శుక్రవారం, డిసెంబర్ 27, 2019

తిరుప్పావై 12 కనైత్తిళం కత్తెరుమై...

ధనుర్మాసం లోని పన్నెండవ రోజు పాశురము "కనైత్తిళం కత్తెరుమై". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
తమదు గారాబు దూడలా
తలచి వెరచి ఇదిగో గేదెలు
పాలు వర్షించు చుండ
అడుసుగా మారె
మీ ఇంటి ప్రాంగణంబు

నింగి అంతయు
మంచుతొ నిండి యుండ
నిన్ను లేప
మీ గడపను నిలిచినాము 

 
మధురమైన రామనామంబు
మేము పాడుచున్నాము
రావమ్మా ప్రక్క వదలి రావమ్మా
రావమ్మా ప్రక్క వదలి రావమ్మా
   
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి పన్నెండవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
కనైత్తిళం కత్తెరుమై కన్ఱుక్కిరంగి,
నినైత్తు ములైవழிయే నిన్ఱుపాల్ శోర,
ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్ తంగాయ్
పని త్తలైవీழనిన్ వాశల్ కడైపత్తి,
శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై చ్చెత్త,
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్,
ఇనిత్తా నెழுన్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్,
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్.


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి పన్నెండవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు
కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు
ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు
కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు

నేలనంటు పొదుగులతో పాలు పితుకు వారు లేరని
చిన్న దూడలు తలచి అరచి గంతులిడుచు వచ్చెననుకొని
అనురాగముప్పొంగి మనసు కరిగి పొదుగు పొంగి పొంగి
పాల ధార ప్రవాహంబు పంకిలమ్మైపోయె వాకిలి


పశు సంపద కలవాని పరమ సాధ్వి చెల్లెలా
నెత్తి పైన మంచుకురవ ముత్తడైనా వరదలా
బొత్తిగ తలదాచ లేక చూరు క్రింద నిలచి నిలచి
చిత్తమున శ్రీగోప దేవుని చేర్చుకొమ్మను వేళా

గొంతు చించి వేడుకొన్న గొంతు విప్పవేమిటమ్మా
వింత వార్తలు ఎపుడో ఈ ఊరంతా ప్రాకి పోయేనమ్మా
లెమ్ము పూల పాన్పునొదిలి ధర్మము కాపాడవమ్మా
ఇమ్మహి నిధులెన్ని ఉన్నా ఎందుకు కొరగావు లెమ్మా


ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు
కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు
ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు
కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు


2 comments:

జయ గోపాల ..జయ గోవిందా..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.