ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
పుడుతూ..పైటలేసావా
దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
రాత్రి మేలుకొంటావా..తెల్లవార్లు
దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిత్రం : ఒకరాధా ఇద్దరుకృష్ణులు (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిలకలా..హోయ్..కొరకనా..ఆ
ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
దోరగా..ఆ..హోయ్..దొరకనా..ఆ
నా కన్ను కోరింది పండు..హోయ్
కౌగిళ్ళకే..ఈడు పండూ..
కాయా పండా..నీవూ..ఊ
గుమ్మాన గుమ్మళ్ళ పండు..హోయ్
నీ ముద్దుకే..నోరు పండూ..
పండో.దిండో అవ్వూ..ఊ
దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిలకలా..హోయ్..కొరకనా..ఆ
దోరగా..ఆ..హోయ్..దొరకనా..ఆ
పుడుతూ..పైటలేసావా
పుట్టినాక పైట ఆరుబైట వేసావా
పుడుతూ ఆటకొచ్చాను..నైటుకొక్క
ఆట ఆడి పేట నేలానూ..ఊ
ఆడే ఆట చూసి..చెప్పే రేటు చూసి
కన్నే గీటి వచ్చాను..ఊ ఊ ఊ
నీలో నీటు చూసి..వేసే నాటు చూసి
నేనూ..సైటు కొట్టానూ..ఊ
ఎంత పొదుపో నీకు చీర తెలుపూ
ఎంత దుడుకో నీకు..చేతి నడుగూ
నా చెయి వై చేయి దయచేయి పక్కకి
దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిలకలా..హోయ్..కొరకనా
ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
దోరగా..ఆ..హోయ్..దొరకనా..ఆ
నా కన్ను కోరింది పండు..హోయ్ హొయ్
కౌగిళ్ళకే..ఈడు పండూ..
కాయా పండా..నీవూ..ఊ
ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
దోరగా..ఆ..హోయ్..దొరకనా.ఆ
చిలకలా..హోయ్..కొరకనా..ఆ
రాత్రి మేలుకొంటావా..తెల్లవార్లు
మేజువాణి చేసుకొంటావా..ఆ..హాహాహా
పగలే ఇంటికొస్తవా..వగలమారి
పరువు తీసి..వీధి నేస్తావా..ఆ
తాడూ..పేడు లేని..ఈడూ జోడు చూసి
వేలం పాట కొచ్చానూ..ఊ ఊ ఊ
వేళా పాళ లేని..వేలం వెర్రి చూసి
తాళం నేను మార్చానూ..ఊ
అర్ధరాత్రే నీకు..ఆట విడుపూ..ఊ
పొద్దు పొడుపే నీకు..వీడు కొలుపూ..ఊ
మాటల్తో దాచేసి..పూటంత గడపకు
దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిలకలా..హోయ్..కొరకనా
ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
దోరగా..ఆ..హోయ్..దొరకనా..ఆ
నా కన్ను కోరింది పండూ..హోయ్
కౌగిళ్ళకే..ఈడు పండూ..
కాయా పండా..నీవూ..ఊ
గుమ్మాన గుమ్మళ్ళ పండు..హోయ్ హోయ్
నీ ముద్దుకే..నోరు పండూ..
పండో.దిండో అవ్వూ..ఊ
దానిమ్మ మొగ్గరో..ఈ గుమ్మ బుగ్గరో
చిలకలా..హోయ్..కొరకనా
ఓయమ్మ సిగ్గురో..ఒళ్ళంత అగ్గిరో
దోరగా..ఆ..హోయ్..దొరకనా..ఆ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.