గురువారం, మార్చి 31, 2016

రామనామమను వేదమే...

రజనీకాంత్ నటించిన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం చిత్రంలోని ఓ చక్కని భక్తి గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : శ్రీ మంత్రాలయ రాఘవేంద్రస్వామి మహత్యం (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : గోపి
గానం : కె.జె.ఏసుదాస్, వాణీజయరాం

సారిగమప.. సారిగమప
పదమప.. పదమప
పదమపదనిస.. పదమపదనిస 
ఆహా...
సానిదపమగరిస..గరిస..

రామనామమను వేదమే..
రామనామమను వేదమే..
మనసను వీణను మీటినదో
ఎదలో పాటగా మ్రోగినదో
నిరతము రామనామమను వేదమే
రాగ తాళముల గీతమై..

రాముడు శ్రీహరి అవతారం.. ఊఊ...ఆఆ
రాముడు శ్రీహరి అవతారం..
అహల్యను కాచిన అవతారం
రఘువంశాంభుది ద్యానం చేస్తే
కైవల్యానికి మార్గం కాదా...

రామనామమను వేదమే
రాగ తాళముల గీతమై..

ఆఆఆఆ..ఆఆఆ..ఆఆఆ
గౌతముని సతి శిరముపై
దాల్చి కొలిచిన పాదమే ప్తతి యుగము
ఆపన్నులకు అభయమే ఒసగి బ్రోచినా చరణమే
దశరధుని వంశాన ఉదయించి 
ధర్మాన్ని పాలించ వెలసిన దశరథ రామ్
అంతరమున వైదేహినోదార్చి 
వైభోగముల తేల్చ వెలసిన రామ్
రక్కసి మూకల ముట్టడగించగ 
దండము దాల్చిన కోసల రామ్
సేవలు నెరపిన వానర యోధుల 
మనసుల వెలసిన పావన రామ్ 
నీనామ సంకీర్తనే జగములకు నిత్యం
జయమొసగు వరమొసగు శుభమొసగు
నీ పాదాలకు పరమాత్మా ఇది నేవేసే పూమాలా
నమ్మిన వారికి నాశము లేదు 
నీ తిరు నామమే శరణం మాకు

రామనామమను వేదమే
సనిదపమ
రామనామమను వేదమే
సపమగరి సనిదపమ సరిగమ
రామనామమను వేదమే

రామనామమను వేదమే
రాగ తాళముల గీతమై..
మనసను వీణను మీటినదో
ఎదలో పాటగా మ్రోగినదో
నిరతము రామనామమను వేదమే
రాగ తాళముల గీతమై..1 comments:

భామిని మోక్షము గోరన్
నీమము తోడుగన ముక్తి నిక్కము గానన్
రాముని మనసున తలచెను
నామము నాతని జిలేబి నావగ జేసెన్

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.