హరిణి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హరిణి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఆదివారం, మార్చి 14, 2021

కోలో కోలన్న కోలో...

టక్ జగదీష్ సినిమాలోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : టక్ జగదీష్ (2021)
సంగీతం : ఎస్.ఎస్.థమన్   
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : అర్మాన్ మాలిక్, హరిణి ఇవటూరి

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి
ఆరారు ఋతువుల్లోని అక్కర్లేనిది ఏముంది
చూడాలేగాని మన్నే రంగుల పూదోటవుతుంది
తోడై నీవెంట కడదాకా నేనుంటా
రాళ్ళైనా ముళ్ళైనా 
మన అడుగులు పడితే పూలై పొంగాలా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా 
యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి

చినచిన్న ఆనందాలు చినబోని అనుబంధాలు
అపుడపుడూ చెక్కిలిగింతలు పెడుతుండగా
కలతా కన్నీళ్లు లేని చిననాటి కేరింతల్ని
చిటికేసి ఇటురమ్మంటూ పిలిపించగా

కదిలొస్తూ ఉంది చూడు కన్నులవిందుగా
ఊరందర్నీ కలిపే ఉమ్మడి పండుగా
 
హా..! నలుగురితొ చెలిమి పంచుకో
చిరునగవు సిరులు పెంచుకో
జడివానే పడుతున్నా జడిసేనా తడిసేనా
నీ పెదవులపై చిరునవ్వులు ఎపుడైనా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ ధీమాగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

నీలోను నాలోనూ ఈ నేలేగా అమ్మై ఉంది
అంతా అయినోళ్లేగానీ పరులెవ్వరూ
మనలోని చుట్టరికాన్ని మరిపించే ఈ దూరాన్ని
చెరిపే వీలుందంటే కాదనరెవ్వరూ
 
ఒక పువ్వు విచ్చిన గంధం ఊరికే పోదుగా
పదిమందికీ ఆనందం పంచకపోదుగా

ఆ ఆ..! తగిన వరసైన తారక
తెరలు విడి దరికి చేరగా
ప్రతి నిత్యం పున్నమిగా అనుకోదా నెలవంకా
కలలన్నీ విరియగ విరిసిన వెన్నెలగా

నువు ధీనంగా ఏ మూలో కూర్చుంటే
ఓ ఓ..! నిను వెంటాడే దిగులే వెళిపోతుందా
యమ ధర్జాగా ఎదురెళ్ళి నిలుచుంటే
నిన్నెదిరించే బెదురింకా ఉంటుందా

కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి
కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి

 

ఆదివారం, జనవరి 31, 2021

అందాల రాక్షసివే...

ఒకే ఒక్కడు చిత్రం లోని ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 

 
చిత్రం : ఒకేఒక్కడు (1999)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్  
సాహిత్యం : ఎ.ఎం.రత్నం, శివగణేశ్    
గానం : బాలు, హరిణి 

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే 

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే 

గడ్డి మొక్కకు కోత తెలియునా
బాలకొమరి నే కానా
నీటి కొంగను చేప మింగునా 
జరుగునా
బైట పూసినా లోన కాసెడి
శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి
తుంటరి సుమా

చిలకా రామచిలకా 
మొలకా ప్రేమమొలకా

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే 

సూర్యుణ్ణి రెండు చేసి కళ్లలోన దాచుకుందో
చందురుని కంటిపాపలోన తాను ఉంచుకుందో
రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా
మిణుగుర్లు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా
పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయా
తలగడగ నాకొక్క పంచె నువు ఈయవయా
కనుల కునుకే కలయా..

చిలకా రామచిలకా 
మొలకా ప్రేమమొలకా

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే 
 
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి
ఆడుకుందాం.. మొగలిపువ్వా 
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి
ఆడుకుందాం.. మొగలిపువ్వా

తేనెపట్టు పట్టుబట్టి పాడుచెయ్య శపధమా
ప్రేమంటె పార్టీ విడిచి పార్టీ మార్చు విషయమా
కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులవుదువా
నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా
నే కనక నీరైతే నీ నుదుటిపై నే జారి
అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా
కానీ అన్నీ కలలే...

