గురువారం, మార్చి 24, 2016

బుగ్గే బంగారమా...

నచ్చిన అమ్మాయితో పెళ్ళి కుదిరితే ఆ మైమరపులో ఎవరిని చూసినా తనని చూసినట్లే ఉంటుంది కదా అదిగో అలాంటి ఓ అబ్బాయి ఊహల్ని ఈ పాటలో మీరే చూడండి. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : చందమామ (2007)
సంగీతం : కె.ఎం.రాధాకృష్ణ
సాహిత్యం : పెద్దాడ మూర్తి
గానం : రాజేష్

పచ్చిపాల యవ్వనాల గువ్వలాట
పంచుకుంటే.. రాతిరంతా జాతరంట

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళె వయ్యారమా నవ్వే మందారమా
నన్నే కాజేసెనమ్మా
పట్టుచీరల్లో చందమామ
ఏడువన్నెల్లో వెన్నెలమ్మా
కన్నెరుపాన కోనసీమ
కోటితారల్లో ముద్దుగుమ్మా
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళె వయ్యారమా నవ్వే మందారమా
నన్నే కాజేసెనమ్మా

యాలో యాల యేలో యేలో
యాలో యాలా యేలెలో
యాలో యాల యేలో యేలో
యాలో యాలా యేలెలో

ఎదురే నిలిచే అధర మధుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం.. చెలికే సొంతం.. వసంతం
వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు.. కలలో జరిగే విహారం

పుష్యమాసానా మంచునీవో
భోగిమంటల్లో వేడినీవో
పూల గంధాల గాలినీ..వో
పాలనురగల్లో తీపినీవో

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసెలేమ్మా

హియర్ వీ గో ..

నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందెగాలి కొట్టగానె అరుబైట ఎన్నెలింట
సద్దుకున్న కన్నెజంట సద్దులాయెరో.. యో..
నారుమల్ల తోటకాడ నాయుడోరి ఎంకిపాట
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార
సందెగాలి కొట్టగానే ఆరుబయట ఎన్నెలింట
సద్దుకున్న కన్నెజంట సద్దులాయెరో

ఎదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో
జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం.. జరిగే సరసం.. ఎపుడో

అన్నిపువ్వుల్లో ఆమె నవ్వే..
అన్ని రంగుల్లో ఆమె రూపే..
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే..
నన్ను మొత్తంగా మాయచేసే..

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా
అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా
నన్నే కాజేసెనమ్మా
పట్టుచీరల్లో చందమామ
ఏడువన్నెల్లో వెన్నెలమ్మా
కన్నెరుపాన కోనసీమ
కోటితారల్లో ముద్దుగుమ్మా1 comments:


బుగ్గే బంగార మురా !
సిగ్గే సింగారమయ్యె సిరివెన్నెలనన్
బుగ్గే జూచెన్ సిగ్గున్
నిగ్గే బోయెన్ జిలేబి నిమ్మది బోయెన్ !

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.