ఆదివారం, డిసెంబర్ 08, 2019

చిన్ని చిన్ని చినుకులు...

రాక్షసుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాక్షసుడు (2019)
సంగీతం : జిబ్రన్
సాహిత్యం : శ్రీమణి
గానం : సిధ్ శ్రీరామ్
 
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే

చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే

నా గుండెలో నీకో గది ఆకాశమే దాచేనది
నా కళ్ళలో నీ ఊహల ప్రవాహమై పోతున్నది
నాదో క్షణం నీదో క్షణం ఏవైపు సాగేది

చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే


వెతుకుతున్నానే నిన్న కలనే
రేపటి ఊహకే వెళ్ళలేనే
ఈ చిన్ని జ్ఞాపకాల వర్షాలలో
నా గమ్యమేమిటంటే ఏవైపు చూపాలిలే

చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే
చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే


నా గుండెలో నీకో గది ఆకాశమే దాచేనది
నా కళ్ళలో నీ ఊహల ప్రవాహమై పోతున్నది
నాదో క్షణం నీదో క్షణం ఏవైపు సాగేది

చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే 

 

2 comments:

ప్రస్తుత కాలానికి అద్దం లా ఉందీ మూవీ.

నిజమేనండీ..స్కేరీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.