మంగళవారం, డిసెంబర్ 31, 2019

తిరుప్పావై 16 నాయగనాయ్...

ధనుర్మాసం లోని పదహారవ రోజు పాశురము "నాయగనాయ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
నాయకుండౌ మారాజు
నందగోపు మందిరంబును
గాచెడి మాన్యులారా
తలుపు తీయరే
మాయందు దయవహించీ

కృష్ణ దేవుండు మామీద
కృపను బూని 
వ్రతము చేయింతు రమ్మనే
బాలికలమూ గొల్లలము
లోక సౌఖ్యంబు కోరినాము


తొలుతనే కాదనక
మణితలుపు వేగంబుగా తీసి
దయచూపరే మాకు దివ్యులారా
దయచూపరే మాకు దివ్యులారా
    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదహారవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
నాయగనాయ్ నిన్ఱ నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే!, కొడిత్తోన్ఱుమ్ తోరణ
వాశల్ కాప్పానే!, మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్,
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెழప్పాడువాన్,
వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే అమ్మా!, నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదహారవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


నాయకుడగు నందగోపు భవన రక్షకులారా
సుందర మణిద్వారపు గడితీయరారా
అందమైన తోరణాలు మెరియుచూ ఉండగా
పొందికగా ధ్వజములు పైకెగురుచు ఉండగా

మాయామానుషుడైన మణివర్ణుడు
గేయానికి తోడు పరమిచ్చువాడు
పరమునందుకోగా శుద్ధులమై వచ్చాము
మరేదైన ఇచ్చినా వలదనీ చెప్పేము


శ్రీకృష్ణుని మేలుకొలుపు పాటలెన్నొ పాడేమూ
శ్రీ హరిని సేవించగ ద్వారము కడ నిలిచేము
ద్వారములు ప్రేమతో దగ్గరగా ఐనవయ్య
మారు మాటాడకా మముగావ రావయ్యా

గడియ తీసినా మరు ఘడియ కేమౌతామో
అడుగులు తడబడగా హరిచేర వచ్చాము
పిడుగు వంటి మాట ముందు నువ్వు అనకుము
సతులనూ శ్రీహరి సన్నిధికీ చేర్చుము


నాయకుడగు నందగోపు భవన రక్షకులారా
సుందర మణిద్వారపు గడితీయరారా  

సోమవారం, డిసెంబర్ 30, 2019

తిరుప్పావై 15 ఎల్లే ఇళంకిళియే...

ధనుర్మాసం లోని పదిహేనవ రోజు పాశురము "ఎల్లే! ఇళంకిళియే !". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
ఓసి చిన్నారి చిలుకమ్మా
ఒడలెరుంగకుండ ఇంత నిద్రయా
గోల వలదు వచ్చు చున్నాను
మాటలు వలదు రమ్ము

లేచి వచ్చిరా అందరు
లెక్కగొనుము
మత్త మాతంగమును
పరిమార్చినట్టి
పరమపురుషుని
నామాడి పాడుకొనగా
ఆలసింపకా రావమ్మా 

 
తరళ నయనా
తరళ నయనా
తరళ నయనా
    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదిహేనవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
ఎల్లే! ఇళంకిళియే ! ఇన్నముఱంగుదియో,
శిల్లె న్ఱழை యేన్మిన్ నంగైమీర్, పోదరుగిన్ఱేన్,
వల్లై ఉన్ కట్టురైగళ్ పండే యున్ వాయఱిదుమ్,
వల్లీర్ గళ్ నీంగళే, నానేదా నాయుడుగ,
వల్లైనీ పోదాయ్! ఉన్నక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ పోన్దారో? పోన్దార్, పోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తழிక్క
వల్లానై, మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదిహేనవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


ఇదియేమిటమ్మా ఓ చిట్టి చిలుకా
ఎంత ప్రొద్దాయెనూ నిదుర చాలింకా

నీలోని నేర్పు మరి నీ మాటతీరునూ
నీ లీలలన్నియు మాకెపుడొ తెలిసెను
అలిగిన సఖులార ఎద ఘల్లుమనగను
పరిగెడుతూ వచ్చెను పలుక్షణములాగరా


మీ నేర్పు మీ ఓర్పు మీ కఠిన చర్యలు
మీనాక్షులారా నా కన్ని తెలియును
శ్రీకాంతుని కొలిచే వారంత వచ్చారా
శ్రీ వారి చరణాల సన్నిధి వదిలేసీ

ఏలాతీయదు తలుపు ఓ బోణులారా
ఏకాంతమొదిలేసి ఈ కాంతలను చేరి
గోపికలోలుని కువలయ గమనుని
గానము చేయుటకు మాతో రావమ్మా
గమ

ఇదియేమిటమ్మా ఓ చిట్టి చిలుకా
ఎంత ప్రొద్దాయెనూ నిదుర చాలింకా  

ఆదివారం, డిసెంబర్ 29, 2019

తిరుప్పావై 14 ఉఙ్గళ్ పుழைక్కడై...

