శనివారం, డిసెంబర్ 21, 2019

తిరుప్పావై 6 పుళ్ళుమ్ శిలుమ్బినగాణ్...

ధనుర్మాసం లోని ఆరవ రోజు పాశురము "పుళ్ళుమ్ శిలంబినకాణ్". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
  పక్షులవిగొ కూయుచుండె
పక్షి రాజ కీర్తనుని ఇంట
శంఖంబు మ్రోతలవిగో
మాయా పూతన
విషమానీ మరణమునిచ్చి

కపట శకటుని
పరిమార్ధ కాల దన్ని 
పాల సంద్రాన నిద్రించు
పరమ పురుషు మనసులో నిల్చి
హరియంచు మునులు
యతులు లేచుచున్నారు


సఖురాలా లేవరమ్మా
సఖురాలా లేవరమ్మా 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఆరవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
పుళ్ళుమ్ శిలుమ్బినగాణ్ పుళ్ళరైయిన్ కోయిలిల్,
వెళ్ళై విళిశఙ్గిన్ పేరరవమ్ కేట్టిలైయో?,
పిళ్ళాయ్ ! ఎழும்దిరాయ్ పేయ్ ములై నంజుండు,
కళ్ళచ్చగడం కలక్కழிయ క్కాలోచ్చి,
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమర్ న్ద విత్తినై,
ఉళ్ళత్తు క్కొండు మునివర్ గళుమ్ యోగిగళుమ్,
మెళ్ళ వెழும்ద్ అరిఎన్ఱ పేరరవమ్,
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్..


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఆరవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
 
ఆ హరి కౌగిట అలసట చెందిన
అమ్మాయి మణి నిదుర లేవమ్మా
అహరహములు ఆ పక్షి గుంపులు
దేహాలు మురిపించే పలుకులు వినవమ్మా


గరుడారూఢుడై కదలిన వేళ
త్వరగా లెమ్మను శంఖారావము
వినబడు ధ్వనులకు కనువిప్పలేవా
నిను లేపు వారలెవరును లేరా

పాలిడ వచ్చిన పూతన స్థనముల
పాలుత్రాగుచు ప్రాణము తీసిన
బాల కృష్ణుని లీలలు చూపుచు
బండి రక్కసుని గుండెలు చీల్చెను


క్షీర సంద్రమున శేష శాయి యై
కారణ భూతుడై లోకోన్నతికై
భారము నెత్తిన మోసిన వాడై
తీరని యోగనిద్రలో మునిగిన

సర్వేశ్వరుని సన్నిధి చేరిన
సకలమౌనులు హరిఓం హరి అన
సర్వ దిశలలో మ్రోగెను నాదము
సహన శాంతుల చూపెను వేదము

ఆ హరి కౌగిట అలసట చెందిన
అమ్మాయి మణి నిదుర లేవమ్మా


 

2 comments:

జయ కృష్ణా..జయ గోదా..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.