చిలకా రామచిలకా
మొలకా ప్రేమమొలకా

అందాల రాక్షసివే గుండెల్లొ గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే 

గడ్డి మొక్కకు కోత తెలియునా
బాలకొమరి నే కానా
నీటి కొంగను చేప మింగునా 
జరుగునా
బైట పూసినా లోన కాసెడి
శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి
తుంటరి సుమా 


  

సోమవారం, డిసెంబర్ 07, 2020

లాలి లాలి అను రాగం...

ఇందిర సినిమా లోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట నా టాప్ ఫేవరెట్స్ లో ఒకటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఇందిర (1995) 
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ 
సాహిత్యం : సిరివెన్నెల  
గానం : హరిణి   

ఆఆఆఆఆ...ఆఆఆఆఆ...
లాలి లాలి అను 
రాగం సాగుతుంటే 
ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం

కాసే వెన్నెలకు వీచే గాలులకు 
హృదయం కుదుట పడదే
అంత చేదా మరీ వేణు గానం

కళ్ళు మేలుకుంటే 
కాలమాగుతుందా 
భారమైన మనసా
ఆ... పగటి బాధలన్నీ 
మరచిపోవుటకు 
ఉంది కాదా ఈ ఏకాంత వేళ

లాలి లాలి అను 
రాగం సాగుతుంటే 
ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం

స మ గ ప ప మ ప మ 
గ రి గ రి స ని 
స మ గ ప ప మ ప మ 
స మ గ ప ప మ ప మ 
గ రి గ రి స ని 
స మ గ ప స ర మ 
ఆ ...
గ మ ద ద మ ని ని ద 
స రి స ని ద ప 
గ మ ద ద మ ని ని ద 
గ రి స ని ద ప మ ద 

ఏటో పోయేటి నీలి మేఘం 
వర్షం చిలికి వెళ్ళదా 
స రి గ రి గ గ రి గ ప మ గ 
ఎదో అంటుంది కోయల 
పాట రాగం ఆలకించరా 
స రి గ రి గ గ రి గ ప మ గ
అన్ని వైపులా మధువనం 
పూలు పూయదా అను క్షణం 
అణువణువునా జీవితం 
అందచేయదా అమృతం 

లాలి లాలి అను 
రాగం సాగుతుంటే 
ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరీ చిన్ని ప్రాణం

కాసే వెన్నెలకు వీచే గాలులకు 
హృదయం కుదుట పడదే
అంత చేదా మరీ వేణు గానం 
 


శుక్రవారం, సెప్టెంబర్ 18, 2020

ఏమంటారో...

గుడుంబా శంకర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : గుడుంబా శంకర్ (2004)
సంగీతం : మణిశర్మ 
సాహిత్యం : చంద్రబోస్   
గానం : ఎస్.పి.చరణ్, హరిణి 

ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో.. మారిపోతున్న కథనీ
ఏమంటారో.. జారిపోతున్న మదినీ
చూసె పెదవినీ మాటాడే కనులనీ
నవ్వే నడకనీ కనిపించే శ్వాసనీ
ఇచ్చి పుచ్చుకున్న మనసుని
ఇద అద యద విధ మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదినీ
ఏమంటారో నువు నేనైన అదినీ
ఏమంటారో మారిపోతున్న కథనీ
ఏమంటారో జారిపోతున్న మదినీ

ఎదురుగ వెలుగుతున్న నీడనీ
బెదురుగ కలుగుతున్న హాయినీ
తనువున తునుకుతున్న చురుకునీ
మనసున ముసురుకున్న చెమటనీ
ఇష్ట కష్టాలని ఏమంటారొ ఇపుడేమంటారో 
ఈ మోహమాటాలని ఏమంటారొ మరి ఎమంటారో 
స్వల్ప భారాలని ఏమంటారో ఇపుడేమంటారో 
సమీప దూరాలని ఏమంటారో అసలేమంటారొ 
జారె నింగిని దొరలాంటీ దొంగనీ 
పాడె కొంగునీ పరిమళించే రంగునీ 
పొంగుతున్న సుధా గంగని 
ఇద అద అదె ఇద మరి 
ఏమంటారో మారిపొతున్న కథనీ 
ఏమంటారో జారిపోతున్న మదినీ 

