మంగళవారం, మార్చి 01, 2016

రమ్మంటె రాదుర చెలియా...

అనగనగా ఒక చిత్రం సినిమాకోసం జానపద శైలిలో స్వరపరచిన ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందామ్. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసినది ఆడియో పూర్తి పాట. వీడియో కేవలం ఒక చరణం మాత్రమే ఉంది అది ఇక్కడ చూడవచ్చు. చిత్రం : అనగనగా ఒక చిత్రం (2015)
సంగీతం : వినోద్ యజమాన్య
సాహిత్యం : సురేందర్
గానం : సింహ

ముంచింది ముత్యాల కడవ
దాని ముంగిట సిగ్గులు తడవా
రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగదరియా

ముంచింది ముత్యాల కడవ
దాని ముంగిట సిగ్గులు తడవా
రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగదరియా

దాని పేరే సారంగదరియా
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగదరియా
అది రమ్మంటె రాదుర చెలియా
 
రాదార్లో పరుగుల పడవ అరెరె
రాదార్లో పరుగుల పడవ ఆహా
కోనేరు వీడిన కలువ అరెరె
కోనేరు వీడిన కలువా
నడుముల నాగుల గొడవ అరెరె
నడుముల నాగుల గొడవ ఆహా
సిగ్గుల తలుపులు తెరువ అరెరె
సిగ్గుల తలుపులు తెరువ ఆహా
వయ్యారి నడకల నెమలి ఎయ్
అందాలు పొంగే కడలీ..
అది రమ్మంటె పోతా రాజ్యాలొదిలి

రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగదరియా
అది రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగదరియా

 
చూపుల్లో రంపపు కోతా అరెరె
చూపుల్లో రంపపు కోతా
ఆహా
చేతుల్లో గాజుల మోత
అరెరె
చేతుల్లో గాజుల మోతా
మాటల్లొ కోయిల కూతా
అరెరె
మాటల్లొ కోయిల కూతా
ఆహా
వొళ్ళంత మావిళ్ల పూత
అరెరె
వొళ్ళంత మావిళ్ల పూత
ఆహా
సొగసులు పొదిగిన పైట హేయ్
పరువాలు పండిన తోట
దాని తోటకు కావలి నేనే ఉంటా

రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగదరియా
అరె రమ్మంటె రాదుర చెలియా
దాని పేరే సారంగదరియా

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.