గురువారం, సెప్టెంబర్ 28, 2017

జగదేక మాతా గౌరీ...

ఈ రోజు దుర్గాష్టమి సంధర్బంగా దుర్గాదేవి అవతారంలో భక్తులను కరుణించనున్న అమ్మవారికి నమస్కరించుకుంటూ ఈ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సీతారామ కళ్యాణం (1961)
సంగీతం : గాలి పెంచలయ్య
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : పి.లీల

జగదేక మాతా గౌరీ కరుణించవే
భావానీ కరుణించవే భవానీ కరుణించవే
జగదేక మాతా గౌరీ కరుణించవే
భావానీ కరుణించవే భవానీ కరుణించవే

ఘనమౌ శువుని ధనువు వంచి
ఘనమౌ శువుని ధనువు వంచి
జనకుని కోరిక తీరుట జేసి
మనసిజ మోహను రఘుకులేశుని
మనసిజ మోహను రఘుకులేశుని
స్వామిని జేయవే మంగళ గౌరీ 

కరుణించవే భవానీ కరుణించవే

నీ పదములను లంకాపతిని
నీ పదములను లంకాపతిని
నా పెన్నిధిగా నమ్ముకొంటినే
నా పతికాపద కలుగనీయక
నా పతికాపద కలుగనీయక
కాపాడవే మంగళ గౌరీ
కరుణించవే భవానీ కరుణించవే
భవానీ కరుణించవే
 
జగదేక మాతా గౌరీ కరుణించవే
భావానీ కరుణించవే భవానీ కరుణించవే
 

2 comments:

దుర్గాష్టమి శుభాకాంక్షలండీ..

మీకు కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు శాంతి గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.