ధనుర్మాసం లోని పదునాల్గవ రోజు పాశురము "ఉఙ్గళ్ పుழைక్కడై". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
ఇంతి నీ తోట బావిలో
ఎర్రనైన కమలముల్ పూచే
ముకుళించె కలువ పూలు

కావి ధోవతుల్ కట్టి
శంఖంబులూది
అరుగుచున్నారు
సన్యాసులాలయమ్ము


మమ్ము మునుముందు
లేపంగ మాటనిచ్చి
స్థిరము నిద్రింప నీకెంత సిగ్గులేదే

శంఖచక్రముల్ దాల్చిన
జలజ నయను పాడుటకు రమ్ము
గుణవతీ పాన్పు వీడుము
గుణవతీ పాన్పు వీడుము 

   
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదునాల్గవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
ఉఙ్గళ్ పుழைక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెఙ్గழுనీర్ వాయ్ నెழకిన్దు ఆమ్పల్ వాయ్ కూమ్బినకాణ్,
శెంగల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్,
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్,
ఎంగళై మున్నమ్ ఎழுప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్ ఎழுన్దిరాయ్! నాణాదాయ్! నావుడైయాయ్!
శంగొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్,
పంగయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదునాల్గవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


తీయ తీయగ పలికే పలుకులదానా
శయ్యనింక వదిలేసి తలుపు తీయవా
సిగ్గు బిడియమేమి లేని చిన్న దానవా
మొగ్గ వంటి మోము యున్న మూగదానవా

పెరటి తోటలో ఉన్న పెద్ద కొలనులోను
విరిసినవి కమలాలు ముడిచినవి కలువలు
ఎరుపు గుట్టలు అట్టి మెరిసే పలువరసవారు
పరుగెడుదురు యోగులు పరమాత్మ సేవకై


పరిపూర్ణ జ్ఞానురాల మురిపాల ముద్దుబాల
అరమరికలు లేక నేడు మాట ఇచ్చి మరువనేల
నేటి రవీ రాకముందె మమ్ము మేల్కొలిపేవని
మాటకారి తగునా ఇటు చెప్పి నిదురపోవా

శంఖ చక్ర ధారుడు ఆజానుబాహుడు
సంకటారి శత్రు హారి పుండరీక నందనుడు
జంకు గొంకు మాని వాడి జపతపముల్ ఆచరించ
మంకువీడి లేచిరమ్మ మాధవుని స్తుతియించ


తీయ తీయగ పలికే పలుకులదానా
శయ్యనింక వదిలేసి తలుపు తీయవా
సిగ్గు బిడియమేమి లేని చిన్న దానవా
మొగ్గ వంటి మోము యున్న మూగదానవా


శనివారం, డిసెంబర్ 28, 2019

తిరుప్పావై 13 పుళ్ళిన్ వాయ్...

ధనుర్మాసం లోని పదమూడవ రోజు పాశురము "పుళ్ళిన్ వాయ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
బకుని చంపిన కృష్ణుని
పంక్తికంఠు ప్రాణముల్
యేగొన్న రామునీ పాడుకొనుచు
గమ్యమును చేరుచున్నారు కాంతలెల్ల
 
శుక్రుడుదయించే గురుడును శూన్యుడయ్యే
పక్షులివిగో కూయుచున్నవి పద్మ నయనా
మంచి దినమున నీవిట్లు మాటలేక
నిద్రవోవుచునుండుటా నీతి కాదు


లేవవేమమ్మా నోముకు లేచిరావమ్మా
లేవవేమమ్మా నోముకు లేచిరావమ్మా
   
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదమూడవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై,
క్కిళ్ళి క్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
ప్పిళ్ళైకళెల్లారుమ్ పావైక్కళమ్ పుక్కార్,
వెళ్ళి యెழுన్దు వియాழ ముఱంగిత్తు,
ప్పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్! పోదరిక్కణ్ణినాయ్,
కుళ్ళక్కుళిర క్కుడైన్దు నీరాడాదే,
పళ్ళిక్కిడత్తియో పావాయ్ ! నీ నన్నాళాల్,
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదమూడవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా
వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా


బలమున్న బకాసురుని గళము చీల్చి పొగడినా
అలి వేణులకాప్తుడైన ఆ కృష్ణుని వీడినా
పది తలలా రావణుని పల్లవమ్ముగా దృంచిన
పదుగురు శ్రీరాముని మది పాడుచు వచ్చినా

వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా


వనితలంత వలపులొలుక
వ్రత క్షేత్రమింపులొలుక
వయ్యారము చిందులాడ
వేయి పేర్లు పెట్టి పిలువ

వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా


కమలాల కన్న మిన్న కన్నులు గలదానా
రమణీయ హరిణి కన్న రమ్య దృక్కులున్నదాన
తూరుపున శుక్రుడెదిగి పడమట గురువొదిగే
వేరు వేరు రవళులు విహంగములు వినిపించిన

వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా


నల్లనయ్య ఒడిలో నలిగి అన్ని విస్మరించి
తెల్లవార్లు పాన్పుపైన కేళిలోన పరవశించి
చల్లనైన నీటిలోన జలకమాడి మా వెంట
ఉల్లములో హరిని నిల్పి వ్రతము చేయరమ్మంటే

వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా


శుక్రవారం, డిసెంబర్ 27, 2019

తిరుప్పావై 12 కనైత్తిళం కత్తెరుమై...

