వయసున్న నాడు నీలాటి పిల్ల దొరకలేదు ఇపుడు ప్రేమించి చూడమంటూ వెంటపడిన ఈ తాతగారిని చూసి బెంబేలు పడిన ఈ చిన్నది చివరికి తన సోగ్గాడే తనని ఎలా ఫూల్ ని చేశాడో తెలుసుకున్న వైనం చూసి మీరూ నవ్వుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : ఆత్రేయ
గానం : ఘంటసాల
ప్రేమించి చూడు పిల్లా
పెళ్ళాడుదాము మళ్ళా
వయసున్న నాడు ఇలా
దొరకలేదొకపిల్లా..
వయసున్న నాడు ఇలా
దొరకలేదొకపిల్లా..
ప్రేమించి చూడుపిల్లా..ఆ ఆ ఆ ఆ ఆ
పెళ్ళాడుదాము మళ్ళా
వయసున్న నాడు ఇలా
దొరకలేదొకపిల్లా..
వయసున్న నాడు ఇలా
దొరకలేదొకపిల్లా..
ప్రేమించి చూడుపిల్లా..ఆ ఆ ఆ ఆ ఆ
పట్టెమంచమెక్కలేదు
పాలు పళ్ళు మెక్కలేదు
నిన్ను చూసేదాకా
ప్రేమంటే తెలియలేదు
నిన్ను చూచేదాకా
ప్రేమంటే తెలియలేదు
ప్రేమంటే తెలియలేదు
ప్రేమించి చూడు పిల్లోయ్
పెళ్ళాడుదాము మళ్ళా
ముగ్గు బుట్టాయే తల
ముడతపడే ముఖం ఇలా
ముగ్గు బుట్టాయే తల
ముడతపడే ముఖం ఇలా
పొద్దువాలిపోయే వేళ
పొత్తు కుదిరేనె పిల్లా
పొత్తు కుదిరేనె పిల్లా
ప్రేమించి చూడు పిల్లోయ్
పెళ్ళాడుదాము మళ్ళా
ముడతపడే ముఖం ఇలా
ముగ్గు బుట్టాయే తల
ముడతపడే ముఖం ఇలా
పొద్దువాలిపోయే వేళ
పొత్తు కుదిరేనె పిల్లా
పొత్తు కుదిరేనె పిల్లా
ప్రేమించి చూడు పిల్లోయ్
పెళ్ళాడుదాము మళ్ళా
కాయలో రుచిలేదే
పండులో పసవేరే
దుక్కవలే దేహమున్నా
లెక్కేమె వయసైనా
లెక్కేమె వయసైనా
అత్తగారి పోరులేదు
మామగారి అదుపులేదు
అత్తగారి పోరులేదు
మామగారి అదుపులేదు
ముసలాడే మొగుడైతే
మురిపాలకు కొదువలేదు
మురిపాలకు కొదవ లేదు
ప్రేమించి చూడు పిల్లా ఆ ఆ ఆ ఆ ఆ
పండులో పసవేరే
దుక్కవలే దేహమున్నా
లెక్కేమె వయసైనా
లెక్కేమె వయసైనా
అత్తగారి పోరులేదు
మామగారి అదుపులేదు
అత్తగారి పోరులేదు
మామగారి అదుపులేదు
ముసలాడే మొగుడైతే
మురిపాలకు కొదువలేదు
మురిపాలకు కొదవ లేదు
ప్రేమించి చూడు పిల్లా ఆ ఆ ఆ ఆ ఆ
గడ్డాన్ని చూచి ఇంతా
కంగారు ఏల వింతా
పైపైన చూడవద్దు
నాలోన మెరుగు కద్దూ
పైపైన చూడవద్దు
నాలోన మెరుగు కద్దూ
నాలోన మెరుగు కద్దూ
మనసైన సోకుగాడే
వయసున్న కుర్రవాడే
మనసైన సోకుగాడే
వయసున్న కుర్రవాడే
సరి అయిన జోడు వీడే
మనువాడి చూడు నేడె
సరి అయిన జోడు వీడే
మనువాడి చూడు నేడె
మనసైన సోకుగాడే
వయసున్న కుర్రవాడే
లల్లాలి లాలలలా లల్లాలి లాలలలా
కంగారు ఏల వింతా
పైపైన చూడవద్దు
నాలోన మెరుగు కద్దూ
పైపైన చూడవద్దు
నాలోన మెరుగు కద్దూ
నాలోన మెరుగు కద్దూ
మనసైన సోకుగాడే
వయసున్న కుర్రవాడే
మనసైన సోకుగాడే
వయసున్న కుర్రవాడే
సరి అయిన జోడు వీడే
మనువాడి చూడు నేడె
సరి అయిన జోడు వీడే
మనువాడి చూడు నేడె
మనసైన సోకుగాడే
వయసున్న కుర్రవాడే
లల్లాలి లాలలలా లల్లాలి లాలలలా
1 comments:
ఓ మంచి పిల్ల రావే
ప్రేమించి మనం జిలేబి ఫేము గవుతమే !
మా మంచి మాట ! రావోయ్
భామను నేనే సరిసరి బావా నీకున్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.