బుధవారం, డిసెంబర్ 25, 2019

తిరుప్పావై 10 నోత్తు చ్చువర్...

ధనుర్మాసం లోని పదవ రోజు పాశురము "నోత్తు చ్చువర్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
నోములను నోచి సౌఖ్యంబునొందుచున్న
మువిద తలుపులా తెరవకే యున్నపోయి
వత్తుననుచు మాటైన పలుకరాదో

రామబాణాల సమసిన రాక్షసుండు
కుంభకర్ణుండు తన నిద్ర కూడా
నీకే ఇచ్చి పోయేనా 

 
మాయార్తిని ఎరిగి లెమ్మా
తేరి కొనివచ్చి
తలుపులు తెరువుమమ్మా
తలుపులు తెరువుమమ్మా
 
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
నోత్తు చ్చువర్ కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్,
నాత్తత్తుழாయ్ ముడి నారాయణన్, నమ్మాల్
పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్, పఱ్దొరునాళ్,
కూత్తత్తిన్ వాయ్ విழ்న్ద కుమ్బకరణనుమ్,
తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?,
ఆత్త వనన్దలుడైయాయ్! అరుంగలమే!
తేత్తమాయ్ వన్దు తిఱవేలో రెమ్బావాయ్.


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


నోమును నోచుకొని సురభోగమంది
మేము రాకముందే గడియేసుకున్నావా
మామాటలేమైనా వినిపించుకోలేవా
మోమాటకైనను పలుకైన పలుకవా

శ్రీ తులసి జయ తులసి మాల ధరించి
శ్రీతులమై మంగళము పాడగ పరమిచ్చి
పుణ్య జనుడైనట్టి ఆ కుంభ కర్ణుండు
తిరిగి వెళ్ళుచు నిదుర నీకప్పగించెనా


అంత మత్తు నిద్దుర నీకింక వలదమ్మా
ఇంతులకు మణిదీపు ఈ మైకమొదులమ్మా
స్వంత ఇండ్లను విడిచి సంకీర్తనమ్ముతో
చెంత చేరితిమమ్మా తలుపు తీయమ్మా

నోమును నోచుకొని సురభోగమంది
మేము రాకముందే గడియేసుకున్నావా
మామాటలేమైనా వినిపించుకోలేవా
మోమాటకైనను పలుకైన పలుకవా   

2 comments:

దానవ సంహార..శ్రీ కృష్ణా..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.