జాబిలై తలుకుమన్న చుక్కనీ 
బాధ్యతై దొరుకుతున్న హక్కునీ 
హెయ్ హెయ్ 
దేవుడై ఎదుగుతున్న భక్తునీ 
సూత్రమై బిగయనున్న సాక్షినీ 
పాతలొ కొత్తనీ ఇపుడేమంటారో 
పోట్లాటలొ శాంతిని మరి ఏమంటారో 
తప్పులొ ఒప్పునీ ఏమంటారొ ఇపుడేమంటారో 
గత జన్మలొ అప్పుని ఏమంటారొ అసలేమంటారొ 
నాలొ నువ్వుని ఇక నీలొ నేనునీ 
మాకెమేమనీ మన దారె మనదనీ 
రాసుకున్న ఆత్మ చరితనీ
అద ఇద ఇదె అద మరి 

ఏమంటారో నాకు నీకున్న ఇదినీ 
ఏమంటారో నువు నేనైన అదినీ 
ఏమంటారో మారిపొతున్న కథనీ 
ఏమంటారో జారిపొతున్న మదినీ 
 

బుధవారం, సెప్టెంబర్ 02, 2020

చెలియా చెలియా...

ఖుషి సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఖుషి (2001)
సంగీతం : మణిశర్మ  
సాహిత్యం : ఏ.ఎం.రత్నం 
గానం : శ్రీనివాస్, హరిణి 

చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము
కోపాలు తాపాలు మనకేల 
సరదాగా కాలాన్ని గడపాలా
సలహాలు కలహాలు మనకేల 
ప్రేమంటే పదిలంగా వుండాలా
చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము

రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే 
గాలి తాకంగా పూచెనులే
ఐతే గాలే గెలిచిందననా 
లేక పువ్వే ఓడిందననా
రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్నా 
ఉలి తాకంగా వెలిసెనులే
ఐతే ఉలియే గెలిచిందననా 
లేక శిల్పం ఓడిందననా
ఈ వివరం తెలిపేది ఎవరంటా 
వ్యవహారం తీర్చేది ఎవరంటా
కళ్ళల్లో కదిలేటి కలలంటా 
ఊహల్లో ఊగేటి ఊసంటా

చెలియా చెలియా చిరు కోపమా

నీలి మేఘాలు చిరుగాలిని డీకొంటే 
మబ్బు వానల్లే మారునులే
దీన్ని గొడవెననుకోమననా 
లేక నైజం అనుకోనా
మౌనరాగాలు రెండు కళ్ళని డీకొంటే 
ప్రేమ వాగల్లే పొంగునులే
దీన్ని ప్రళయం అనుకోమననా 
లేక ప్రణయం అనుకోనా
ఈ వివరం తెలిపేది ఎవరంటా 
వ్యవహారం తీర్చేది ఎవరంటా
అధరాలు చెప్పేటి కథలంటా 
హృదయంలో మెదిలేటి వలపంటా

చెలియా చెలియా చిరు కోపమా
చాలయ్యా చాలయ్యా పరిహాసము 
 

 

శనివారం, జులై 04, 2020

చమకు చమకు ఛాం...

చిరంజీవి పాటలు తన మేనల్లుడు సాయిథరమ్ తేజ్ ఎక్కువ రీమిక్స్ చేశాడు, బహుశా మేనమామ దగ్గర చనువు ఎక్కువ ఉంటుంది కనుకేమో. కానీ చిరంజీవి సూపర్ ఈజ్ తో చిన్న చిన్న స్టెప్స్ ని అలవోకగా వేసేసే ఈ పాటను రీమిక్స్ చేయడం మాత్రం పెద్ద సాహసమే. చిరు గ్రేస్ ని రిపీట్ చేయడం అనితరసాథ్యం అని మరోసారి అనిపించక మానదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.   


