ఆదివారం, సెప్టెంబర్ 03, 2017

వారెవా ఏమి ఫేసు...

మనీ చిత్రంలోని ఒక కామెడీ పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మనీ (1993)
సంగీతం : శ్రీ మూర్తి 

సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శ్రీ మూర్తి , సత్యం, సిరివెన్నెల

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు
ఇంక వేసెయ్ మరో ఆహాహా ....డోసు

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు
ఇంక వేసెయ్ మరో ఆహాహా ....డోసు
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్యరా
నీవేరా ముందు డేసు

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసు

అమితాబచ్చన్ కన్నా ఏం తక్కువ నీకైనా
హాలీవుడ్లో అయినా ఎవరెక్కువ నీకన్నా
ఫైటు ఫీటు ఆట పాట రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే
మెగాస్టార్ ఐపోలేదయ్యా
తెగించి సత్తా చూపందే
సడన్గా స్వర్గం రాదయ్యా

 బాలయ్య వెంకటేశు నాగార్జున నరేషు
రాజేంద్రుడు సురేషు
రాజశేఖరు ఆదర్సు
మొత్తంగా అందరూ
అయిపోవాలోయ్ మటాషు

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసు

గూండా రౌడీ దాదా అంటారే బయటుంటే
ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే
ఒహో అంటూ జైకొడతారు
తేడా మేకప్పే
నువుంటే చాల్లే అంటారు
కధెందుకు పోన్లే అంటారు
కటౌట్లు గట్రా కడతారు
టికెట్లకు కొట్టుకు ఛస్తారు

 బాగుంది గాని ప్లాను
పల్టీ కొట్టిందో ఏవి గాను
బేకారీ బాత్ మాను
జర జారు తగ్గించు ఖాను....
అరె ఛి పో శకున పక్షిలా తగులుకోకు ముందు

వారెవా ఏమి ఫేసు అచ్చు హీరోలా వుంది బాసు
వచ్చింది సినిమా ఛాన్సు
ఇంక వేసెయ్ మరో... డోసు...


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.