సోమవారం, ఫిబ్రవరి 29, 2016

గుండె నిండా గుడిగంటలు...

శుభాకాంక్షలు చిత్రం కోసం సిరివెన్నెల గారు వ్రాయగా ఎస్.ఎ.రాజ్ కుమార్ స్వరపరచిన ఓ అందమైన ప్రేమ గీతం ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : శుభాకాంక్షలు (2004)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

గుండె నిండా గుడిగంటలు
గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా

గుండె నిండా గుడిగంటలు
గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే

చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా
నిలువెల్లా మారిపొయా నేనే నీ నీడగా
నిలువదు నిముషం నువు యెదురుంటే
కదలదు సమయం కనపడకుంటే
నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా
కవ్విస్తూనే చంద్రజాలం వెశావమ్మా
పరిచయమే చేశావే
నన్నేనాకు కొత్తగా ఓ ప్రేమా

గుండె నిండా గుడిగంటలు
గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే

నీ పేరే పలవరించే నాలోని ఆశలు
మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు
తెరిచిన కనులే కలలకు నెలవై
కదలని పెదవే కవితలు చదివే
ఎన్నెన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని
ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని
నీ జతలో క్షణమైనా బ్రతుకును
చరితగా మార్చెస్తుందమ్మా

గుండె నిండా గుడిగంటలు
గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే
కళ్ళ నిండా సంక్రాంతులు
సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే
వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమా



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.