మంగళవారం, మార్చి 15, 2016

చికు బుకు చికు బుకు రైలే...

జెంటిల్ మేన్ సినిమా కోసం రహ్మాన్ స్వరపరచిన ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జెంటిల్‌మేన్ (1993)
రచన : రాజశ్రీ
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : సురేష్ పీటర్

చికు బుకు చికు బుకు రైలే
అదిరెను దీని స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది ఓకే అంటే గుబులే

చికు బుకు చికు బుకు రైలే
అదిరెను దీని స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది ఓకే అంటే గుబులే


దీని చూపుకు లేదు ఏ భాషా
కళ్లలోనే ఉంది నిషా
ఈ హొయలే చూస్తే జనఘోష
చెంగు తగిలితే కలుగును శోష

చికు బుకు చికు బుకు రైలే
అదిరెను దీని స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది ఓకే అంటే గుబులే


అహ... సైకిలెక్కి మేం వస్తుంటే
మీరు మోటర్ బైకులే చూస్తారు
అహ... మోటర్ బైకులో మేం వస్తుంటే
మీరు మారుతీలు వెతికేరు
అహ... జీన్స్ ప్యాంట్సుతో మేం వస్తే
మీరు బ్యాగి ప్యాంట్సుకై చూస్తారు
అహ... బ్యాగి ప్యాంట్సుతో మేం వస్తే
మీరు పంచలొంక చూస్తారు
మీకు ఏవి కావాలో 
మాకు అర్థం కాలేదే
పూలబాణాలేశామే 
పిచ్చివాళ్లయి పోయామే  

చికు బుకు చికు బుకు రైలే
అదిరెను దీని స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది ఓకే అంటే గుబులే


మాకు ఆటపాటలో అలుపొచ్చే
మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చే
మా మతులు చెదిరి తల నెరుపొచ్చే
రాదులే వయసు మళ్లీ
మీ పెళ్లి కొరకు మీ పెద్దోళ్లు 
రేపిచ్చుకోవాలి కట్నాలు
అవి లేక జరగవు పెళ్లిళ్లు 
ఎందుకీ గోల మీకు
మీరు ఇపుడే లవ్‌చేస్తే 
మూడుముళ్లు పడనిస్తే
కన్నవాళ్లకు అది మేలు 
చిన్నవాళ్లకు హ్యాపీలు

చికు బుకు చికు బుకు రైలే
అదిరెను దీని స్టైలే
చక్కనైన చిక్కనైన ఫిగరే
ఇది ఓకే అంటే గుబులే


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.