చిత్రం : ఇంటిలిజెంట్ (2018)
సంగీతం : ఇళయరాజా 
(రీమిక్స్ - ఎస్ ఎస్. థమన్)
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.చరణ్, హరిణి ఇవటూరి 

~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట ఒరిజినల్ ట్యూన్ ని లిరిక్స్ ని అలాగే వాడుకున్నారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కొండవీటిదొంగ (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర 

చిక్ చిక్ చిక్ చిక్... చిక్ చిక్
అరె చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో
చాన్సు దొరికెరో హొయ్య
ఝణకు ఝణకు చాం పట్టుకో పట్టుకో 

ఝంపె దరువులే వెయ్య 
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం

 
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
హే.. ఝణకు ఝుణకు చాం
పట్టుకో పట్టుకో ఝం
పె దరువులే వెయ్య
 
నాగ స్వరములా లాగిందయ్యా
తీగ సొగసు చూడయ్యా
కాగు పొగరుతో రేగిందయ్యా
కోడె పడగ కాటెయ్యా
 
మైకం పుట్టే రాగం వింటూ సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సు బుస్సు ఇట్టే ఆగాలయ్యా
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో 
అరె కైపే రేపే కాటే వేస్తా ఖరారుగా
 
కథ ముదరగ..ఝణకు ఝుణకు చాం
పట్టుకో పట్టుకో
ఝంపె దరువులే వెయ్య
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య 
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ అయ్యారే తస్సాదియ్యా
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ వయ్యారం సయ్యందయ్యా
 
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయ్ మరి కొంచెం

చాం చాం చకచాం చకచాం చాం
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
 
అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా 
ఈత ముల్లులా యదలో దిగెరో జాతి వన్నెదీ జాణ
అంతో ఇంతో సాయం చెయ్య చెయ్యందియ్యాలయ్యా
తియ్యని గాయం మాయం చేసే మార్గం చూడాలమ్మా
రాజీకొస్తాలే కాగే కౌగిళ్ళో 
రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో
ఇక రేపోమాపో ఆపే ఊపే హుషారుగా 

పదపదమని..అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
ఝణకు ఝుణకు చాం
పట్టుకో పట్టుకో
ఝంపె దరువులే వెయ్య
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ అయ్యారే తస్సాదియ్యా

 
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో చాన్సు దొరికెరో హొయ్య
హే.. ఝణకు ఝణకు చాం
పట్టుకో పట్టుకో
ఝంపె దరువులే వెయ్య 
 

 

మంగళవారం, మార్చి 31, 2020

తిరు తిరు గణనాథ...

హండ్రెడ్ పర్సెంట్ లవ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : 100% లవ్ (2011)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిణి

తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై (2)
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై (2)
సా సనిసగసా సగమా మా
మగమపమా మపనీ పా పమపనిసా సానీ
సాగస నీసని పానిప మాపమ గామగసా
॥సనిసగసా॥

చెవులారా వింటూనే ఎంత పాఠమైనా
ఈజీగా తలకెక్కే ఐక్యూనివ్వు
కనులారా చదివింది ఒకసారే ఐనా
కల్లోను మరిచిపోని మెమరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవనిదేదైనా ఛాయిస్‌లో పోనివ్వు
ఒక్కొక్క దణ్ణానికి ఒక్కో మార్కు పణ్ణివ్వు
ఏ టెన్షన్ దరికిరాని ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీటుపైన ఆగిపోని పెన్నివ్వు

తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై

తలస్నానం చెయ్యకుండా పూజించానంటూ
నావైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపూతో పాటే చదివింది తుర్రుమంటూ
వాషైపోతుందని నా సెంటిమెంటు
తలలే మార్చిన తండ్రిగారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే
మా తలరాతలు తారుమారు
భారతం రాసిన చేతితో
బతుకును దిద్దెయ్ బంగారూ
పేపర్లో ఫోటోలు ర్యాంకులెవ్వరడిగారు
పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు

తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై
తిరు తిరు గణనాథ దిద్దిద్దిత్తై 


గురువారం, మే 09, 2019

నీలోని సిలకమ్మ...