ధనుర్మాసం లోని పన్నెండవ రోజు పాశురము "కనైత్తిళం కత్తెరుమై". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
తమదు గారాబు దూడలా
తలచి వెరచి ఇదిగో గేదెలు
పాలు వర్షించు చుండ
అడుసుగా మారె
మీ ఇంటి ప్రాంగణంబు

నింగి అంతయు
మంచుతొ నిండి యుండ
నిన్ను లేప
మీ గడపను నిలిచినాము 

 
మధురమైన రామనామంబు
మేము పాడుచున్నాము
రావమ్మా ప్రక్క వదలి రావమ్మా
రావమ్మా ప్రక్క వదలి రావమ్మా
   
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పన్నెండవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
కనైత్తిళం కత్తెరుమై కన్ఱుక్కిరంగి,
నినైత్తు ములైవழிయే నిన్ఱుపాల్ శోర,
ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్ తంగాయ్
పని త్తలైవీழనిన్ వాశల్ కడైపత్తి,
శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై చ్చెత్త,
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్,
ఇనిత్తా నెழுన్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్,
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్.


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పన్నెండవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు
కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు
ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు
కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు

నేలనంటు పొదుగులతో పాలు పితుకు వారు లేరని
చిన్న దూడలు తలచి అరచి గంతులిడుచు వచ్చెననుకొని
అనురాగముప్పొంగి మనసు కరిగి పొదుగు పొంగి పొంగి
పాల ధార ప్రవాహంబు పంకిలమ్మైపోయె వాకిలి


పశు సంపద కలవాని పరమ సాధ్వి చెల్లెలా
నెత్తి పైన మంచుకురవ ముత్తడైనా వరదలా
బొత్తిగ తలదాచ లేక చూరు క్రింద నిలచి నిలచి
చిత్తమున శ్రీగోప దేవుని చేర్చుకొమ్మను వేళా

గొంతు చించి వేడుకొన్న గొంతు విప్పవేమిటమ్మా
వింత వార్తలు ఎపుడో ఈ ఊరంతా ప్రాకి పోయేనమ్మా
లెమ్ము పూల పాన్పునొదిలి ధర్మము కాపాడవమ్మా
ఇమ్మహి నిధులెన్ని ఉన్నా ఎందుకు కొరగావు లెమ్మా


ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు
కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు
ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు
కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు


గురువారం, డిసెంబర్ 26, 2019

తిరుప్పావై 11 కత్తుక్కఱవై...

ధనుర్మాసం లోని పదకొండవ రోజు పాశురము "కత్తు కఱవై". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
పెక్కు విధముల
గోవుల విదుక గల్గి
శాస్త్రవుల జెంది
ఎట్టి దోషములు లేని
మంచి గోపాల
కులమున విచ్చినట్టి
నెలత బంగరు తీగరో
జలజ వర్ణ
పదములన్ పాడ
ఉలకవు పలుకవేమీ
ఇట్టి నీ నిద్రకి
అర్ధమదేమి చెప్పుమా
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదకొండవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
కత్తుక్కఱవై క్కణంగళ్ పలకఱన్దు,
శత్తార్ తి ఱలழிయచ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్,
కుత్తమొన్ఱిల్లాద కోవలర్ దమ్ పొఱ్కొడియే !
పుత్తరవల్ గుల్ పునమయిలే! పోదరాయ్,
శుత్తుత్తు త్తోழிమారెల్లారుమ్ వన్దు, నిన్
ముత్తమ్ పుకున్దు ముకిల్ వణ్ణన్ పేర్ పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెండాట్టి, నీ !
ఎత్తుక్కుఱంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదకొండవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


చిన్న దూడలు వెంటనున్న
ఆలమందల పాలు పితుకుచు
శత్రు శేషము ఉండవలదని
చక్ర యుద్దము చేయునట్టి
పరమ హితమౌ గోపకులమున
పరిమళించిన పసిడి బొమ్మా
కనులు తెరచి కరుణ దలచి
నిదుర లెమ్మా

పుట్టలోనికి దూరు నాగిని
జఘన భాగము కలిగిన అమ్మ
అడవి నెమలుల అందమంతయు
కురుల ముడిలో ఒదిగినమ్మా
తనువు మరచి మనసు తెరచి
తలుపుతీయగా లేచిరామ్మా


బందువర్గమూ చెలుల బృందమూ
భక్తులెల్లరూ భజన చేయుచు
మంగళమ్ములు పాడినారు
ఉలక కుండా పలక కుండా ఉన్నవేమమ్మా
తెలుపు మా సంపదల తల్లి
నీ నిద్రకేమి అర్ధమమ్మా..

చిన్న దూడలు వెంటనున్న
ఆలమందల పాలు పితుకుచు
శత్రు శేషము ఉండవలదని
చక్ర యుద్దము చేయునట్టి
పరమ హితమౌ గోపకులమున
పరిమళించిన పసిడి బొమ్మా
కనులు తెరచి కరుణ దలచి
నిదుర లెమ్మాబుధవారం, డిసెంబర్ 25, 2019

తిరుప్పావై 10 నోత్తు చ్చువర్...

ధనుర్మాసం లోని పదవ రోజు పాశురము "నోత్తు చ్చువర్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
నోములను నోచి సౌఖ్యంబునొందుచున్న
మువిద తలుపులా తెరవకే యున్నపోయి
వత్తుననుచు మాటైన పలుకరాదో

రామబాణాల సమసిన రాక్షసుండు
కుంభకర్ణుండు తన నిద్ర కూడా
నీకే ఇచ్చి పోయేనా 

 
మాయార్తిని ఎరిగి లెమ్మా
తేరి కొనివచ్చి
తలుపులు తెరువుమమ్మా
తలుపులు తెరువుమమ్మా
 
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
నోత్తు చ్చువర్ కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్,
నాత్తత్తుழாయ్ ముడి నారాయణన్, నమ్మాల్
పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్, పఱ్దొరునాళ్,
కూత్తత్తిన్ వాయ్ విழ்న్ద కుమ్బకరణనుమ్,
తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?,
ఆత్త వనన్దలుడైయాయ్! అరుంగలమే!
తేత్తమాయ్ వన్దు తిఱవేలో రెమ్బావాయ్.


