శనివారం, ఏప్రిల్ 23, 2016

మల్లెలతో ఆడుకునే...

మమతల కోవెల చిత్రం కోసం మహదేవన్ గారి స్వర కల్పన లో వచ్చిన ఓ మధుర గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మమతల కోవెల (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సహిత్యం :
గానం : బాలు, జానకి

మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయి
వెన్నెలతో కిన్నెరలా ఆడుకో హాయిగా ప్రతిరేయి
మల్లెలతో ఆడుకునే మనసుంటే సరిపోదోయి
ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి

నీ కళ్ళలోనే కౌగిళ్ళలోనే నూరేళ్ళు ఉండాలనీ హా
ఆ గుండేలోనే నీరెండలోనే నీరల్లె ఆడాలనీ
ఓ మావిళ్ల పులుపే వేవిళ్ళ వలపై
దాగుళ్ళు ఆడే లోగిళ్ల లోనా
గుడి గుడి గుంచెం గుండే రాగం పాడాలనీ

మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయి
ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి

కేరింతలాడే గోరంత దీపం నా ఇంట వెలగాలనీ హో
కవ్వింతలాడే అందాల రూపం నట్టింట తిరగాలనీ
ఓ చిన్నారులాడే చిరునవ్వులన్నీ
అందాలు విరిసే హరివిల్లే ఐతే
ఆ హరివిల్లే మన పొదరిల్లై ఉండాలనీ

మల్లెలతో ఆడుకునే మనసుంటే సరిపోదోయి
ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి
మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయి
వెన్నెలతో కిన్నెరలా ఆడుకో హాయిగా ప్రతిరేయి


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.