శంకర జయంతి సందర్బంగా ఆ ఈశ్వరుని స్మరించుకుంటూ దిక్సూచీ చిత్రంలోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దిక్సూచి (2019)
సంగీతం : పద్మానవ్ భరద్వాజ్
సాహిత్యం : శ్రీరామ్ తపస్వి 
గానం : హరిణి 

నీలోని సిలకమ్మ
ఏ కొమ్మ సిలకమ్మ

నవరంధ్రముల
గూటిలోనున్న
సిలకమ్మ
ఓరోరి జీవా
నీ శోకమేలా
కర్మానుసారం
స్థిత ప్రజ్ఞుడవరా
శివ లీల నీకు
దిక్సూచి లేరా
కర్తవ్యమెరిగీ
పయనించు నరుడా

నీలోని సిలకమ్మ
ఏ కొమ్మ సిలకమ్మ

నీ చెంత కొండంత
శివదేవుడున్నాడు
నీ వెంట ఆ శివుడు
ఓ దీపమయ్యాడు
చీకట్ల తెరలు
కరిగించినావూ
మజిలీల వలలూ
దాటొచ్చినావూ
శివలీల నీకు
దిక్సూచి కాగా
వసివాడిపోనీ
వెలుగందుకోరా

నీలోని సిలకమ్మ
ఏ కొమ్మ సిలకమ్మ

నీలోని సిలకమ్మ
ఏ కొమ్మ సిలకమ్మ
నవరంధ్రముల
గూటిలోనున్న సిలకమ్మ
సిలకెగిరి పోతే
ఓరోరి నరుడ
నీ తనువు కాదా
ఆ కాటి సమిధ
నీ ఆలు సుతులు
నీ వెంట రారూ
ఇది తెలిసియున్నా
నీ తపన పోదు

నీలోని సిలకమ్మ
ఏ కొమ్మ సిలకమ్మ
  
 

ఆదివారం, డిసెంబర్ 02, 2018

సమయమా...

ఘాజీ దర్శకుడు సంకల్ప్ దర్శకత్వంలో త్వరలో వెలువడనున్న అంతరిక్షం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అంతరిక్షం (2018)
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : యాౙిన్ నిజార్, హరిణి 

సమయమా...
అదేమిటంత తొందరేంటి ఆగుమా
సమయమా...
మరింత హాయి పోగు చేయనీయుమా
చేతిలోన చేతులేసుకున్న చోటులోనా
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోనా
శ్వాసలోకి శ్వాస చేరుతున్న మాయలోన
ఆనంద వర్ణాల సరిగమ..

సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా..
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా

ఆ నింగి జాబిల్లి పై ఏ నీటి జాడున్నదో
నే చూడలేనె అపుడే ఏఏఏ..
ఈ నేల జాబిల్లి పై సంతోష భాష్పాలని
చూస్తూ ఉన్నానే ఇపుడే..ఏఏఏ..
తనే నా సగంగా తనే నా జగంగా
స్వరాల ఊయలూగుతుండగా.. ఆఅ..

ఏడేడు లోకాలు ఆరారు కాలాలు
ఆ తారా తీరాలు ఆనంద ద్వారాలు
తీసి మురిసే వేళా తీపి కురిసే వేళా
ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు 

సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా..
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా 


ఆదివారం, అక్టోబర్ 28, 2018

హిమ సీమల్లో హల్లో...

అన్నయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అన్నయ్య (2000)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : హరిహరన్, హరిణి

హిమ సీమల్లో హల్లో యమగా ఉంది వళ్ళో
ముని మాపుల్లో యల్లో మురిపాల లోయల్లో 

చలి చలిగా తొలి బలి గా ఈడే ధారపోశా
చలిమిడి గా కలివిడి గా అందాలారబోశా
అలకలూరి రామ చిలుక పలుకగనే

హిమ సీమల్లో హల్లో యమగా ఉంది వళ్ళో
ముని మాపుల్లో యల్లో మురిపాల లోయల్లో

 చలి చలిగా తొలి బలి గా ఈడే ధారపోశా
చలిమిడి గా కలివిడి గా అందాలారబోశా
అలకలూరి రామ చిలుక పలుకగనే