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


నోమును నోచుకొని సురభోగమంది
మేము రాకముందే గడియేసుకున్నావా
మామాటలేమైనా వినిపించుకోలేవా
మోమాటకైనను పలుకైన పలుకవా

శ్రీ తులసి జయ తులసి మాల ధరించి
శ్రీతులమై మంగళము పాడగ పరమిచ్చి
పుణ్య జనుడైనట్టి ఆ కుంభ కర్ణుండు
తిరిగి వెళ్ళుచు నిదుర నీకప్పగించెనా


అంత మత్తు నిద్దుర నీకింక వలదమ్మా
ఇంతులకు మణిదీపు ఈ మైకమొదులమ్మా
స్వంత ఇండ్లను విడిచి సంకీర్తనమ్ముతో
చెంత చేరితిమమ్మా తలుపు తీయమ్మా

నోమును నోచుకొని సురభోగమంది
మేము రాకముందే గడియేసుకున్నావా
మామాటలేమైనా వినిపించుకోలేవా
మోమాటకైనను పలుకైన పలుకవా   

మంగళవారం, డిసెంబర్ 24, 2019

తిరుప్పావై 9 తూమణిమాడత్తు...

ధనుర్మాసం లోని తొమ్మిదవ రోజు పాశురము "తూమణి మాడత్తు". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
మంచి మాణిక్య
ఖచితమౌ మందిరానా
ధూప దీపాల దీప్తి
మాధుర్య మొసంగా
పట్టుపాన్పున నిద్రించు వదినా
లెమ్ము అక్కా మీరైన లేపరా

ఆమె మూగదా చెవిటిదా అలసెనా
తంత్ర గాని వశము చెందెనా


మేమంతా వాసుదేవు
వివిధ నామముల్ ముడువంగా రారాదా
వివిధ నామముల ముడువంగా రారాదా
వివిధ నామముల ముడువంగా రారాదా
 

    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి తొమ్మిదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
తూమణిమాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ,
తూపమ్ కమழ త్తుయిలణై మేల్ కణ్వళరుమ్,
మామాన్ మకళే ! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
మామీర్! అవళై యెழுప్పీరో, ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్ఱి చ్చెవిడో ?, అనన్దలో ?
ఏమ ప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాదవన్ వైగున్దన్ ఎన్ఱెన్ఱు,
నామమ్ పలవుమ్ నవిన్ఱేలో రెమ్బావాయ్ 


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి తొమ్మిదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


మలినశూన్యములైన మణులెన్నో పొదిగిన
వలపులను పురికొల్పు గంధములు చల్లిన
పలు విధములైన దీపాల వెలుగున
పులకరించెను శయ్య పుష్ప సంపదలతో


మత్తుకొల్పెడి క్రొత్త మేడలో పడుకొన్నా
అత్త కూతురా వేగ లేచి ఇటు రావమ్మా
చిత్త శుద్దితో తలుపు శీఘ్రమే తీయమ్మా
పెత్తనం చాలించి మెత్తబడిపోవమ్మా

పుత్తడి మనసున్న పెద్ద అత్త గారు
మత్తొదిలి లేవనీ కూతురుని చూసేరు
చెవిటిదా గుడ్డిదా నీ బిడ్డ మూగదా
సేవలింకేమైనా చేసి అలసినదా


కదిలితే దండించు కాపరులు ఉన్నారా
కన్ను తెరవకుండా మంత్రించినారా
మాయావీ మాధవా వైకుంఠ వాసయని
మనసారా పిలవగా మగువ లేచిరమ్మా

మలినశూన్యములైన మణులెన్నో పొదిగిన
వలపులను పురికొల్పు గంధములు చల్లిన
పలు విధములైన దీపాల వెలుగున
పులకరించెను శయ్య పుష్ప సంపదలతో  


   

సోమవారం, డిసెంబర్ 23, 2019

తిరుప్పావై 8 కీழ்వానమ్ వెళ్ళెన్ఱు...

ధనుర్మాసం లోని ఎనిమిదవ రోజు పాశురము "కీழ்వానమ్ వెళ్ళెన్ఱు". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
 తూరుపు తెల తెల వారెను
దూరమరిగె మేయా
గేదెల గుంపులు నాయకమ్మా
గమ్యమును జేరు 

సఖురాండ్రా గమనమాపి
వచ్చినారము నినుబిలువ 

వనజ నయనా 

కేశి రాక్షసు చీల్చినా కేశవుండు
మానులిద్దరి కూల్చిన మాధవుండు
దేవ దేవుడౌ శ్రీ కృష్ణుని తెలిసి కొలువ
ఆర్తి గుర్తించి ఆతడే ఆదుకొనును 


ఆర్తి గుర్తించి ఆతడే ఆదుకొనును

 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఎనిమిదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
కీழ்వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱువీడు,
మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్,
పోవాన్ పోగిన్ఱారై పోగామల్ కాత్తు, ఉన్నై
క్కూవువాన్ వందు నిన్ఱోమ్ కోదుకలముడైయ
పావాయ్ ! ఎழுన్దిరాయ్! పాడిప్పఱై కొండు
మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ,
దేవాదిదేవనై శెన్ఱు నాం శేవిత్తాల్,
ఆవావెన్ఱారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఎనిమిదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి 

 
కోడికూసెను తెల్లవారెను
పాడి పశువులు మేతకెళ్ళెను
చూడ చూడగా భానుడెదిగెను
లేచి రావమ్మా...

