శనివారం, ఫిబ్రవరి 20, 2016

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక...

మురారి చిత్రం కోసం సిరివెన్నెల గారు వ్రాసిన ఓ చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : మురారి (2001)
సంగీతం : మణిశర్మ
రచన : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బి.చరణ్, హరిణి

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక

కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులు
పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు
పరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలు
నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరి
మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది

ఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక

ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
మెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీ
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీ
ఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీ
ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా

తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా..

అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.