 
 సో సో గాని సోయగమా ప్రియ శోభనమా
సుఖ వీణ మీటుదమా
వ వ అంటే వందనమా అభివందనమా
వయసంతా నందనమా
 

మొహమాటమైనా నవ మోహనం
చెలగాట మైనా తొలి సంగమం

మది రగిలే హిమ మహిమా ఓ ఓ
అది అడిగే మగతనమా నీదే భామా
పడుచు పంచదార చిలక పలుకగనే 

 
హిమ సీమల్లో హల్లో యమగా ఉంది వళ్ళో
ముని మాపుల్లో యల్లో మురిపాల లోయల్లో 

 
 మ మ అంటే మాధవుడే జత మానవుడే
పడనీడు ఎండ పొడే

స స అంటే సావిరహే బహు శాఖలహే
నడిజాము జాతరలే
వాటేసుకుంటే వాత్సాయనం
పరువాల గుళ్ళో పారాయణం

రవికననీ రచన సుమా ఓ ఓ
సుమతులకే సుమ శరమా నీవే ప్రేమా
పెదవి ప్రేమలేఖ లిపిని చదవగనే
 
హిమ సీమల్లో హల్లో యమగా ఉంది వళ్ళో
ముని మాపుల్లో యల్లో మురిపాల లోయల్లో  

 చలి చలిగా తొలి బలి గా ఈడే ధారపోశా
చలిమిడి గా కలివిడి గా అందాలారబోశా
అలకలూరి రామ చిలుక పలుకగనే


శుక్రవారం, సెప్టెంబర్ 30, 2016

మధుర మధురతర మీనాక్షీ...

అర్జున్ చిత్రం కోసం మణిశర్మ స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అర్జున్ (2004)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, హరిణి

మధుర మధురతర మీనాక్షీ.. కంచిపట్టునా కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ.. కాశీలో విశాలాక్షి

మధుర మధురతర మీనాక్షీ.. కంచిపట్టునా కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ.. కాశీలో విశాలాక్షి

జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ..
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ
లేత సిగ్గుల సరిగమలా జాబిలీ..
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి

వరములు చిలక స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా..ఆ..

మధుర మధురతర మీనాక్షీ.. కంచిపట్టునా కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ.. కాశీలో విశాలాక్షి

సస సనిదప సస సనిని
సస సనిదప మ..ఆ..ఆ..ఆ..

శృంగారం వాగైనదీ.. ఆ వాగే వైగైనదీ..
ముడిపెట్టే ఏరైనదీ.. విడిపోతే నీరైనదీ..
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడినో తకథిమితోం
విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కదా
మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి

వరములు చిలక స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా

అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నదీ..
మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి లేచినా తెలుగువీర ఘన చరితలలో

తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి
మనసు.. మనసు.. ఒకటైన జంటకి నీ సాక్షి

వరములు చిలక స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా

మధుర మధురతర మీనాక్షీ.. కంచిపట్టునా కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ.. కాశీలో విశాలాక్షి

జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ..
లేత సిగ్గుల సరిగమలా జాబిలీ..
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి

వరములు చిలక స్వరములు చిలక
కరమున చిలక కలదానా
హిమగిరి చిలక శివగిరి చిలక
మమతలు చిలక దిగిరావా

మధుర మధురతర మీనాక్షీ.. కంచిపట్టునా కామాక్షి
మహిని మహిమగల మీనాక్షీ.. కాశీలో విశాలాక్షి

 

మంగళవారం, జులై 12, 2016

మట్టిలాంటి నన్ను...

