ఆదివారం, ఏప్రిల్ 17, 2016

ఓఓఓ వయ్యార మొలికే...

మంగమ్మ శపథం చిత్రంలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంగమ్మ శపధం (1965)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల, సుశీల

ఓ.. ఓ.. ఓ..
వయ్యార మొలికే చిన్నదీ.. ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మన్నది..
ఆ.. ఆ.. ఆ..
సయ్యాటలాడే ఓ దొరా.. సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా...

ఇంతలోనే ఏ వింత నీలో.. అంత తొందర కలిగించెను
చెంత నిలిచిన చిన్నారి చూపే.. అంతగా నన్ను కవ్వించెను
మనసే చలించెను.. అనురాగ వీణ పలికించెను

ఆ.. ఆ.. ఆ..
సయ్యాటలాడే ఓ దొరా.. సరసాలు మానరా
కవ్వింతలేల ఇక చాలురా...

హొయలు చిలికే నీ కళ్ళలోని.. ఓర చూపులు ఏమన్నవి
నగవు లొలికే నా రాజులోని.. సొగసులన్ని నావన్నవి
తలపే ఫలించెను.. తొలి ప్రేమ నేడు చిగురించెను

ఓ.. ఓ.. ఓ..
వయ్యారమొలికే చిన్నదీ.. ఉడికించుచున్నదీ
రమ్మంటే రాను పొమ్మన్నది..


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.