ఆడపడుచులు వ్రతము చూడగా
జోడు జోడుగా పరుగులిడగా
వేడుకొనుచూ ఆగినాము
మేడక్రిందనే నిలిచినామూ


హంసతూలిక తల్పమొదలి
హర్షమంతయూ ఆత్మ నిలిపి
పంచభానుని మరచి పొమ్మా
పంచగమనా నిదుర లెమ్మా

వ్యధలనన్నియు మంట గలిపి
మధుర నాధుని భజన సలిపి
వ్రతమునందలి పరణు పొంది 
చతుర్విధముల ఫలితమొంది 


అశ్వరూపులైన అసురులందరిని
మల్లులందరి చీల్చి చంపిన
దేవి దేవతలంత పొగడిన
ఆది దేవును ఆశ్రయించగా
మంద గమనా నిదురలెమ్మా

కోడికూసెను తెల్లవారెను
పాడి పశువులు మేతకెళ్ళెను
చూడ చూడగా భానుడెదిగెను
లేచి రావమ్మా... 
 

  

ఆదివారం, డిసెంబర్ 22, 2019

తిరుప్పావై 7 కీశుకీశె న్ఱెంగుం...

ధనుర్మాసం లోని ఏడవ రోజు పాశురము "కీశుకీశె న్ఱెంగుం". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
  కీచు కీచుమని
పక్షులు కేరుచుండె
పెరుగు చిల్కంగ భామినుల్
పెద్ద శబ్దమగుచుండె 


భూషణమధన గాఢ శబ్దముల్
కలసి వినవె సఖియా
పిచ్చి దానవే లేవవే
నీ వ్రతంబు చేయా
కాంతి గల గాన
నాయకు కన్నెవీవు


పాడవలయును మముగూడి
పద్మనాభు గూర్చీ
తెరవా ఇకనైనా
తలుపులు తెరవవమ్మా 

 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఏడవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
కీశుకీశె న్ఱెంగుం ఆనై చాత్తన్, కలన్దు !
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణే !
కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్ప క్కైపేర్తు,
వాశ నఱుం కుழలాయిచ్చియర్, మత్తినాల్
ఓశై ప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో,
నాయగ ప్పెణ్బిళ్ళాయ్ ! నారాయణన్! మూర్తి!,
కేశవనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో,
తేశ ముడైయాయ్! తిఱవేలో రెమ్బావాయ్.


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఏడవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి 

 
ఓ పిచ్చిపిల్లా తెల్లారెనమ్మా
ఓపిక తో నిదురింక చాలించి లెమ్మా
చాలించి లెమ్మా

కీచు కీచుమని భరద్వాజమ్ములూ
కిలకిల ధ్వనులతో ఏవేవో పిలుపులు
పగలైతే కలవమనీ తెలిపేటీ కులుకులు
మగువరో వినలేదా ఆ చిలుక పలుకులు


విరులన్నీ కురులనూ విడిచి పోయినా గానీ
మరుమల్లె వాసనలా మత్తు విడిపోనీ
గొల్ల పడుచులు చల్ల చిల్కగా ఆఆఆఆ
కంకణ కంఠ హారమ్ములా ధ్వనులు వినలేదా

అన్ని వస్తువులందు హత్తుకొని ఉండియు
కన్నులకు మనకెప్పుడు కనపడుచూ ఉండు
ఆ కన్నయ్యగా పుట్టి హతమార్చె దుష్టులను 
విన్నవించినవన్నీ వినుచూ నిదురింతువా


నీకు న్యాయమా ఇదీ ఓ నాయకీమణి
నీ అందచందాలూ నిగ్గులనూ చూపుటకూ
ఆ స్వామికి అడ్డముగా అటుమళ్ళబోకు
తెరవమ్మా ద్వారమును తిమిరమంతమూ చేయగా

ఓ పిచ్చిపిల్లా తెల్లారెనమ్మా
ఓపిక తో నిదురింక చాలించి లెమ్మా
చాలించి లెమ్మా

 

శనివారం, డిసెంబర్ 21, 2019

తిరుప్పావై 6 పుళ్ళుమ్ శిలుమ్బినగాణ్...

ధనుర్మాసం లోని ఆరవ రోజు పాశురము "పుళ్ళుమ్ శిలంబినకాణ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
  పక్షులవిగొ కూయుచుండె
పక్షి రాజ కీర్తనుని ఇంట
శంఖంబు మ్రోతలవిగో
మాయా పూతన
విషమానీ మరణమునిచ్చి

కపట శకటుని
పరిమార్ధ కాల దన్ని 
పాల సంద్రాన నిద్రించు
పరమ పురుషు మనసులో నిల్చి
హరియంచు మునులు
యతులు లేచుచున్నారు


సఖురాలా లేవరమ్మా
సఖురాలా లేవరమ్మా 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఆరవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
పుళ్ళుమ్ శిలుమ్బినగాణ్ పుళ్ళరైయిన్ కోయిలిల్,
వెళ్ళై విళిశఙ్గిన్ పేరరవమ్ కేట్టిలైయో?,
పిళ్ళాయ్ ! ఎழும்దిరాయ్ పేయ్ ములై నంజుండు,
కళ్ళచ్చగడం కలక్కழிయ క్కాలోచ్చి,
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమర్ న్ద విత్తినై,
ఉళ్ళత్తు క్కొండు మునివర్ గళుమ్ యోగిగళుమ్,
మెళ్ళ వెழும்ద్ అరిఎన్ఱ పేరరవమ్,
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్..