ప్రేమిస్తే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమిస్తే
సంగీతం : జాషువా శ్రీధర్
సాహిత్యం : వేటూరి
గానం : హరిచరణ్, హరిణి సుధాకర్

ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం
ప్రాణం ..ప్రాణం....ప్రాణం..ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే
 
మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్ల గొట్టి
పట్టు తేనె కోరిందెవరో

మాటలు నేర్పే అమ్మను కూడా మరిచే క్షణము
మనసే దోచే వెన్నెల గువ్వ నీకై పరుగు
నిన్ను చూడ వచ్చే కంటి పాప చేసే ఎంతో పుణ్యం
ఒంటి మీద వాలే వాన చుక్క నీవై తడిపే వైనం
హ్రుదయము నిండే ప్రియమైన మాటే
చెరగని గురుతైపోదా
ఎద చేరి ఏలే చిత్రమైన ప్రేమ
నిన్ను నన్ను కలిపేను కాదా

ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే

మనసులు రెండు ఒకటైపొయే పలికే రాగం
ఎదనే మీటే చెరగని పేరు నిలిపే ప్రాణం
నన్ను తాకి వెళ్ళే చల్లగాలి లోన నీదే తలపు
నాలోఆశ దాచా పైట చాటు చేసా ఎదకే సుఖమై
స్వరముల జల్లై వలపు వెన్నెల్లై
అల్లుకుంటే ప్రేమే కదా
ఆది అంతం లేని మనల 
వీడిపోని దైవం ప్రేమే కాదా

మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే

 

శనివారం, ఫిబ్రవరి 20, 2016

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక...

మురారి చిత్రం కోసం సిరివెన్నెల గారు వ్రాసిన ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : మురారి (2001)
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బి.చరణ్, హరిణి

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక

కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులు
పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు
పరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలు
నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరి
మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది

ఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక

ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
మెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీ
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీ
ఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీ
ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా..

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక
 

సోమవారం, అక్టోబర్ 26, 2015

చిట్టి చిట్టి పులకింత...

జర్నీ చిత్రంలోని ఒక అందమైన ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జర్నీ (2011)
సంగీతం : సత్య
రచన : సాహితి
గానం : సత్య, హరిణి

చిట్టి చిట్టి పులకింత
చిత్రం గా తనువంతా
చేసావు నాలో గోరంత గిలిగింత
వుంటే నువ్వు నా చెంత జన్మంతా కేరింతా
రేపావు యదలో కొండంత కవ్వింతా
నీ జతే కలిసేనా యిక నా యదకే 
కలుగును పరవసమంతా

నువ్వు ఏవో ఏవో వర్ణాలనే నింపావు నా కంటి లో
కళ్ళు తెరిచేలోగా వలపై ఇలా నిండావు నా గుండెలో
మన రేపటి పయనం  మహా  సుందర స్వప్నం
ఓ వేల్లువల్లె నాలో ప్రేమే పొంగి పోయెనే
తోలి కన్నె సిగ్గు సందెవేళ పున్నమాఎలె
హాయిలే లోకమే హాయిలే

ఆ దైవం అరెరే మా హృదయమే మైనం తో చేసాడులే
ఆ మైనం మగువను చూడంగానే కరిగించి వేసాడులే
ఈ మౌన సరాగం మన ఇరువురి సొంతం
నీ శ్వాస ధ్యాస నన్నే తాకి చుట్టమాయేనే
నీ అందమైన జ్ఞాపకాలు చుట్టూ మూగేలే
మూగేనే మువ్వలై మోగేనే

చిట్టి చిట్టి పులకింత చిత్రం గా తనువంతా
చేసావు నాలో గోరంత గిలిగింత



మంగళవారం, ఏప్రిల్ 28, 2015

స్వప్న వేణువేదో...

రావోయిచందమామ చిత్రం కోసం మణిశర్మ కంపోజ్ చేసిన ఒక అందమైన గీతం ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : రావోయి చందమామ(1999)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, హరిణి

స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే

 జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత పూల బాసలు 

కాలేవా చేతి రాతలు 

స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
 నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమ నేనూ రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం 

కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ
నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన
కాలాలే ఆగిపోయినా 

గానాలే మూగబోవునా

నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో

 ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
 

వారేవా ప్రేమ పావురం 
వాలేదే ప్రణయ గోపురం

స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే

 జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత పూల బాసలు 

కాలేవా చేతి రాతలు

 స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.