోపాన తీసికొట్టితీ.. హొయ్ హొయ్..
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా ఆఆహోయ్యా... 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అత్తారింటికి దారేది చిత్రంలోనిదే కెవ్వు కేక బాబాజీ పాట ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అత్తారింటికి దారేది (2013)

ఏయ్.. చిరునవ్వుతో ఎదురొచ్చి 
చేతులెత్తి దీవించీ
భక్తులనే ప్రేమిస్తుంటే...
కెవ్వ్... కేక ఓ బాబాజి కెవ్వ్ కేక..
 
లుంగినే మార్చేసి అంగీలా కట్టేసి
దయతో నువ్ ఒంగుంటుంటే..
కెవ్వ్... కేక ఓ బాబాజి కెవ్వ్ కేక
 
నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోణం
నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం
అరె ఫ్రెంచు సెంటు సీసా మరి మంచి నాటు సార
నీ చూపు ముందు బలాదూరు నీకు ఎవరు సాటి లేరు
కెవ్వ్ కేక ఓ బాబాజి కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేక
కెవ్వ్ కేక ఓ బాబాజి కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కే..... క


ఆఅ.. అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు
పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు తాకు తాకు
అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు
పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు తాకు తాకు
అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు
పుణ్యానికి స్వామి పాదం తాకు తాకు తాకు తాకు
కెవ్వ్.. కేక ఓ బాబాజి కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేక...
కెవ్వ్.. కేక ఓ బాబాజి కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కే.... క

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇలాంటి డాన్సే అదరగొట్టేసిన మరో పాట గబ్బర్ సింగ్ సినిమాలోని మందు బాబులం అనే పాట అది ఇక్కడ చూడవచ్చు. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : గబ్బర్ సింగ్ (2012)
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ 
సాహిత్యం : సాహితి 
గానం : కోటా శ్రీనివాసరావు 

మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం

ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం
అరే కల్లు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తామ్
మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం

తాగుబోతంటే ఎందుకంత చులకన
తాగి వాగేది పచ్చి నిజం గనకన
ఎహే మందేస్తత ముందు వెనక లేదన్నా
ఈ మందు లేని సర్కారే బందన్నా
ఏ తాగుడేగ స్వర్గానికి నిచ్చెన
ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా

మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం ..
అరేయ్ కల్లు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తం 
మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇన్ని ఫన్నీ సాంగ్స్ చూశాక గబ్బర్ సింగ్ లోని అంత్యాక్షరి సీన్ చూడక పోతే ఎలా అది ఇక్కడ చూడవచ్చు.



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.