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఆరవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
 
ఆ హరి కౌగిట అలసట చెందిన
అమ్మాయి మణి నిదుర లేవమ్మా
అహరహములు ఆ పక్షి గుంపులు
దేహాలు మురిపించే పలుకులు వినవమ్మా


గరుడారూఢుడై కదలిన వేళ
త్వరగా లెమ్మను శంఖారావము
వినబడు ధ్వనులకు కనువిప్పలేవా
నిను లేపు వారలెవరును లేరా

పాలిడ వచ్చిన పూతన స్థనముల
పాలుత్రాగుచు ప్రాణము తీసిన
బాల కృష్ణుని లీలలు చూపుచు
బండి రక్కసుని గుండెలు చీల్చెను


క్షీర సంద్రమున శేష శాయి యై
కారణ భూతుడై లోకోన్నతికై
భారము నెత్తిన మోసిన వాడై
తీరని యోగనిద్రలో మునిగిన

సర్వేశ్వరుని సన్నిధి చేరిన
సకలమౌనులు హరిఓం హరి అన
సర్వ దిశలలో మ్రోగెను నాదము
సహన శాంతుల చూపెను వేదము

ఆ హరి కౌగిట అలసట చెందిన
అమ్మాయి మణి నిదుర లేవమ్మా


 

శుక్రవారం, డిసెంబర్ 20, 2019

తిరుప్పావై 5 మాయనై మన్ను...

ధనుర్మాసం లోని ఐదవ రోజు పాశురము "మాయనై మన్ను". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
  మాయతొ గూడి ఉత్తర మధురన్ పుట్టి
తల్లినలరించి యమునను దాటి వచ్చి
అచట రేపల్లె మణి దీపమై తనర్చి
తల్లి త్రాట గట్టగా
 

దామముదరమందు దాల్చి
దామోదరుండైన కృష్ణు శుచులమై
మంచి అలరుల సరిది గొల్చి
పలికి నోరారా పాపముల్ పారిపోయి 


అగ్నిలోన పడ్డ దూదియై అంతరించు
అగ్నిలోన పడ్డ దూదియై అంతరించు

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు. 
 

 
మాయనై మన్ను వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
తాయై క్కుడల్ విళక్కమ్ శెయ్ ద దామోదరనై,
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొழுదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయపిழைయుమ్ పుగుతరువా నిన్ఱనవుమ్
తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెమ్బావాయ్


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழு=ళు

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఐదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
 
మాయా మానుష మంజుల రూపుని
మర్మము కనుగొన మగువలు రండి

తల్లి యశోద త్రాడుతొ కట్టగా
ముల్లోకనాథుడు ముందుకెళ్ళగా
ముసి ముసి నగవుల ముద్దు లొలకగా
పసి బాలకృష్ణుని పదములంటగా


సొగసులు చిలికెడి మధురా నగరిలో
సుందర యమునా తటి సీమలలో
కాళీయునిపై కాలుని మోపి
కేళిని సలిపిన లీలా లోలుని

పరిమళమొలికెడి పరి పరి విధముల
విరి కన్నెలతో జరిపిన పూజల
పాపాలు దహియించు ప్రత్తిలా తృటిలో
అజ్ఞానమంతమై విజ్ఞానమొసగే


మాయా మానుష మంజుల రూపుని
మర్మము కనుగొన మగువలు రండి
 


 

గురువారం, డిసెంబర్ 19, 2019

తిరుప్పావై 4 ఆழி మழைక్కణ్ణా...

ధనుర్మాసం లోని నాలుగవ రోజు పాశురము "ఆళి మళైక్కణ్ణా". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
  వానదేవుడా గంభీర వార్ధిన్ జొచ్చి
కడుపునిండ నీరు ద్రావి కదలి వచ్చి
పద్మనాభుని చక్రంబు పగిధి మెరసీ

వాని శంఖంబు రీతిగా ధ్వనిని జేసి
వాని శార్దంబు వెల్వడు బాణ సరళి
మేము నీరాడ లోకముల్ మేలనంగ


కొదువ జూపకా అందరీ కోర్కె దీర
వర్షమీవయ్య చక్కగా వరుణ దేవా
వర్షమీవయ్య చక్కగా వరుణ దేవా 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు.  
 

