శుక్రవారం, డిసెంబర్ 13, 2019

ఏమో... ఏమో... ఏమో...

రాహు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాహు (2019)
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు 
సాహిత్యం : శ్రీనివాస మౌళి
గానం : సిధ్ శ్రీరామ్

ఎన్నెన్నో వర్ణాలు
వాలాయి చుట్టూ
నీ తోటి నే సాగగా
పాదాలు దూరాలు
మరిచాయి ఒట్టు

మేఘాల్లో వున్నట్టుగా
ఇక గుండెల్లో ఓ గుట్టు దాగేట్టు లేదు
నీ చూపు ఆకట్టగా
నా లోకి జారింది ఓ తేనె బొట్టు
నమ్మేట్టుగా లేదుగా ప్రేమే

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

నేనేనా ఈ వేళ నేనేనా
నా లోకి కళ్ళారా చూస్తున్నా
ఉండుండి ఏ మాటో అన్నాననీ
సందేహం నువ్వేదో విన్నావని
వినట్టు వున్నావా బాగుందనీ
తేలే దారేదని

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

ఏమైనా బాగుంది ఏమైనా
నా ప్రాణం చేరింది నీలోన
ఈ చోటే కాలాన్ని ఆపాలనీ
నీ తోటి సమయాన్ని గడపాలనీ
నా జన్మే కోరింది నీ తోడునీ
గుండె నీదేననీ

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో

ఏమో... ఏమో... ఏమో
నన్ను తాకే హాయే ప్రేమో
ఏమో... ఏమో... ఏమో
చెప్పలేని మాయే ప్రేమో


2 comments:

మోస్ట్ హాపెనింగ్ సింగర్..

అవును శాంతి గారూ ప్రతి సినిమాలో ఒక పాటైనా ఉంటుంది ఇతనిది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.