శనివారం, సెప్టెంబర్ 09, 2017

సోడా సోడా ఆంధ్రాసోడా...

గొంతులో రంగు రంగుల గోలీని నిలుపుకుని సొగసైన సీసాలో దొరికే గోలీసోడాని తలచిన వెంటనే కమ్ముకు వచ్చే కమ్మని జ్ఞాపకాలు అన్నీ ఇన్నీ కావు అలాంటి సోడా మీద రాసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ.


చిత్రం : లక్ష్మీనివాసం (1968)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : పిఠాపురం

సోడాయ్ సోడాయ్ ఆంధ్రసోడా 
గోలిసోడాయ్ జిల్ జిల్ సోడాయ్
సోడా సోడా ఆంధ్రాసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడా సోడా ఆంధ్రాసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా

సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

సోడా నెత్తి మీద గంగవున్న ఈశ్వరుడైనా
అహ నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా
నేత్తి మీద గంగవున్న ఈశ్వరుడైనా
అహ నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా
ఆంధ్రాసోడా కోరికోరి తాగుతారోయ్
అది లేకుంటే వడదెబ్బకు వాడుతారోయ్

సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు..ఊ..
వినాయకుల చప్పట్లు శుద్ధ గ్యాసు
నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు
వినాయకుల చప్పట్లు శుద్ధ గ్యాసు
పోసుకోలు పాలిటిక్స్ పరమ గ్యాసు
వాటికన్నా ఉపయోగం సోడా గ్యాసు

సోడా సోడా ఆంధ్రాసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

ఒక్క గుక్క తాగి చూడు మండుటెండలో
అహ హిమాలయం చల్లదనం నీ గొంతుకలో
ఒక్క గుక్క తాగి చూడు మండుటెండలో
అహ హిమాలయం చల్లదనం నీ గొంతుకలో
రాళ్ళు తిని తాగితే జీర్ణమవ్వాలి
ఈ నీళ్ళు తాగితే సగం కడుపు నిండాలి

సోడా సోడా ఆంధ్రాసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడా సోడా ఆంధ్రాసోడా


1 comments:సోడా ! సోడా ఆంధ్రా
సోడా! జిల్ జిల్ జిలేబి సోడా! సోహం
సో, డాబూ దర్పం గో
ళీ డోసులన తెలుగోడి లిరికారుద్రా :)

జిలేబి

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.