 
ఆழி మழைక్కణ్ణా ! ఒన్ఱు నీ కైకరవేల్,
ఆழிయుళ్ పుక్కు ముకన్దుకొ డార్తేఱి,
ఊழிముతల్వ నురువమ్బోల్ మెయ్ కఱుత్తు,
పాழிయన్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్.
ఆழிపోల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱతిర్ న్దు
తాழாదే శార్ ఙ్గ ముదైత్త శరమழைపోల్,
వాழవులకినిల్ పెయ్ దిడాయ్, నాంగళుమ్
మార్గழி నీరాడ మగిழ்న్దేలో రెమ్బావాయ్ 


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. 
ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழா=ళా
 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి నాలుగవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
 
పరోపకారా పర్జన్య దేవా
సరాగముతో వర్షించి పోవా
నీ ఔదార్యము నీ దాతృత్వము
నిర్మలమైనది నీవెరుగ లేవా

గంభీర జలధి మధ్యలోకేగి
కుంచించి త్రాగేసి జగమంత మోగి
రమణుల మురిపించు కమనీయ గాత్రా
తంభాన నెరసిన నరహరిని ఎరుగవా


శ్రీచక్రమోలే ధగ ధగ మెరసి
శంఖారావమోలే దడ దడ ఉరిమి
శార్ఘ ధనువుల శరములు కురిపించి
అనుభూతి కలిగించి వర్షించి పోవా

భూలోకమంతయూ పులకించి పోగా
ఈ లోకులెల్లరు హర్షింతుననగా
సంతోషముప్పొంగు మార్గశిరమున
చలివాన జల్లుల జలమ్ములాడగ
 

పరోపకారా పర్జన్య దేవా
సరాగముతో వర్షించి పోవా

 

బుధవారం, డిసెంబర్ 18, 2019

తిరుప్పావై 3 ఓంగి ఉలగళన్ద...

ధనుర్మాసం లోని మూడవ రోజు పాశురము "ఓంగి ఉలగళన్ద". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం

పెరిగి లోకముల్ కొలిచిన పెద్ద వేల్పు
ఉత్తముని పేరు నుతియించి నోము నోవా

చెడ్డ తొలగును మంచే చేరుచుండు
నెలకు ముమ్మారు వర్షించు నేలయంతా

పాడి పంటలు చూపట్టు భాగ్యమబ్బు
జనులకెప్పుడు శుభములే జరుగుచుండు

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి వీడియోను మీరు ఇక్కడ చూడవచ్చు. 
 
 
ఓంగి యులకళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నమ్పావైక్కు చ్చాత్తి నీరాడినాల్,
తీంగిన్ఱి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు,
ఓంగు పెరుం శెన్నెలూడు కయలుగళ,
పూంగువళైప్పోదిల్ పొఱివణ్డు కణ్పడుప్ప,
తేంగాదే పుక్కిరున్దు శీర్తములై పత్తి
వాంగ, క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళళ్ పెరుమ్బశుక్కళ్,
నీంగాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి మూడవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.

 
ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి

వన్నెల చిన్నెల చిన్నారులారా
పుణ్యమైన వ్రతమాచరించరా

బలిదానముతో ప్రబలిన వాని
లలితలలితమౌ వామన రూపుని
సలలిత స్వరముల గానము చేసీ
జలకములాడీ వ్రతమును జరుపగా

హర్షముతో భువి వర్షించగను
కర్షక శ్రమలకు ఫలితము దక్కును
పెరుగగ పైరులు చేపలు ఎగురగ
కమలం కౌగిట భ్రమరంపును కదా

బస్యమై గోవుల పాలు వెన్నలతో
సస్యశ్యామలమై రేపల్లెయంతయు
గోపాంగనలు చేయగ వ్రతము
ఈ పల్లెయంతయు శోభలు చిందగా

వన్నెల చిన్నెల చిన్నారులారా
పుణ్యమైన వ్రతమాచరించరా

 

మంగళవారం, డిసెంబర్ 17, 2019

తిరుప్పావై 1 మార్గళి & 2 వైయత్తువాళ్...

ధనుర్మాసం సంధర్బంగా గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురములను ఈ ముప్పై రోజులు తలచుకుందాం. తమిళ పాశురములను అందమైన తెలుగులోకి శ్రీమాన్ "ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్" అన్వయించగా వాణీజయరాం గారు పాడారు. మొదటి పాశురము ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం

నీళ కుచగిరి తటమున
నిద్రవోవు కృష్ణు మేల్కొల్పి 
శృతి శతాకృష్టమైన
తనదు పారార్ద్యమెరిగించి
తాను తలను దాల్చి
విడచిన పూదండ త్రాట గట్టి
వశునిగా గొన్న
గోదకు వందనములు
గోదకు వందనములు

హంసలు తిరుగు వరిమళ్ళల
అందమైన విల్లిపుత్తూరు గోదమ్మ
విష్ణు గూర్చి పాడినట్టి
తిరుప్పావు పాశురముల్
తలచినంతనే పాపముల్ తొలగి చనును
తలచినంతనే పాపముల్ తొలగి చనును

తలను దాల్చిన పూదండ తగనిదనక
శ్రీషుకర్పించుచు తనను శ్రీనివాస దేవు
జేర్చుమయని కామదేవు వేడు
గోద మాటలే మాకును కోర్కెలిచ్చు
గోద మాటలే మాకును కోర్కెలిచ్చు

మార్గశీర్షంబు కడు
మంచి మాసమిదియె
మంచి వెన్నెల రాత్రులు
మంచి నగలు కలిగి
సుందరులౌ గోప కన్నెలారా

వేకువనే లేచి మీరాడవెక్కయున్న
రండు నోమును నోచగ రమ్యంబుగా
కలువకంటి యశోద
సింగంపు కొదమనంద
తనయుండు చంద్రార్క నయనధారి
ఆది నారాయణుండె మీ ఆర్తి దీర్చు
మేలు మేలని లోకముల్ మెచ్చుకొనును.
మేలు మేలని లోకముల్ మెచ్చుకొనును. 

