సోమవారం, డిసెంబర్ 09, 2019

సీతా కళ్యాణ వైభోగమే...

రణరంగం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. లిరికల్ వీడియో ఇక్కడ.


చిత్రం : రణరంగం (2019)
సంగీతం : ప్రశాంత్‌ పిళ్లై
సాహిత్యం : బాలాజీ
గానం : శ్రీహరి కె.

పవనజ స్తుతి పాత్ర
పావన చరిత్రా
రవిసోమ వర పుత్రా
రమణీయ గాత్రా

సీతా కళ్యాణ వైభోగమే..
రామా కళ్యాణ వైభోగమే

శుభం అని ఇలా
అక్షింతలు అలా దీవెనలతో
అటూ ఇటు జనం హడావిడితనం
తుళ్ళింతల ఈ పెళ్లి లోగిళ్ళలో
పదండని బంధువులొక్కటై
సన్నాయిల సందడి మొదలై
తథాస్తని ముడులు వేసే..హే..ఏ..

సీతా కళ్యాణ వైభోగమే..
రామా కళ్యాణ వైభోగమే

దూరం తరుగుతుంటే
గారం పెరుగుతుంటే
వణికే చేతులకు
గాజుల చప్పుడు
చప్పున ఆపుకొని
గడేయక మరిచిన తలుపే
వెయ్యండని సైగలు తెలిపే
క్షణాలిక కరిగిపోవా.. ఆఆఆ..

సీతా కళ్యాణ వైభోగమే..
రామా కళ్యాణ వైభోగమే 


2 comments:

చాలా బావుందీ పాట..థాంక్యు ఫర్ షేరింగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.