రెండవ పాశురము  ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.భువిని జన్మించి
సుఖియించు పుణ్యులారా
వినుడు మా నోము
నియమముల్ వివరమ్ముగా


క్షీర సాగర శయనుని కీర్తి పాడి
వేకువనే లేచి మీరాడి వేక్కమీరా
శుచులమై యుండి
 కాటుకల్ సుమములిడక
పాలు నేయి భుజింపక
పరమ భక్తి పెద్ద పిన్నల
గుర్తించి ప్రీతి గూర్చి


పలుకరానట్టి పలుకులను పలుక కుండా
చేయరానట్టి పనులను చేయకుండా
మేము నోచెదమందరి మేలు కోరీ 
మేము నోచెదమందరి మేలు కోరీ 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు ఆ ఎంబెడెడ్ వీడియో ను మీరు ఇక్కడ చూడవచ్చు.


 నీళాతుంగ స్తనగిరితటీసుప్త ముద్బోధ్య కృష్ణం,
పారార్థ్యం స్వం శ్రుతి శత శిరస్సిద్ధ మధ్యాపయన్తీ |
స్వోచ్చిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుజ్క్తే,
గోదా తసై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః ||

అన్న వయల్ పుదువై యాణ్డాళ్ అరంగర్కు
పన్ను తిరుప్పావైప్పల్ పదియమ్, ఇన్ని శైయాల్
పాడిక్కొడుత్తాళ్ నఱ్పామాలై, పూమాలై
శూడిక్కొడుత్తాళైచ్చొల్లు.
శూడిక్కొడుత్త శూడర్కొడియే తొల్ పావై,
పాడియరుళ వల్ల పల్వళైయాయ్,! నాడి నీ
వేంగడవఱ్కైన్నై విది యెన్ఱ విమ్మాత్తమ్,
నాం కడవా చణ్ణమే నల్ కు.
 

మొదటి పాశురము 
 
మార్గழி త్తింగల్ మది నిఱైన్ద నన్నాళాల్,
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిழைయీర్ !
శీర్ మల్ గు మాయ్ ప్పాడి శెల్వచ్చిఱుమీర్ కాళ్,
కూర్ వేల్ కొడున్దొழிలన్ నన్దగోపన్ కుమరన్,
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళం శింగమ్,
కార్ మేని చ్చెంగణ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్,
నారాయణనే నమక్కే పఱై తరువాన్
పారోర్ పుగழప్పడిన్దేలో రెమ్బావాయ్

రెండవ పాశురము ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు

 
వైయత్తు వాழ்వీర్ కాళ్! నాముమ్ నమ్ పావైక్కు,
శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి,
మైయిట్టెழுతోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్,
ఐయముమ్ పిచ్చైయు మాన్దనైయుమ్ కైకాట్టి,
ఉయ్యుమా ఱెణ్ణి ఉగన్దేలోరెమ్బావాయ్.

సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. 
ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழு=ళు
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. ఆ ముప్పై పాటల పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు.

ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం 
సంగీతం : వి.డి.శ్రీకాంత్ 
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య 
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి 

మార్గళి మాసము వచ్చినదీ
మానిని గోదా మురిసినదీ
పాటలు ముప్పది పాడినదీ
పారమార్ధ్యమును తెలిపినదీ

వన్నెల వలపుల చిన్నారులారా
పుణ్యమైన వ్రతమాచరించరా
వెన్నెల కురిసిన వ్రేపల్లె చూరు
కన్నయ్య మదిలో మీరాడుకోరా


పొందుగ పొన్నలు పూచిన వేళల
నందన సరసుల బృందావనముల
సందుగొందుల నంద యశోదల
అందాల సింగము పొందు కోరరో

కమల రేకుల కన్నుల వాడు
కమనీయ నీల దేహము వాడు
చంద్ర సూర్య సమ తేజుడు వాడు
మంద స్మితమున మది దోచు వాడు


సృష్టికి ఆదిగా నిలిచిన వాడు
అష్టాక్షరిలో ఇమిడిన వాడు
ఇష్టమైన పరమిచ్చెడి వాడు
కష్టములను కడతేర్చువాడు

మార్గళి మాసము వచ్చినదీ  


రెండవ పాశురము

వయసులో ఉన్నట్టి వయ్యారులారా
ప్రియమైన ఈ నోము నోచుకోలేరా

త్వరగ నిద్దుర లేచి జలకలములాడి
క్షీరాభ్ది శయనించు మురవైరి చేరి
పరమ పురుషుని ఎదుట మంగళము పాడీ
మరువక నియమాలు వ్రతము జరిపించుదాం


వెన్నమీగడ పాలు వ్రతములో వాడమని
కన్నులకు నల్లని కాటుక పెట్టమని
విరికన్నెదండలను కురులందు తురమమని
తరుణులు తప్పక ప్రతినెలు చేయగా

పెద్దలకు నచ్చని పనులేవి చేయమని
బుద్ధితో ధనమును దానాలు చేతుమని
సిద్ధులకు భిక్షము మనసార పెడుతుమని
సుద్దులెన్నో చెప్పి స్థుతియించ వేగ


వయసులొ ఉన్నట్టి వయ్యారులారా
ప్రియమైన ఈ నోము నోచుకోలేరా 

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.